News


టాటామోటర్స్‌కు చైనా జేఎల్‌ఆర్‌ అమ్మకాల జోష్‌

Friday 10th January 2020
Markets_main1578653390.png-30838

  • 2.50శాతం లాభంతో ముగిసిన షేరు
  • ఇంట్రాడేలో 8నెలల గరిష్టానికి

చైనాలో డిసెంబర్‌ అమ్మకాలు పెరిగినట్లు గణాంకాలు వెలువడటంతో టాటా మోటర్స్‌ షేరు శుక్రవారం 2.50శాతంతో ముగిసింది. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో మునుపటి ముగింపు(రూ.192.05)తో పోలిస్తే అతిస్వల్ప లాభంతో రూ.192.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి ఇంట్రాడేలో డిసెంబర్‌ నెలకు సంబంధించిన జేఎల్‌ఆర్‌ విక్రయ గణాంకాలు విడుదలయ్యాయి. చైనాలో ఈ డిసెంబర్‌లో మొత్తం  52,814 వాహనాలు విక్రయం జరిగినట్లు గణాంకాలు తెలిపాయి. వార్షిక ప్రాతిపాదికన పోలిస్తే అమ్మకాలు 1.3శాతం వృద్ధి చెందాయి. అమ్మకాల జోష్‌తో షేరు ఒకదశలో 3.61శాతం పెరిగి రూ.199.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ధర షేరుకు ఇది 8నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. అనంతరం గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో షేరు లాభం కొంత తగ్గి చివరికి.2.27శాతం లాభంతో రూ.196.40 వద్ద స్థిరపడింది. 



You may be interested

అంచనాలను మించి ఇన్ఫీ లాభం

Friday 10th January 2020

మూడో త్రైమాసికంలో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌ లాభాలు అంచనాలను మించాయి. క్యు3లో కంపెనీ లాభం 4457 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. అనలిస్టులు క్యు3లో 4200 కోట్ల రూపాయల లాభం అంచనా వేశారు. గతేడాది క్యూ3తో పోలిస్తే లాభం 23.5 శాతం అధికం. త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ. 23092 కోట్లుగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రెవెన్యూ 7.9 శాతం పెరిగింది. మార్జిన్లు మాత్రం అంచనాల కన్నా కాస్త తక్కువగా

మార్కెట్లు ప్లస్‌లోనే- నిఫ్టీ కొత్త రికార్డు

Friday 10th January 2020

ఇంట్రాడేలో 12,311కు నిఫ్టీ సెన్సెక్స్‌ 150 పాయింట్లు అప్‌ రియల్టీ, మెటల్‌, ఆటో జోరు చిన్న షేర్లు వెలుగులో అంతర్జాతీయ మార్కెట్లలో బలపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లోనూ జోరు చూపాయి. సెన్సెక్స్‌ 148 పాయింట్లు బలపడి 41,600కు చేరగా.. నిఫ్టీ 41 పాయింట్లు పుంజుకుని 12,257 వద్ద ముగిసింది. గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకోవడంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో మిడ్‌ సెషన్‌కల్లా

Most from this category