News


ఆగని టాటామోటర్స్‌ షేర్ల పతనం

Wednesday 4th September 2019
Markets_main1567588567.png-28188

టాటా మోటర్స్‌ షేర్ల పతనం ఆగడం లేదు. బీఎస్‌ఈలో బుధవారం మరో 6శాతం క్షీణించింది. నిన్న అటోషేర్ల పతనంలో భాగంగా 3శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ నెలలో ఈ వాహన విక్రయాలు 58శాతం క్షీణించడంతో పాటు, అంతర్జాతీయంగా జేఎల్‌ఆర్‌ అమ్మకాలు తగ్గముఖం పట్టడం లాంటి కారణాలతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఒకదశలో 6శాతం క్షీణించి రూ.106.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. సరుకు లభ్యత కొరత, తక్కువ సరకు రవాణా రేట్ల కారణంగా డిమాండ్‌ బలహీనపడటంతో పాటు ఆర్థికవ్యవస్థలో మందమగనం కొనసాగుతుండం వాణిజ్య వాహనాలకు డిమాండ్‌ తగ్గినట్లు టాటామోటర్స్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ గిరీష్‌ తెలిపారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో అటోరంగం తిరిగి పుంజుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం రూ.106-108 స్థాయిలో కాంట్రా బైయింగ్‌ జరగవచ్చని, సమీపకాలంలో షేరు రూ.125 స్థాయిని అందుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. డైలీ ఛార్ట్‌ బలహీనంగా ఉన్నప్పటికీ.., వీక్లీ ఛార్ట్‌లో ఓవర్‌సోల్డ్‌ జోన్‌లో ట్రేడ్‌ అవుతుంది. రూ.106-108 స్థాయికి షేరు పతనమైనపుడు, రూ.100ల వద్ద సాఫ్ట్‌ లాస్‌తో రూ.125ల స్వల్పకాలిక లక్ష్యంగా కొనుగోలు చేయవచ్చని క్యాపిటల్‌ ఎయిమ్‌ హెడ్‌రీసెర్చ్‌ రోమిష్‌ తివారి సూచిస్తున్నారు. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు క్రితం‍ ముగింపు ధర(రూ.112.65)తో పోలిస్తే 3.15శాతం నష్టంతో రూ.109.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాదిలో షేరు ఇప్పటికే 30శాతానికి పైగా క్షీణించింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.106.00  రూ.282.00లుగా ఉన్నాయి. 



You may be interested

ఇదొక ‘విలువల ఉచ్చు’..యాంకర్‌ బ్యాంకులకు దూరం!

Wednesday 4th September 2019

-సురేష్‌ గణపతి, మాక్వేరీ    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ‍ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రతిపాదనలో వున్న యాంకర్‌బ్యాంకులకు ఇన్వెస్టర్లు దూరంగా ఉండాలని మాక్వేరీ క్యాపిటల్‌ సెక్యురిటీస్‌ విశ్లేషకుడు సురేష్‌ గణపతి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో సూచించారు. ఈ బ్యాంకులకు విలువను పెంచే సామర్ధ్యం లేదని, ఇవి ఇన్వెస్టర్లకు ఎటువంటి అవకాశాలను అందించలేవని వివరించారు. ‘చౌకగా ఉన్నాయని ఎవరైనా ఈ బ్యాంకుల షేర్లను కొనుగోలు చేస్తే వాళ్లు ఉచ్చులో చిక్కుకున్నట్టే’ అని

సన్‌ఫార్మా 8శాతం క్రాష్‌..!

Wednesday 4th September 2019

దేశీయ రెండో అతిపెద్ద ఫార్మా దిగ్గజ కంపెనీ సన్‌ఫార్మా షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 8.50శాతం క్షీణించాయి. కంపెనీలో జరిగిన అవకతవకలపై సీబీఐ ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సెబీ ఆదేశించినట్లు వార్తలు వెలుగులోకి రావడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.423.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  కార్పొరేట్‌ గవర్నెన్స్‌, సెక్యూరిటీ మార్కెట్ల నిబంధనల ఉల్లంఘన తదితర నిబంధనల ఉల్లంఘనపై విజిల్‌ బ్లోయర్‌ చేసిన 150 పేజీల ఫిర్యాదు ఆధారంగా

Most from this category