News


టాటా గ్లోబల్‌- భారత్‌ వైర్స్‌ హైజంప్‌

Wednesday 5th February 2020
Markets_main1580879901.png-31522

సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ
12,000 పాయింట్లకు ఎగువన నిఫ్టీ 

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. 204 పాయింట్లు పెరిగి 40,994 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 56 పాయింట్లు పుంజుకుని 12,035 వద్ద ట్రేడవుతోంది. వెరసి సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల మా‍ర్క్‌కు చేరువకాగా.. నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాయికి ఎగువన కదులుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా పానీయాల దిగ్గజం టాటా ‍గ్లోబల్‌ బెవరేజెస్‌, భారత్‌ వైర్‌ రోప్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో ఈ రెండు కౌంటర్లూ సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

టాటా ‍‍గ్లోబల్‌ బెవరేజెస్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో టాటా ‍‍గ్లోబల్‌ బెవరేజెస్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7.2 శాతం జంప్‌చేసి రూ. 407 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 408ను తాకింది. ఇది సరికొత్త గరిష్టం‍కాగా.. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో టాటా గ్లోబల్‌ నికర లాభం రూ. 136 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 25 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం దాదాపు యథాతథంగా రూ. 1962 కోట్లను తాకింది. భాగస్వామ్య సంస్థలు, సహచర సంస్థల పనితీరు మెరుగుపడటం, పన్ను వ్యయాలు తగ్గడం వంటి అంశాలు లాభాల్లో వృద్ధికి దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో దేశీ బ్రాండెడ్‌ బిజినెస్‌ పరిమాణం 7 శాతం, విలువ 6 శాతం చొప్పున బలపడినట్లు తెలియజేసింది. జేవీ..  టాటా స్టార్‌బక్స్‌ ఆదాయం 27 శాతం ఎగసినట్లు వెల్లడించింది. 28 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు తెలియజేసింది. దీంతో తాజాగా 11 పట్టణాలలో మొత్తం 174 స్టోర్లకు బిజినెస్‌ విస్తరించినట్లు వివరించింది.

భారత్‌ వైర్‌ రోప్స్‌
మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సహవ్యవస్థాపకులు రామ్‌దేవ్‌ ఆగర్వాల్‌ 9,42,109 షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు వెల్లడించడంతో భారత్‌ వైర్‌ రోప్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. మరోవైపు బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సైతం విడిగా 9,42,108 భారత్‌ వైర్‌ రోప్స్‌ షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ రెండు డీల్స్‌ షేరుకి రూ. 26.25 సగటు ధరలో జరిగినట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ. 4.94 కోట్లుకాగా.. ఈ వార్తలతో భారత్‌ వైర్‌ రోప్స్‌ కౌంటర్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు క్యూకట్టారు. ఫలితంగా ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 5.4 ఎగసి రూ. 32.50 వద్ద ఫ్రీజయ్యింది. You may be interested

అవంతీ ఫీడ్స్‌ పతనం- గ్రాన్యూల్స్‌ జోరు

Wednesday 5th February 2020

13 శాతం కుప్పకూలిన అవంతీ 5 శాతం జంప్‌చేసిన గ్రాన్యూల్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఆక్వా రంగ కంపెనీ అవంతీ ఫీడ్స్‌ కౌంటర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అయితే మరోపక్క అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి ఏఎన్‌డీఏకు అనుమతి లభించినట్లు వెల్లడించడంతో ఫార్మా రంగ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా జోరందుకుంది. అవంతీ ఫీడ్స్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో అవంతీ ఫీడ్స్‌ లిమిటెడ్‌ నికర

నిఫ్టీలో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం!

Wednesday 5th February 2020

ట్రేడర్లు కొంత రిస్కు తీసుకోగలిగితే నిఫ్టీలో బుల్‌కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించడం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ ఈ సీరిస్‌లో తన గత గరిష్టం 12430 పాయింట్ల వద్ద గట్టి నిరోధం ఎదుర్కోనుంది. నిఫ్టీ ఎక్స్‌పైరీ వరకు 12100- 12400 పాయింట్ల రేంజ్‌లో కదలాడవచ్చని, అందువల్ల ఈ వ్యూహం బెటరని నిపుణుల సలహా. ఈ వ్యూహానికి 12500 పాయింట్లు స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.  వ్యూహ వివరణ =

Most from this category