STOCKS

News


టాటా ఎలక్సీ, ఆశాపురా, హడ్కో..జూమ్‌

Monday 13th January 2020
Markets_main1578908599.png-30893

సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త రికార్డ్స్‌

ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉపశమించడంతోపాటు.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్న అంచనాలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం‍ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలి సెషన్‌లోనే అటు నిఫ్టీ, ఇటు సెన్సెక్స్‌ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. మధ్యాహ్నం 2.40 సమయంలో సెన్సెక్స్‌ 227 పాయింట్లు జంప్‌చేసి 41,826కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు ఎగసి 12,320 వద్ద ట్రేడవుతోంది. తొలుత 41,900 సమీపానికి చేరడం ద్వారా సెన్సెక్స్‌, 12,338కు చేరడం ద్వారా నిఫ్టీ సరికొత్త ఇంట్రాడే రికార్డులను సాధించాయి. కాగా.. ప్రస్తుతం వివిధ వార్తల నేపథ్యంలో టాటా ఎలక్సీ, ఆశాపురా మైన్‌కెమ్‌, హడ్కో లిమిటెడ్‌ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. వివరాలు చూద్దాం..

టాటా ఎలక్సీ
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఇంజినీరింగ్‌ సంబంధ ఐటీ సేవల కంపెనీ టాటా ఎలక్సీ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 51 శాతంపైగా జంప్‌చేసి 75 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం పెరిగి రూ. 423 కోట్లను తాకింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం టాటా ఎలక్సీ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 890 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 900 వరకూ దూసుకెళ్లింది! ఈ కౌంటర్‌లో ట్రేడింగ్‌ పరిమాణం ఐదు రెట్లు పెరిగి 1.1 లక్షల షేర్లకు చేరింది!

ఆశాపురా మైన్‌కెమ్‌ 
ప్రమోటర్‌ గ్రూప్‌నకు ప్రిఫరెన్షియల్‌ పద్ధతితో వారంట్ల జారీకి బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లడించడంతో ఆశాపురా మైన్‌కెమ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 32.55 వద్ద ఫ్రీజయ్యింది. ఏడాదిన్నర కాలం(18 నెలల్లో)గా ఈ వారంట్లను ప్రమోటర్లు ఈక్విటీగా మార్పిడి చేసుకునేందుకు వీలుంటుందని కంపెనీ తెలియజేసింది. మొత్తం 4.5 లక్షల వారంట్లను ప్రమోటర్‌ గ్రూప్‌నకు కేటాయించనున్నట్లు తెలియజేసింది.

హడ్కో లిమిటెడ్‌
రూ. 726 కోట్లమేర రుణాలు పొందిన ఒక సంస్థ ఈ నెల 9కల్లా బకాయిలను చెల్లించినట్లు తాజాగా హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(హడ్కో) లిమిటెడ్‌ వెల్లడించింది. దీంతో ఈ ఖాతా మొండి బకాయిల(ఎన్‌పీఏలు) నుంచి బయటపడినట్లు తెలియజేసింది. అయితే మరోవైపు రూ. 869 కోట్లమేర రుణాలు తీసుకున్న మరోసంస్థ డిసెంబర్‌లో బకాయిల చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో హడ్కో షేరు 2 శాతం లాభంతో రూ. 41 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 89.81% వాటా ఉంది.You may be interested

సెన్సెక్స్‌, నిఫ్టీ రికార్డు ముగింపు

Monday 13th January 2020

ఇంట్రాడేలో 41,900 సమీపానికి సెన్సెక్స్‌ 12,338 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ ప్లస్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉపశమించడంతోపాటు.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్న అంచనాలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం‍ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలి సెషన్‌లోనే అటు నిఫ్టీ, ఇటు సెన్సెక్స్‌ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. తొలుత 41,900 సమీపానికి చేరడం ద్వారా సెన్సెక్స్‌, 12,338కు చేరడం ద్వారా నిఫ్టీ

బ్యాంకునిఫ్టీలో బేర్‌పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం బెటర్‌!

Monday 13th January 2020

బ్యాంకు నిఫ్టీ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ పరిశీలిస్తే రేంజ్‌బౌండ్‌ కదలికలకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకు నిఫ్టీలో ఐవీ(ఇంప్లైడ్‌ వొలటిలిటీ) పెరుగుతోంది, పీఎస్‌యూబ్యాంకుల్లో అమ్మకాలు కనిపిస్తున్నాయి, ప్రైవేట్‌ బ్యాంకులు చాలా వరకు అలసినట్లున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు నిఫ్టీలో భారీ ర్యాలీకి ఛాన్సులు స్వల్పంగానే ఉన్నాయి. గతవారం ప్రధాన బ్యాంకు షేర్లలో షార్ట్స్‌ ఎక్కువగా నమోదయ్యాయి. ఈ సమయంలో బ్యాంకు నిఫ్టీలో బేర్‌ పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం

Most from this category