News


టాటా మోటర్స్‌ 5.50శాతం క్రాష్‌..!

Wednesday 19th February 2020
Markets_main1582095123.png-31929

కరోనా వైరస్‌ వ్యాధితో చైనాలో సప్లై ఒత్తిడి నెలకొన్న కారణంగా యూకే, భారత్‌లో దాని ఉత్పత్తి షెడ్యూల్ దెబ్బతింటుందని హెచ్చరికలతో టాటా మోటర్స్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో 5శాతం నష్టాన్ని చవిచూసింది. జేఎల్‌ఆర్‌ సీఈవో రాల్ఫ్ స్పెత్ మంగళవారం మాట్లాడుతూ రాబోయే 2వారాల ఉత్పత్తికి సరిపోయేంత సామగ్రి  మాత్రమే ఉంది. కానీ మూడవ వారం నుంచి కష్టాలు ఎదుర్కోక తప్పదని, ప్లాంట్‌ మూసివేతకు కూడా జరగవచ్చన్నారు. పలితంగా ఈ కంపెనీ షేరు నేటి మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటుంది. ఒక దశలో దాదాపు 5.50శాతం నష్టాన్ని చవిచూసి రూ.153.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 12గంటలకు షేరు క్రితం​ముగింపు(రూ.153.00)తో పోలిస్తే 3శాతం నష్టంతో రూ.156.50 ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.106.00, రూ.239.30లుగా నమోదయ్యాయి. 



You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2శాతం అప్‌!

Wednesday 19th February 2020

బుధవారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2 శాతం పెరిగి 1500 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ముఖేష్‌ అంబానీకిచెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లోని పెట్రోకెమికల్‌ విభాగంలో 20 శాతం వాటాను సౌదీ అర్‌మ్‌కోకు విక్రయించనున్నట్లు రెండు కంపెనీలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. అయితే తాజాగా ఈ ప్రాసెస్‌ను మరింత వేగంగా పూర్తిచేసేందుకు చర్చలు జరుపుతుండడంతో షేరు విలువ ఒక్కసారిగా పెరిగింది.

నేటి వార్తల్లో షేర్లు

Wednesday 19th February 2020

వేదాంత: ఈ కంపెనీకి చెందిన లాంగ్‌ టర్మ్‌ బాండ్లను మొదటి సారి  భారత మార్కెట్లలో విక్రయించనుంది. ఎల్‌ఐసీ 10 ఏళ్ల కాలపరిమితిగల మొత్తం బాండ్లను రూ.2,000 కోట్లు పెట్టి కొనుగోలు చేయాలని భావిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్‌: వీడియోకాన్‌ టెలీకమ్యూనికేషన్స్‌కు సంబంధించిన రూ.2,041 కోట్ల బకాయిలను టెలికం విభాగం భారతీ ఎయిర్‌టెల్‌కు అనుసంధానించడం వల్ల ఎయిర్‌టెల్‌ ఏజీఆర్‌ బకాయిలు పెరిగే అవకాశం ఉంది. జెట్‌ ఎయిర్‌వేస్‌: కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌(సీఓసీ) బిడ్ల సమర్పణకు ముగింపు

Most from this category