News


టాటా మోటర్స్‌ షేరు 7 శాతం జంప్‌

Wednesday 29th January 2020
Markets_main1580292984.png-31308

టాటా మోటర్స్‌ షేరు బుధవారం దాదాపు 7శాతం లాభంతో ముగిసింది. ఎడెల్వీజ్‌ బ్రోకరేజ్‌ సంస్థ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.245లకు పెంచడం ఇందుకు కారణమైంది. అలాగే తన ప్రసిద్ధ కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) నెక్సాన్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విభాగంలో ఈ తరహా వాహనాలు అత్యంత చౌకమైనవి కావడంతో రానున్న రోజుల్లో వీటికి మరింత డిమాండ్‌ పెరగవచ్చనే అంచనాలు షేరు ర్యాలీకి మరో కారణమైంది. 

మార్కెట్‌ ముగిసే సరికి షేరు క్రితం ముగింపు(176.10)తో పోలిస్తే దాదాపు శాతం లాభంతో రూ.188.05  వద్ద ముగిసింది.  జనవరి 15న షేరు రూ.200 వద్ద రికార్డు స్థాయిని అందుకుంది. నాటి నుంచి ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్స్‌లో 12శాతం క్షీణించింది. 

కంపెనీ మూలధనాన్ని పెంచుకోవడం, చక్రీయ వ్యవస్థల్లో భాగంగా నికరలాభం నష్టాల దశ నుంచి లాభాల్లోకి తిరిగి రావడం షేరుకు కలిసొస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ నమ్ముతోంది. నిరంతర వ్యయ తగ్గింపు, మూలధనాన్ని ఖర్చు పెట్టడం కంపెనీ నగదు ప్రవాహాన్ని పెంచుతాయని బ్రోకరేజ్‌ సంస్థ చెబుతోంది. 



You may be interested

అంచనాలు దాటిన బజాజ్‌ ఫైనాన్స్‌

Wednesday 29th January 2020

డిసెంబర్‌ త్రైమాసికానికి బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం 52 శాతం పెరిగి రూ. 1614కోట్లకు చేరింది. బలమైన ఎన్‌ఐఐ, ఏయూఎంతో కంపెనీ మంచి లాభాలు చూపింది. ఈ సమయంలో నికర వడ్డీ ఆదాయం 42 శాతం దూసుకుపోయి రూ. 4537కు చేరింది. కొత్త లోన్స్‌లో వృద్ధి 13 శాతంగా నమోదయింది. కస్టమర్‌ ఫ్రాంచైజీ 24 శాతం మేర పెరిగినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ లాభం రూ. 1523 కోట్లుంటుందని, ఎన్‌ఐఐ రూ.

ఎఫ్‌పీఐలు వాటాలు పెంచుకున్న టాప్‌ 20 షేర్లు!

Wednesday 29th January 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో ప్రైవేట్‌ బ్యాంకులు, బీమా కంపెనీలతో సహా పలు రంగాలకు చెందిన స్టాకుల్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్నారు. బడ్జెట్‌ నేపథ్యంలో ఆటోమొబైల్‌ తదితర బడ్జెట్‌ ప్రభావిత రంగాల షేర్లపై కూడా ఎఫ్‌ఐఐలు కన్నేశారు. బ్యాంకుల్లో ఆర్‌బీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకుల్లో ఎఫ్‌పీఐల వాటా దాదాపు 300- 600 బీపీఎస్‌ మేర పెరిగింది. బడ్జెట్లో దివాలా చట్టానికి మరింత పదును పెరుగుతుందని, మొండిపద్దుల రికవరీ

Most from this category