News


టాటా గ్రూప్‌ షేర్ల పతనం

Wednesday 10th July 2019
Markets_main1562751412.png-26955

  • 5నెలల కనిష్టానికి టాటా మోటర్స్‌ షేర్లు
  • 4.50శాతం పతనమైన టాటా స్టీల్‌
  • 5వ రోజూ కొనసాగుతున్న టాటా పవర్‌, టాటా ఎలాక్సీ షేర్ల పతనం

టాటా గ్రూప్‌ కంపెనీ షేర్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఈ గ్రూప్‌నకు చెందిన టాటా మోటర్స్‌ షేర్లు 5నెలల కనిష్టానికి పతనమైంది. టాటా స్టీల్‌ షేర్లు 4.50శాతం నష్టపోయింది. టాటా ఎలక్సీ లిమిటెడ్‌, టాటా పవర్‌ షేర్లు వరుసగా ఐదో రోజూ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ గ్రూప్‌లో అతిపెద్ద కంపెనీగా పేరుపొందిన టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు కంపెనీ తొలి త్రైమాసిక ఫలితాలు అంతంత మాత్రంగానే నమోదు కాకపోవడంతో ఇదే గ్రూప్లోని ఇతర కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు విశ్లేషకలు అభిప్రాయపడ్డారు. టాటా గ్రూప్‌ మొత్తం నికరలాభంలో ఒక్క టీసీఎస్‌ 85శాతం వాటాను అందిస్తున్న సంగతి తెలిసిందే.

టాటా మోటర్స్‌:- నేడు అటో షేర్లలో నెలకొన్న అమ్మకాలతో పాటు, తన గ్రూప్‌నకు చెందిన టీసీఎస్‌ కంపెనీ షేర్ల నష్టాల ట్రేడింగ్‌తో ఈ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఇంట్రాడేలో 4.50శాతం నష్టపోయి రూ.149.15 వద్ద ఇంట్రాడే కనిష్టానికి క్షీణించాయి. ఈ ధర స్థాయి షేరుకు 5నెలల గరిష్టస్థాయి కావడం గమనార్హం. మిడ్‌సెషన్‌ సమయానికి గత ముగింపు(రూ.155.75)తో పోలిస్తే 3.56శాతం నష్టంతో రూ.150.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
టాటా స్టీల్‌:- అమెరికా చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మెటల్‌ కంపెనీల ఫలితాల ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు తన నివేదికల్లో తెలియజేయడంతో నేడు మెటల్‌ షేర్లు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. మెటల్‌ షేర్ల పతనంలో భాగంగా టాటాస్టీల్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో 3శాతం నష్టపోయి రూ.448.10ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. మిడ్‌సెషన్‌ సమయానికి గత ముగింపు(రూ.155.75)తో పోలిస్తే 3.56శాతం నష్టంతో రూ.454.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
టాటా ఎలాక్సీ:- ఐటీ రంగంలో సేవలు అందించే ఈ కంపెనీ షేర్ల పతనం వరుసగా ఐదో ట్రేడింగ్‌ సెషన్‌లో కొనసాగింది. నేటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో 1శాతం క్షీణించింది. మిడ్‌సెషన్‌ సమయానికి గత ముగింపు(రూ.854)తో పోలిస్తే అరశాతం నష్టంతో రూ.840ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
టాటా పవర్‌:- నేటి ట్రేడింగ్‌లో 3శాతం నష్టపోయాయి. మిడ్‌సెషన్‌ సమయానికి గత ముగింపు(రూ.68.45)తో పోలిస్తే 2.78శాతం నష్టంతో రూ.66.55ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ షేరు కూడా వరుసగా 5వ ట్రేడింగ్‌ పతనం కావడం గమనార్హం. 



You may be interested

ఆదాయాలపై కోటక్‌ ఈక్విటీస్‌ ప్రివ్యూ

Wednesday 10th July 2019

ఇయర్‌ ఆన్‌ ఇయర్‌(వై ఓ వై) ప్రకారం ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 త్రైమాసికంలో కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటిస్‌(కేఐఈ) నికర ఆదాయం 1.3 శాతంపెరగనుందని కేఐఈ అంచనా వేసింది. ఈ పెరుగుదలలో బ్యాంకింగ్‌ సెక్టార్‌ పాత్ర కీలకంగా ఉండనుందని తెలిపింది. ‘‘తక్కువ బేస్‌ కారణంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌ అధిక ఆదాయవృద్ధిని ప్రకటించే అవకాశం ఉంది. బ్యాంకింగ్‌ సెక్టార్‌ను పక్కన పెడితే నికర ఆదాయంలో  6.7 శాతం(వై ఓ వై ఆదారంగా)

అధిక సర్‌చార్జీలతో 40 శాతం ఎఫ్‌పీఐలపైనే ప్రభావం!

Wednesday 10th July 2019

ఆర్థిక శాఖ విశ్లేషణ బడ్జెట్లో విధించిన అధిక సర్‌చార్జీతో ఎఫ్‌పీఐల్లో 40 శాతం మందిపై ప్రభావం పడుతుందని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఈ 40 శాతం ఎఫ్‌పీలు ట్రస్ట్‌ నిర్మితిని(ట్రస్ట్‌ స్ట్రక్చర్‌) అవలంబిస్తాయని, మిగిలిన 60 శాతం మంది కార్పొరేట్‌ నిర్మితిని పాటిస్తాయని వివరించింది. ఈ 60 శాతం ఎఫ్‌పీఐలపై అధిక సర్‌చార్జీ ప్రభావం ఉండదని తెలిపింది. పైన చెప్పిన 40 శాతం ఎఫ్‌పీఐలు ఎందుకు ట్రస్ట్‌ నిర్మితిని అవలంబిస్తున్నాయి? ఇందువల్ల

Most from this category