లాభాల బాటలో టాటా మోటర్స్
By Sakshi

అటోరంగ దిగ్గజం టాటా మోటర్స్ షేర్లు గురువారం 4.50శాతం లాభపడ్డాయి.అటో రంగ షేర్ల ర్యాలీలో భాగంగా నేడు ఈ కంపెనీ షేర్లకు డిమాండ్ పెరిగింది. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.162.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 4.22శాతం ర్యాలీ చేసి రూ.167.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గతముగింపు(రూ.161.1)తో పోలిస్తే 3.20శాతం లాభంతో రూ.166.25 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 141.90 రూ.282.00లుగా నమోదయ్యాయి.
ఇదే సమయానికి ఎన్ఎస్ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ అటో ఇండెక్స్ 1శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. టాటామోటర్స్ (3శాతం), మహీంద్రా అండ్ మహీంద్రా(2శాతం) ఇండెక్స్‌ను లీడ్ చేస్తున్నాయి.
You may be interested
వాటా విక్రయంతో యాక్సిస్ బ్యాంక్ హెచ్చుతగ్గులు
Thursday 27th June 2019యాక్సిస్‌బ్యాంక్ షేరు గురువారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. ఒకదశలో ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.806.65 నుంచి 2 శాతం నష్టపోయి రూ.781 వద్దకు తగ్గిన యాక్సిస్ బ్యాంక్ తిరిగి పుంజుకుని రూ. 800 సమీపంలో క్లోజయ్యింది. కంపెనీ షేర్ల అమ్మకం ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 130 కోట్ల డాలర్లను సమీకరించనుందని బ్లుమ్‌బర్గ్ వార్తా సంస్థ నివేదించడంతో ఈ షేరులో హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. రూ.789.35 వద్ద ప్రారంభమై, మొదట్లోనే 2శాతం లాభపడి రూ.806.65కు చేరుకుంది.
2022 నాటికి 50వేలకు సెన్సెక్స్!
Thursday 27th June 2019కోటక్ సెక్యూరిటీస్ అంచనా మోదీ ప్రభుత్వ పాలన మూడో ఏడుకు చేరేనాటికి సెన్సెక్స్ 50వేల పాయింట్లను చేరవచ్చని కోటక్ సెక్యూరిటీస్ నిపుణుడు రస్మిక్ ఓజా అంచనా వేశారు. బడ్జెట్ వరకు నిఫ్టీ అటుఇటు ఊగిసలాడుతూనే ఉంటుందన్నారు. ఒకవేళ నిఫ్టీ 12వేల పాయింట్లను చేరితే వాల్యూషన్ల పరంగా మరోమారు గత గరిష్ఠాలకు చేరువైనట్లవుతుందన్నారు. జూలై సీరిస్‌కు నిఫ్టీ పుట్స్ కొనుగోలు చేయడం ద్వారా పోర్టుఫోలియోలో లాంగ్స్‌ను హెడ్జ్ చేసుకోవచ్చని, బడ్జెట్లో అనూహ్య ప్రతిపాదనల