లాభాల బాటలో టాటామోటర్స్ .!
By Sakshi

నష్టాల మార్కెట్ ట్రేడింగ్‌లోనూ టాటామోటర్స్ షేర్లు గురువారం లాభాల బాట పట్టాయి. నేడు బీఎస్ఈలో ఉదయం సెషన్లో 5.5శాతం పెరిగాయి. అమెరికాలో వార్షిక ప్రాతిపాదికన ఈ సెప్టెంబర్‌లో జేఎల్ఆర్ అమ్మకాలు పెరిగాయి. మరోవైపు దేశీయంగా ఇదే నెలలో ఏడాది ప్రాతిపాదికన అమ్మకాలు 50శాతం క్షీణించాయి. అయితే... నెల ప్రాతిపదికన ఆగస్ట్‌తో పోలిస్తే సెప్టెంబర్‌లో రిటైల్ వాహన విక్రయాలు 11శాతం పెరిగాయి. దసరా, దీపావళి పండుగ సీజన్ సందర్భంగా వాహన విక్రయాలు మరితం పెరగవచ్చనే ఆశాభావాన్ని టాటామోటర్స్ పాసింజర్ వాహన వ్యాపార అధ్యక్షుడు మయాంక్ పరేక్ వ్యక్తం చేశారు. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.112.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ ప్రారంభం నుంచే ఈ షేర్లకు డిమాండ్ పెరిగడంతో ఇంట్రాడేలో షేర్లు 5.50శాతం పెరిగి రూ.121.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఉదయం గం.11:00లకు షేర్లు క్రితం ముగింపు(రూ.115.35)తో పోలిస్తే 5.24 శాతం లాభంతో రూ.121.15 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.112.00, రూ.121.65లుగా నమోదయ్యాయి. మరోవైపు ఎన్ఎస్ఈలోని నిఫ్టీ-50 సూచీలో టాప్-5 గెయినర్లలో మూడో స్థానంలో ట్రేడ్ అవుతోంది.
You may be interested
యస్‌బ్యాంక్ 30 శాతం జంప్
Thursday 3rd October 2019వారం రోజుల్లోనే 47శాతం నష్టపోయిన చవిచూసిన యస్ బ్యాంక్ షేర్లు గురువారం భారీగా రికవరీ అయ్యాయి. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులపై యాజమాన్యం స్టాక్ ఎక్చ్సేంజీలకు స్పష్టతనివ్వడంతో నేటి ఉదయం సెషన్లో షేర్లు 29శాతం వరకు లాభపడ్డాయి. ప్రమోటర్ రాణా కపూర్ తనఖా పెట్టిన 10 కోట్ల షేర్లను ఉద్దేశపూర్వకంగా విక్రయించడం వల్లే షేర్లు భారీ పతనాన్ని చవిచూసినట్లు యస్‌బ్యాంక్ తెలిపింది. ఇప్పటికి తమ బ్యాంకు ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయని
ఆయిల్ మార్కెటింగ్ షేర్ల ర్యాలీ..బీపీసీఎల్ 4% అప్
Thursday 3rd October 2019అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోవడంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ షేర్లు గురువారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 11.06 సమయానికి హెచ్‌పీసీఎల్(హిందుస్తాన్ పెట్రోలియం) షేరు 4.38 శాతం లాభపడి రూ. 323.00 వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు తగ్గడం, డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం, బీపీసీఎల్(భారత్ పెట్రోలియం)లోని తన పూర్తి వాటాను విక్రయించేందుకు నిర్ణయం తీసుకోవడంతో బీపీసీఎల్ షేరు గత కొన్ని సెషన్ల నుంచి ర్యాలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ