News


8నెలల గరిష్టానికి టాటా మోటర్స్‌

Thursday 2nd January 2020
Markets_main1577948973.png-30616

టాటా మోటర్స్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 9నెలల గరిష్టాన్ని అందుకుంది. అమెరికా చైనాల మధ్య వాణజ్య ఒప్పందం కుదరవచ్చనే అంచనాలు షేరు లాభపడేందుకు కారణమని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. అర్థికంగా అతిపెద్ద దేశాల మధ్య కుదరనున్న ఈ వాణిజ్య ఒప్పందంతో టాటామోటర్స్‌ అనుబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా పెరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాటా మోటర్స్‌కు చైనా అతిపెద్ద మార్కెట్‌ కాగా తరువాత స్థానాల్లో అమెరికా, యూరప్‌లుగా ఉన్న సంగతి తెలిసిందే. నేటి మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో 3శాతం లాభపడి రూ.190.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ గరిష్ట ధర షేరుకు 8నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నం గం.12:00లకు షేరు క్రితం ముగింపు(రూ.184.45)తో పోలిస్తే 2.98శాతం లాభంతో రూ.189.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.106.00, రూ.239.35లుగా ఉన్నాయి. ఇక నిన్నటి రోజున కంపెనీ డిసెంబర్‌ వాహన విక్రయ గణాంకాలను విడుదల చేసింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం అమ్మకాలు 12శాతం క్షీణించి 44,254 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే డిసెంబర్‌లో మొత్తం అమ్మకాలు 50,440 యూనిట్లుగా ఉన్నాయి. 



You may be interested

స్టెరిలైట్‌కు తెలంగాణ ప్రాజెక్ట్‌- షేరు జూమ్‌

Thursday 2nd January 2020

గ్రామీణ ప్రాంతాలకు హై‍స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ తెలంగాణవ్యాప్తంగా 11 జిల్లాలలో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు వీలుగా భారీ ప్రాజెక్టును గెలుపొందినట్లు స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ తాజాగా వెల్లడించింది. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌తో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 3,000 గ్రామ పంచాయతీల పరిధిలో అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా ఆరు మిలియన్లమందికి అందుబాటు ధరల్లో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ

2020లో నిఫ్టీ@ 14, 400!

Thursday 2nd January 2020

బ్రోకరేజ్‌ల అంచనా దేశీయ సూచీలు 2019ని 12- 14 శాతం లాభాలతో ముగించాయి. ఇదే జోరు కొత్త ఏడాదిలో కూడా కొనసాగుతుందని, నిఫ్టీ 2020లో 14400 పాయింట్లను చేరుతుందని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. నిఫ్టీ 2019 ముగింపుతో పోలిస్తే దాదాపు 18 శాతం మేర కొత్త ఏడాది లాభపడవచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. నిఫ్టీ ప్రస్తుతం కీలకమైన టార్గెట్‌ 12300ను తాకిందని, ఈ దశలో కొంత వెనకంజ వేసి 11900-

Most from this category