News


లాభాల బాటలో టాటా మోటర్స్‌

Thursday 27th June 2019
Markets_main1561631867.png-26633

అటోరంగ దిగ్గజం టాటా మోటర్స్‌ షేర్లు గురువారం 4.50శాతం లాభపడ్డాయి.అటో రంగ షేర్ల ర్యాలీలో భాగంగా నేడు ఈ కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.162.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 4.22శాతం ర్యాలీ చేసి రూ.167.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌​ముగింపు సమయానికి (రూ.161.1)తో పోలిస్తే 3 శాతం లాభంతో రూ.165.85 వద్ద స్థిరపడింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 141.90 రూ.282.00లుగా నమోదయ్యాయి. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1శాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. టాటామోటర్స్‌ (3శాతం), మహీంద్రా అండ్‌ మహీంద్రా(2శాతం) ఇండెక్స్‌ను లీడ్‌ చేశాయి. 



You may be interested

గో ఎయిర్‌ ఐపీఓకు సిద్ధం

Thursday 27th June 2019

వాడియా గ్రూప్‌కు చెందిన గో ఎయిర్‌ తన ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)ను పునరుద్ధరించుకునేందుకు సిద్ధపడుతోంది. రూ.1,728-2,074కోట్ల మూలధనాన్ని సమీకరించుకునేందుకు ఐపీఓకి రానుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.‘‘గో ఎయిర్‌ మూల ధనాన్ని సమీకరించుకునేందుకు సీటి, మోర్గాన్‌ స్టాన్లీ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌బ్యాంక్‌లతో సంప్రదింపులు జరుపుతోంది. ఎంత పరిమాణంలో షేర్లను ఐపీఓలో అందుబాటులో పెట్టనుందో ఇంకా నిర్ణయం జరగలేదు. ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఈ నిర్ణయం ఉంది’’ అని అన్నారు. దేశియ విమానయాన రంగంలో మొదటి స్థానంలో ఉన్న

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Thursday 27th June 2019

11850 దిగువన ముగిసిన నిఫ్టీ జూన్‌ డెరివేట్‌ కాంటాక్టుల ముగింపు రోజున మార్కెట్‌ దాదాపు ఫ్లాట్‌గా ముగించింది. సెన్సెక్స్‌ 5పాయింట్ల నష్టంతో 39,586 వద్ద, నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 11,844.10 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఐటీ, మెటల్‌, మీడియా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. అటో, రియల్టీ, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రైవేట్‌ రంగ షేర్ల బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన

Most from this category