News


టాటామోటర్స్‌ షేర్ల రివర్స్‌ గేర్‌..!

Wednesday 21st August 2019
Markets_main1566379117.png-27922

  • 10శాతం క్షీణించిన షేర్లు 

దేశీయ వాహన తయారీ రంగ దిగ్గజ కంపెనీ టాటామోటర్స్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 10శాతం క్షీణించాయి. ట్రేడ్‌వార్‌ ప్రభావంతో కంపెనీ అనుబంధ సంస్థ  జేఎల్‌ఆర్‌ ఆదాయాలు క్షీణించడం, కేర్‌ రేటింగ్‌ సం‍స్థ కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్‌ ఎఎ నుంచి ఎఎ(-)కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించడం, ప్రపంచవ్యాప్తంగా అటో రంగ బలహీనంగా ఉండటం షేర్ల పతనానికి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.123.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో షేరు 11.50శాతం క్షీణించి రూ.109.55 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.2:20నిల.కు షేరు కిత్రం ముగింపు ధర(రూ.123.8)తో పోలిస్తే 9.50శాతం నష్టంతో రూ.112.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.109.55,  రూ.282.00లుగా నమోదయ్యాయి. ఏడాది కాలంలో 58శాతం పతనమైన షేర్లు, ప్రస్తుతం కొన్నేళ్ల కనిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. చైనా లో అమ్మకాలు తిరిగి పుంజుకోవడంతో, దేశీయంగా సాధారణ వర్షపాతం నమోదు కావడం, అటోరంగ వృద్ధికి కేంద్రం నిధుల కేటాయింపు ప్రకటించే అవకాశం ఉండటం తదితర అంశాలు షేరును తిరిగి లాభాల బాట పట్టించవచ్చనే అశావహ ధృక్పధ విశ్లేషకులు వ్యక్తం చేశారు.  



You may be interested

మందగమన ఆందోళనతో నష్టాల ముగింపు

Wednesday 21st August 2019

వృద్ధి మందగమన ఆందోళనతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ రెండోరోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 267.64 పాయింట్లు నష్టపోయి 37,060.37 వద్ద, నిఫ్టీ 98.30 పాయింట్లు పతనమైన 10,918.70 వద్ద స్థిరపడ్డాయి. మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు క్యూ1లో జీడీపీ వృద్ధి క్షీణించవచ్చనే అంచనాలతో మార్కెట్లో అమ్మకాలు తీవ్రతరమయ్యాయి. క్యూ1లో పెట్టుబడులు క్షీణించడం, సేవారంగం ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, వినియోగం

కరుగుతున్న మెటల్‌ షేర్లు

Wednesday 21st August 2019

2.50 శాతం క్షీణించిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మార్కెట్‌ పతనంలో భాగంగా మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 3శాతం క్షీణించింది. నేడు ఇండెక్స్‌ 2,340.35 వద్ద ప్రారంభమైంది. ట్రేడ్‌వార్‌ కారణంగా చైనాలో మెటల్‌ నిల్వలు పెరగడటం, ధరలు క్షీణించడంతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇదే ట్రెండ్‌ దీర్ఘకాలం పాటు కొనసాగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మైనింగ్‌ దిగ్గజం

Most from this category