News


టాటా మోటర్స్‌..5 నెలల కనిష్ఠానికి

Friday 26th July 2019
Markets_main1564115047.png-27324

దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా నికర నష్టాలను ప్రకటించడంతో, శుక్రవారం ఈ కంపెనీ షేరు ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అంతేకాకుండా గత  సెషన్‌లో 4 శాతం నష్టపోయి రూ.144.30 వద్ద ముగిసింది. ఈ రోజు సెషన్‌లో మరో 3 శాతం నష్టంతో ఐదు నెలల కనిష్టస్థాయి రూ.138.10 వద్ద ప్రారంభమై తిరిగి కోలుకుంది. ఉదయం 9.47 సమయానికి టాటా మోటర్స్‌ షేరు  0.76 శాతం లాభపడి రూ.145.40 వద్ద ట్రేడవుతోంది. 
   గత క్యూ1లో రూ.1,863 కోట్లుగా ఉన్న కంపెనీ నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ1లో దాదాపు రెట్టింపై రూ.3,680 కోట్లకు పెరిగాయి. చైనాతో పాటు భారత్‌లో కూడా అమ్మకాలు తగ్గడం, మార్కెటింగ్‌ వ్యయాలు అధికంగా ఉండటం, అమ్మకాలు పెంచుకోవడానికి పెద్ద మొత్తాల్లో డిస్కౌంట్లు ఆఫర్‌ చేయడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పి.బి. బాలాజీ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.66,701 కోట్ల నుంచి 8 శాతం తగ్గి రూ.61,467 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.  స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ1లో రూ.1,188 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ1లో రూ.97 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించారు. వడ్డీ వ్యయాలు రూ.336 కోట్ల నుంచి నాలుగు రెట్లు పెరిగి రూ.1,712 కోట్లకు చేరాయని తెలిపారు. 

 



You may be interested

69.13 వద్ద రూపీ ప్రారంభం

Friday 26th July 2019

విదేశీ నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగుతుండడంతో పాటు అంతర్జాతీయంగా డాలర్‌ బలపడుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో 9 పైసలు బలహీనపడి శుక్రవారం ట్రేడింగ్‌లో 69.13 వద్ద ప్రారంభమైంది. అంతేకాకుండా దేశియ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో, చమురు ధరలు పెరగడం కూడా రూపీ బలహీనపడడానికి కారణమయ్యాయి. గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో 6 పైసలు తగ్గి 69.04 వద్ద స్థిరపడింది. విదేశీ సావరిన్ బాండ్లను జారీ చేయాలనే ఆలోచనను

తగ్గిన చమురు

Friday 26th July 2019

యూఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ కారణంగా అంతర్జాతీయ మందగమనం ఇంకా కొనసాగే అవకాశం ఉందని రాయిటర్ పోల్‌ పేర్కొనడంతో చమురు ధరలు శుక్రవారం నష్టపోయి ట్రేడవుతున్నాయి. కానీ మధ్య ప్రాచ్య ఒత్తిళ్ల వలన ఈ నష్టాలు పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ 0.4 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.15 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.1 శాతం తగ్గి బ్యారెల్‌కు 55.97 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌

Most from this category