News


టాప్‌గేర్‌లో టాటా మోటార్స్‌

Wednesday 11th September 2019
Markets_main1568186748.png-28307

కలిసొచ్చిన చైనా ఆగస్ట్‌ అమ్మకాల రికవరి
టాటామోటర్స్‌ షేర్ల ర్యాలీ 4రోజూ కొనసాగుతుంది. బీఎస్‌ఈలో బుధవారం మరో 8శాతం లాభపడ్డాయి. చైనాలో ఆగస్ట్‌ రిటైల్‌ అమ్మకాలు పెరగడం షేర్ల ర్యాలీకి కారణమవుతోంది. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.124.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ప్రధాన అనుబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) సోమవారం సాయంత్రం ఆగస్ట్‌ నెల వాహన విక్రయ గణాంకాలను విడుదల చేసింది. అమ్మకాలు యూరప్‌, అమెరికాలో తగ్గినప్పటికీ., చైనాలో మాత్రం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీ స్థానిక టర్నరౌండ్ ప్రణాళిక ఊపందుకోవడంతో రిటైల్‌ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 17.4శాతం పెరిగాయి. ఇదే వార్షిక ప్రాతిపదికన రేంజ్‌ రోవర్‌ విభాగంలోని ఎవోక్ మోడల్స్‌ అమ్మకాలు 50.9శాతం, స్పోర్ట్‌ మోడల్స్‌ కార్ల అమ్మకాలు 6.4శాతం వృద్ధిని సాధించాయి. అలాగే జాగ్వర్‌ ఎక్స్‌జే మోడల్స్‌ విక్రయాలు 31.1శాతం పెరిగాయి. ఆర్థిక మందగమన నేపథ్యంలో ఆ దేశ ప్రధాన బ్యాంక్‌ పీపుల్స్‌ బ్యాంక్‌ చైనా రిజర్వ్‌ రిక్వైర్‌మెంట్‌ రేషియోని 0.5శాతం కోత విధింపు కూడా షేర్లకు కలిసొచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా షేర్లు ఒకదశలో 8.20శాతం లాభపడి రూ.131.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మధ్యాహ్నం గం.12:40ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.121.9)తో పోలిస్తే 7.50శాతం లాభంతో రూ.131.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.106.00 రూ.282.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

మరో రెండేళ్లలో 2000డాలర్ల స్థాయికి పసిడి: సిటిగ్రూప్‌

Wednesday 11th September 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మరో రెండేళ్లలో 2,000డాలర్ల స్థాయికి చేరుకుంటుందని సిటిగ్రూప్‌ అంచనా వేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక మంద్య భయాలు, కీలక వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు నామమాత్రపు (సున్నా) వైఖరికి ఇష్టపడుతుండటం లాంటి అంశాలు పసిడి ర్యాలీకి తోడ్పాటునిస్తాయని సిటి బ్యాంక్‌ అభిప్రాయపడింది.స్పాట్‌ గోల్డ్‌ దీర్ఘకాలం పాటు స్థిరమైన ర్యాలీని కొనసాగిస్తూ 2000డాలర్ల స్థాయి అధిగమించే అవకాశం ఉంది. వచ్చే ఒకటి, రెండేళ్లలో ఏదో పాయింట్‌ వద్ద కొత్త

అధిక ఉత్పత్తే అసలు సమస్య...

Wednesday 11th September 2019

ఆటో రంగ సంక్షోభంపై రాజీవ్‌ బజాజ్‌ దేశీయ ఆటో రంగంలో ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం‘‘అధిక ఉత్పత్తి మరియు అధికంగా స్టాకులు పేరకపోవడం’’ అని బజాజ్‌ ఆటో ఎండీ రాహుల్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు. సంక్షోభానికి ఆర్థిక మందగమన ప్రభావం చాలా స్వల్పమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీఎస్‌టీ కోతలు అవసరం లేదన్నారు. ఇటీవల కాలంఓ ఆటోమొబైల్‌ రంగంపై జీఎస్‌టీ తగ్గించాలని డిమాండ్‌ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న జీఎస్‌టీ కౌన్సిల్‌

Most from this category