News


బ్రెగ్జిట్‌ డీల్‌ ఎఫెక్ట్‌: టాటామోటర్స్‌ 13%, టాటా స్టీల్‌ 3% అప్‌

Thursday 17th October 2019
Markets_main1571307824.png-28956

  బ్రిటన్‌, ఈయూ(యురోపియన్‌ యూనియన్‌) మధ్య బ్రెగ్జిట్‌ ఒప్పందం కుదరడంతో టాటా మోటర్స్‌, టాటా స్టీల్‌ షేర్లు అనుహ్యాంగా పెరిగాయి. టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌ కంపెనీలు బ్రిటన్‌లో ఉండడంతో బ్రెగ్జిట్‌ ఒప్పందం ఈ కంపెనీలకు మేలు చేస్తుందన్న అంచనాలతో మార్కెట్‌ ముగింపులో ఈ కౌంటర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఈ ఒప్పందం కుదిరినట్లు గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు వార్తలు వెలువడంతో టాటా మోటార్స్‌ షేరు ఇంట్రాడేలో 15 శాతం​లాభపడి రూ. 144 గరిష్టస్థాయిని తాకిన తర్వాత రూ. 140 సమీపంలో ముగిసింది. గత సెషన్లో రూ. 125.85 వద్ద ముగిసిన ఈ కంపెనీ షేరు, గురువారం ట్రేడింగ్‌లో రూ. 127.10 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమై, రూ. 144.35 వద్ద  ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 
  అదే విధంగా టాటా స్టీల్‌ కూడా డీల్‌ వార్త వెలువడిన తర్వాత అనూహ్యంగా పెరిగింది. గత సెషన్‌లో రూ. 347.40 వద్ద ముగిసిన ఈ షేరు, గురువారం ట్రేడింగ్‌లో రూ. 346.00 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 3.5 శాతం పెరిగి రూ. 361.35 వద్ద గరిష్ఠాన్ని తాకింది.  చివరకు టాటా  రూ. 357 సమీపంలో ముగిసింది. You may be interested

ఐఆర్‌సీటీసీని ఇంత తక్కువకు విలువ కడతారా?!

Thursday 17th October 2019

రైల్వే శాఖ నిరసన ఐఆర్‌సీటీసీ ఐపీఓ ధరపై భారతీయ రైల్వే శాఖ నిరసన వ్యక్తంచేసింది. తాజాగా లిస్టయిన ఐఆర్‌సీటీసీ తొలిరోజు దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. షేరు ఆరంభంలో దాదాపు 100 శాతానికి పైచిలుకు లాభపడింది. ఈ నేపథ్యంలో షేరు ఆఫర్‌ ధరను అంత తక్కువగా నిర్ణయించడంపై రైల్వే శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం సరైన విచారణ జరపాలని, అప్పుడే భవిష్యత్‌లో పీఎస్‌యూ కంపెనీల పబ్లిక్‌ ఆఫర్లకు మంచి

బ్రెగ్జిట్ డీల్ కుదిరింది..

Thursday 17th October 2019

దూసుకుపోయిన బ్రిటీష్ కరెన్సీ, యూరప్ మార్కెట్లు యూరప్, యూకే మధ్య అర్ధవంతమైన డీల్ కుదిరిందని యూరోపియన్ కమీషన్ అధ్యక్షుడు జీన్ క్లాడే జంకర్ ప్రకటించారు. ఇది ఒక నాణ్యమైన, సమతుల్యమైన ఒప్పందంగా అభివర్ణించారు. ఒక నూతన ఒప్పందం కుదిరిందని, శనివారం ఈ డీల్ ను పార్లమెంట్ ముందు ఉంచుతామని యూకే ప్రధాని చెప్పారు. డీల్ ను గురువారం ఈయూ నేతల ముందుంచుతారు. ఈయూనేతలు, బ్రిటన్ పార్లమెంట్ అనుమతి లభించిన అనంతరం డీల్

Most from this category