క్యాపిటల్ ఎయిమ్ నుంచి టాప్ 3 సిఫార్సులు
By D Sayee Pramodh

స్వల్పకాలానికి మూడు షేర్లపై క్యాపిటల్ ఎయిమ్ సంస్థ సిఫార్సులు ఇలా ఉన్నాయి...
1. టాటామోటర్స్: కాంట్రా బెట్‌గా కొనుగోలు చేయవచ్చు. నెల రోజుల్లో దాదాపు 30 శాతం పతనమైంది. క్యు1 పేలవ ఫలితాలు, డిమాండ్‌లో క్షీణత, అమ్మకాల్లో మందగమనం, రేటింగ్ డౌన్‌గ్రేడ్స్ తదితరాలు స్టాకుపై ప్రభావం చూపాయి. దీంతో స్వల్పకాలంలో భారీ పతనం చూసింది. ప్రస్తుతం స్టాకు ఓవర్‌సోల్డ్‌గా ఉంది. పలు ఇండికేటర్లు ఇంకా సెల్ సిగ్నల్సే ఇస్తున్నాయి. అందువల్ల మరికొంత మేర దిగజారవచ్చు. అయితే పడినప్పుడల్లా దీన్ని కాంట్రా బైగా పరిగణించి కొనుగోలు చేయవచ్చు. టార్గెట్ రూ. 134. స్టాప్‌లాస్ రూ. 110.
2. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్: కొత్త కొనుగోళ్లు చేయొద్దు. ఈ ఏడాది షేరు 30 శాతం పతనమైంది. మూడీస్లాంటి దిగ్గజాలు సంస్థ రేటింగ్‌ను తగ్గించాయి. ఆగస్టులో 8న షేరు ఏడాది కనిష్ఠాలకు చేరి వెంటనే వారంలో రీబౌన్స్ అయింది. ఇలాంటి తీవ్ర కదలికలు షేరులో రిస్కును సూచిస్తున్నాయి. ప్రస్తుతం చాలా ఇండికేటర్లు షేరులో అమ్మొచ్చు సంకేతాలు ఇస్తున్నాయి. అందువల్ల ఇప్పటికే కొనుగోలు చేసిన మదుపరులు రూ. 425ని కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో పాటించాలి. కొత్త కొనుగోళ్లను నివారించాలి.
3. యూపీఎల్: మరింత పతనం ముందుంది. షేరు నెలలో 10 శాతం క్షీణించింది. జూన్ త్రైమాసిక ఫలితాలు నిరాశాపూరితంగా ఉన్నాయి. స్టాక్‌లో మరింత డౌన్‌ట్రెండ్ మిగిలిఉందని ఇండికేటర్లు సూచిస్తున్నాయి. షేరును రూ. 610 స్టాప్‌లాస్‌తో రూ. 490 టార్గెట్‌కు విక్రయించవచ్చు.
You may be interested
ప్యాకేజీ అంచనాలు...ఆటో షేర్ల పరుగులు
Tuesday 20th August 2019ప్రభుత్వం రంగాల వారిగా ప్యాకేజిని ప్రకటించే అవకాశం ఉండడంతో మార్కెట్ మంగళవారం నష్టాల్లో ట్రేడవుతోంది. కాగా ఆటో సెక్టార్ మందగమనాన్ని అపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే అంచనాల నేపథ్యంలో ఆటో ఇండెక్స్ పాజిటివ్‌గా ట్రేడవుతోంది. మధ్యాహ్నాం 2.21 సమయానికి 1.35 శాతం లాభపడి 7,053.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్ షేర్లయిన ఎంఆర్ఎఫ్ 0.11 శాతం లాభపడి రూ. 57,502.00 వద్ద ట్రేడవుతుండగా, మారుతి సుజుకీ 3.11
ఫారిన్ ప్రమోటర్ ఎగ్జిట్: మహానగర్ గ్యాస్ 10 శాతం ర్యాలీ
Tuesday 20th August 2019విదేశీ ప్రమోటర్ కంపెనీలో పూర్తిగా వాటాను విక్రయించి నిష్క్రమించడంతో మహానగర్ గ్యాస్ షేర్లు మంగళవారం బీఎస్ఈలో కంపెనీ షేర్లు 11శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్ఈలో కంపెఈ షేర్లు రూ.834.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. విదేశీ ప్రమోటర్ బ్రిటీష్ గ్యాస్ ఏషియా హోల్టింగ్ పీటీ లిమిటెడ్.. మహానగర్ గ్యాస్‌లో తనకు ఉన్న మొత్తం 10శాతం వాటాకు సమానమైన 99లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.780 చొప్పున బ్లాక్ డీల్