News


టాటామోటర్స్‌ 8శాతం పతనం

Wednesday 15th May 2019
Markets_main1557916609.png-25761

టాటామోటర్స్‌ షేర్లు బుధవారం 8శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.185.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అటోరంగ షేర్ల పతనంలో భాగంగా నేడు షేరు 9శాతానికి పైగా నష్టపోయి రూ.167.50ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 8శాతం నష్టంతో 169.60 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్‌ఈలోని నిఫ్టీ - 50 సూచీలోని టాప్‌-5 లూజర్లలో ఈ షేరు రెండోస్థానంలో ముగిసింది. 



You may be interested

మీ పోర్ట్‌ఫోలియోకు హెడ్జింగ్‌ అవసరం

Thursday 16th May 2019

సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌ ఈ నెల 19న ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వస్తాయని, దీంతో మార్కెట్లలో ఈ నెల 20 నుంచి ఎక్కువ అస్థిరతలు ఉంటాయన్న అంచనాను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వ్యక్తం చేసింది. కనుక ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోకు రక్షణగా హెడ్జింగ్‌ చేసుకోవాలని సూచించింది. మనదేశంలో సాధారణ ఎన్నికల పట్ల మార్కెట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నందున హెడ్జింగ్‌ అవసరమని పేర్కొంది. ఈ మేరకు తాజా నివేదికను విడుదల

లాభాలు ఒక్కరోజుకే పరిమితం

Wednesday 15th May 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరి గంటలో అమ్మకాలదే పైచేయి కావడంతో బుధవారం నష్టాలతో ముగిశాయి. ఫలితంగా మార్కెట్‌ లాభాలు ఒకరోజుకే పరమితమయ్యాయి. సెన్సెక్స్‌ 203 పాయింట్లను నష్టపోయి 37,114.88 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 65 పాయింట్లను కోల్పోయి 11,157 వద్ద ముగిసింది. తొమ్మిదిరోజుల వరుస నష్టాల అనంతరం క్రితం రోజు మార్కెట్‌ లాభాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఈ రోజు తీవ్ర నష్టాల్నిచవిచూసింది.

Most from this category