News


టాటా మోటర్స్‌ 15 శాతం ర్యాలీ!

Tuesday 29th October 2019
Markets_main1572322606.png-29195

టాటా మోటర్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే బాగుండడంతో ఈ కంపెనీ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో ర్యాలీ చేస్తోంది. ఆదివారం ముహురత్‌ ట్రేడింగ్‌లో 17 శాతం లాభపడిన ఈ షేరు, మంగళవారం సెషన్లో ఉదయం 9.45 సమయానికి 15 శాతం లాభపడి రూ. 170 వద్ద గరిష్టస్థాయిని చేరచ్చు. దీపావళి బలిప్రతిపద సందర్భంగా సోమవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు పనిచేయలేదు. గత సెషన్‌లో రూ. 147.70 వద్ద ముగిసిన టాటా మోటర్స్‌ షేరు, మంగళవారం సెషన్లో రూ. 151.90 వద్ద  ప్రారంభమై, రూ. 171.40 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 
 కంపెనీ క్యూ2 ఫలితాలు: టాటా మోటర్స్‌ ఏకికృత నికర నష్టం సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ. 216.5 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ నష్టం రూ. 1,048.8 కోట్లుగా నమోదైంది. కాగా విశ్లేషకులు టాటా మోటర్స్‌ నష్టం రూ. 1,600 కోట్లుగా ఉంటుందని అంచనావేశారు. కంపెనీ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 9 శాతం పడిపోయి రూ. 65,432 కోట్లుగా నమోదైంది. అయినప్పటికి కంపెనీ ఆదాయం విశ్లేషకులు అంచనా వేసిన రూ. 64,150 కోట్ల కంటే అధికం కావడం గమనార్హం. కంపెనీ ఎబిట్డా 13 శాతం పెరిగి రూ. 7,046 కోట్లుగా నమోదైంది.



You may be interested

ఎయిర్‌టెల్‌ ఫలితాలు వాయిదా!

Tuesday 29th October 2019

నవంబర్‌ 14న వెల్లడి సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల విడుదలను భారతీ ఎయిర్‌టెల్‌ వాయిదా వేసింది. మంగళవారం ఫలితాలు వెలువరించాల్సిఉండగా, వీటిని వచ్చే నెల 14కు వాయిదా వేసింది. సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌) అంశంపై మరింత స్పష్టత రావాల్సిఉందని అందుకే ఫలితాలు వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఏజీఆర్‌ నిర్వచనానికి సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు టెల్కోలకు షాక​ ఇచ్చే తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మరింత స్పష్టత కోసం డీఓటీని

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 29th October 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు టెలికాం కంపెనీలు:- టెలికాం కంపెనీలకు మరింత ఎదురుదెబ్బ తగిలింది. టెల్కోల రాబడి నిర్వచనం, కేంద్రానికి లైసెన్సు ఫీజులపై చెల్లించాల్సిన జరిమానాను 4నెలల్లోగా చెల్లించాలని ఆర్డర్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీ షేర్లు ఎక్కువ వాల్యూమ్స్‌తో ట్రేడయ్యే అవకాశం ఉంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ ఏపీలో శ్రీకాకుళం ఏపీఐ ప్లాంట్‌ తనిఖీలను పూర్తి చేసింది.

Most from this category