News


టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 3.17శాతం అప్‌..!

Tuesday 10th September 2019
news_main1568111278.png-28290

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే ఒక్క ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ తప్ప మిగిలిన అన్ని ఏడీఆర్‌లు సోమవారం లాభాలతో ముగిశాయి. అత్యధికంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 3శాతానికి పైగా పెరిగింది. టాటా మోటర్స్‌ ప్రధాన అనుబంధ సం‍స్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ అమ్మకాలు యూరప్‌, అమెరికాలో తగ్గినప్పటికీ., చైనాలో మాత్రం పెరిగినట్లు సోమవారం సాయంత్రం డేటా విడుదల కావడం ఏడీఆర్‌ ర్యాలీకి కారణమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 8.80 డాలర్ల వద్ద క్లోజయ్యింది. ఈ ఒక్క ఏడీఆర్‌ భారత్‌లోని టాటామోటార్స్‌ 5 ఈక్విటీ షేర్లకు సమానం. సోమవారంనాటి క్లోజింగ్‌ ధరను మంగళవారం కూడా అమెరికాలో టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ నిలుపుకుంటే..బుధవారం ఇండియాలో టాటా మోటార్స్‌ షేరు 3 శాతం పెరుగుదలతో రూ. 126కు చేరే అవకాశం వుంటుంది. ఇక మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లో విప్రో ఏడీఆర్‌ 1.50శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ ఏడీఆర్‌ 1శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు 0.02శాతం లాభంతో ముగిశాయి. అయితే ఒక్క ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ మాత్రం 1.50శాతం నష్టంతో ముగిసింది. 
ఫ్లాట్‌గా ముగిసిన అమెరికా మార్కెట్లు:- 
టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ రంగాల షేర్ల పతనంతో సోమవారం రాత్రి అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. గత వారం మార్కెట్ అతి పెద్ద ర్యాలీ చేసిన తరువాత పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్లకు పెద్దగా ఆస్తకి చూపకపోవడం​కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. అయితే ఆర్థిక మందగమనంలో ఉన్న వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలు ప్రకటించవచ్చనే అంచనాలు, వాణిజ్య చర్చలు ఫలించవచ్చనే ఆశావహన అంచనాలు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. ప్రధాన సూచీలైన డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌  ఇండెక్స్‌ 38.05 పాయింట్లు పెరిగి 26,835.51 వద్ద, ఎస్‌అండ్‌పీ 0.28 పాయింట్లు ర్యాలీ చేసి 2,978.43 వద్ద, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 15.64 పాయింట్లు నష్టపోయి 8,087.44 వద్ద స్థిరపడ్డాయి.You may be interested

సిప్‌ పెట్టుబడుల్లో క్షీణత.. దేనికి సంకేతం!

Tuesday 10th September 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ ఎక్కువగా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడులపై ఎక్కువగా ఆధారపడి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత రెండు మూడేళ్లుగా పరిశ్రమ ఆస్తుల వృద్ధికి సిప్‌ పెట్టుబడుల రాక ఇతోధికంగా సాయపడుతోంది. కానీ, ఈ ట్రెండ్‌ బలహీనపడినట్టు ఆగస్ట్‌ నెల గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది.    మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ యాంఫి డేటా ప్రకారం... ఆగస్ట్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ నూతన ఫోలియోల

ఈ వారం 11200పాయింట్ల వరకు ర్యాలీ?!

Tuesday 10th September 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా ఈ వారంలో నిఫ్టీ తన 200 రోజుల డీఎంఏ స్థాయి 11200 వద్దకు చేరుతుందని టెక్నికల్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాల్‌ ఆప్షన్‌ విక్రేతలు(రైటర్లు) 10900 పాయింట్ల వద్ద  తమ షార్టు పొజిషన్లను(12వతేదీ ఎక్స్‌పైరీవి) కవర్‌ చేశారని, మరోవైపు 10800- 11000 పాయింట్ల(12వ తేదీ ఎక్స్‌పైరీవి) వద్ద పుట్‌ రైటింగ్‌ జరిపారని తెలియజేశారు. అందువల్ల క్రమంగా మార్కెట్‌ ఈ వారం ముందుకే సాగుతుందంటున్నారు. ముఖ్యంగా కాల్‌రైటర్లు షార్ట్‌కవరింగ్‌ చేయడం

Most from this category