News


వెలుగులోకి విద్యుత్‌ షేర్లు

Friday 12th October 2018
Markets_main1539338463.png-21092

విద్యుత్‌ టారీఫ్‌లను పెంచుకునేందుకు ధాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించడంతో విద్యుత్‌  షేర్లు శుక్రవారం వెలుగులోకొచ్చాయి. బీఎస్‌ఈలో పవర్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించిన ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ పవర్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 3శాతం లాభపడింది. విద్యుత్‌ టారీఫ్‌లను పెంచుకోనేందుకు తమ అనుమతినివ్వాలంటూ టాటా, అదానీ పవర్‌ కంపెనీలు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ను ధాఖలు చేశాయి. నేడు విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌పై రెండు వారాల తర్వాత తీర్పున వెల్లడిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ప్రకటనతో ఇంట్రాడేలో పవర్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. నేటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ పవర్‌ ఇండెక్స్‌ 3శాతం లాభపడి 1,960.56 గరిష్టానికి చేరుకుంది. ఈ సూచీలోని ప్రధాన షేర్లైన టాటాపవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్స్‌ షేర్లు 5శాతం లాభపడ్డాయి. సీఈఎస్‌ఈ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, సుజ్లాన్‌ ఎనర్జీ, జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్టక్చర్స్‌ షేర్లు 7శాతం నుంచి 5శాతం వరకు ర్యాలీ చేశాయి. అలాగే కేఈసీ ఇంటర్నేషనల్‌, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సెల్యూషన్స్‌, భెల్‌, టోరెంటో పవర్‌ షేర్లు 3శాతం లాభపడ్డాయి. ఎన్‌హెచ్‌పీసీ, ఏబిబి ఇండియా, సిమెన్స్‌ ఎన్‌టీపీసీ షేర్లు 2నుంచి 1శాతం లాభపడ్డాయి.You may be interested

బ్యాంకింగ్‌ షేర్లే బెటర్‌!

Friday 12th October 2018

ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎన్‌బీఎఫ్‌సీల కన్నా బ్యాంకు స్టాకులను నమ్ముకోవడం మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బయటకు రావడంతో విత్త రంగ షేర్లు భారీగా కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలు కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చని అందువల్ల వీటి కన్నా బ్యాకింగ్‌ షేర్లను ఆశ్రయించడం బెటరని డైమెన్షన్స్‌ కన్సల్టింగ్‌ ఎండీ అజయ్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఇప్పటికే బ్యాంకు షేర్లున్న వాళ్లు స్వల్ప మొత్తాలతో పుట్స్‌

విదేశీ ఇన్వెస్టర్లు ఏం కొన్నారు? ఏం అమ్మారు?

Friday 12th October 2018

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌ నెలలో నికరంగా చూస్తే ఈక్విటీ మార్కెట్‌లో విక్రయదారులుగానే మిగిలారు. ఇండియన్‌ మార్కెట్‌ గత రెండు నెలలుగా పడుతూనే వస్తోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ వల్ల తలెత్తిన లిక్విడిటీ భయాలు, క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత వంటి అంశాలు ప్రతికూల ‍ప్రభావం చూపాయి.  నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ గణాంకాల ప్రకారం చూస్తే.. విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో నికరంగా రూ.10,800 కోట్లు (1.5 బిలియన్‌ డాలర్లు) విలువైన

Most from this category