News


టాటా కెమ్‌, టాటా గ్లోబల్‌ జూమ్‌

Monday 13th January 2020
Markets_main1578898988.png-30889

కన్జూమర్‌ విభాగం విలీనం ఎఫెక్ట్‌
ఐదో రోజూ టాటా గ్లోబల్‌ జోరు
52 వారాల గరిష్టానికి టాటా కెమ్‌


తాజాగా టాటా కెమికల్స్‌ కంపెనీ కన్జూమర్‌ విభాగాన్ని విడదీసేందుకు జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఓకే చెప్పడంతోపాటు.. గ్రూప్‌లోని మరో కంపెనీ టాటా గ్లోబల్‌ ఈ బిజినెస్‌ను విలీనం చేసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వెరసి టాటా గ్రూప్‌ కంపెనీల మధ్య బిజినెస్‌ విడతీత, విలీన ప్రతిపాదనలకు అనుమతి లభించడంతో ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లవైపు దృష్టి సారించారు. ఫలితంగా మధ్యాహ్నం 12 ప్రాంతంలో టాటా గ్లోబల్‌ షేరు 2.4 శాతం పుంజుకుని రూ. 350 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 351ను అధిగమించడం ద్వారా ఏడాది గరిష్టానికి చేరింది. ఇక టాటా కెమికల్స్‌ షేరు 1.5 శాతం పెరిగి రూ. 700 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 705 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. కాగా.. టాటా గ్లోబల్‌ షేరు వరుసగా ఐదో రోజు లాభపడటం గమనార్హం! గత వారం రోజుల్లో ఈ షేరు 13 శాతం ర్యాలీ చేసింది. ఇక టాటా కెమికల్స్‌ షేరు సైతం 7 శాతం పుంజుకుంది.

విలీన పథకం ఇలా..
గతేడాది మే నెలలోనే టాటా కెమికల్స్‌ కన్జూమర్‌ బిజినెస్‌ను విడదీసేందుకు నిర్ణయించింది. ఈ విభాగాన్ని విలీనం చేసుకోవడం ద్వారా టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ తదుపరి టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌గా ఆవిర్భవించేందుకు బోర్డు అనుమతించింది కూడా! కన్జూమర్‌ బిజినెస్‌ను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా ఆహారం, పానీయాల విభాగంలో మరింత పెద్ద కంపెనీగా కార్యకలాపాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ పథకంలో భాగంగా టాటా కెమికల్స్‌ వాటాదారులకు ప్రతీ 1 షేరుకి 1.14 టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ షేర్లు లభించనున్నాయి. అంటే టాటా కెమికల్స్‌లో 100 షేర్లు కలిగిన వాటాదారులు టాటా గ్లోబల్‌కు చెందిన 114 షేర్లను పొందే వీలుంది.



You may be interested

ఇన్ఫీ జోరు: ఐటీ ఇండెక్స్‌ 2శాతం అప్‌

Monday 13th January 2020

ఐటీ షేర్లకు సోమవారం కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ శుక్రవారం క్యూ3 ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకున్నాయి. ఫలితంగా నేడు ఈ షేరు 5శాతం లాభపడింది. ఇన్ఫీ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడం ఇదే రంగంలో మిగతా షేర్ల ర్యాలీకి తోడ్పాటునిచ్చింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ క్రితం టాటా

రూ.39,800 దిగువకు బంగారం

Monday 13th January 2020

దేశీయంగా బులియన్‌ మార్కెట్లో బంగారం ధర రూ.39,800 దిగువున ట్రేడ్‌ అవుతున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం, ఈక్విటీ మార్కెట్లు రికార్డు గరిష్టాలను అందుకోవడం, అమెరికా చైనాల మద్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే అంచనాలు డాలర్‌కు బలాన్నివ్వడం తదితర అంశాలు బంగారం ధర తరిగిపోయేందుకు తోడ్పాటునిచ్చాయి. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల బంగారం ధర రూ.173.00 నష్టపోయి రూ.39698.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  కిందటి వారం

Most from this category