News


ఎన్‌బీఎఫ్‌సీలకు సీనియర్‌ మేనేజర్లు బై

Thursday 1st August 2019
Markets_main1564650380.png-27476

ఎన్‌బీఎఫ్‌సీ రంగం సంక్షోభంలో చిక్కుకోవడంతో ఈ రంగంలో పనిచేసిన సీనియర్‌ మేనేజర్లు బ్యాంకింగ్‌ లేదా ఫిన్‌టెక్‌ విభాగాలకు మారుతున్నారని విశ్లేషకులు తెలిపారు. ఒకనొకప్పుడు బ్యాంకింగ్‌ సెక్టార్‌ నుంచి ఎన్‌బీఎప్‌సీల వైపు స్విచ్‌ ఓవర్లు జరిగిన విషయం తెలిసిందే. మనీషా లాత్ గుప్తా (క్లిక్స్ క్యాపిటల్ నుంచి ఉబెర్‌కు), రమేష్ విశ్వనాథన్  (ఎల్ అండ్ టి ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌కు) స్విచ్‌ఓవర్‌ చేసిన వారిలో సుప్రసిద్ధులు. పెద్ద సంఖ్యలో షిఫ్టులు బ్యాంకింగ్, ఫైనాన్స్ (30 శాతం), ఫిన్‌టెక్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ / కన్సల్టింగ్ (30 శాతం) లేదా మెరుగైన స్థితిలో ఉన్న ఎన్‌బిఎఫ్‌సి (40 శాతం) లవైపు జరుగుతున్నాయని స్పెషలిస్ట్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కరాంత్ ఓ ఆంగ్ల పత్రికతో చెప్పారు. ఎక్కువ మంది ప్రజలు సురక్షితమైన జాబ్‌ను కోరుకుంటున్నారని మరొక రిక్రూటర్ ఈ వార్తాపత్రికకు తెలిపారు. గత మూడు నెలల్లో, రూ.20 లక్షల ప్లస్‌ జీతం ఉన్న 700 మందికి పైగా సివి (కరిక్యూలమ్‌ విటా) జాబ్ మార్కెట్‌లోకి వచ్చాయని ఆయన వివరించారు.  కనీసం 30 ఎన్‌బిఎఫ్‌సిలు తమ కంపెనీలలో నియామకాలను స్తంభింపజేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. పరిహారం ప్యాకేజీ చర్చలు 40-50 శాతం  స్థాయిల నుంచి 10-15 శాతానికి పడిపోయాయని మైఖేల్ పేజ్ ప్రాంతీయ డైరెక్టర్ అన్షుల్ లోధ పేర్కొన్నారు. You may be interested

బ్రోకరేజ్‌ల డౌన్‌గ్రేడ్‌...జీ డౌన్‌ 10 శాతం

Thursday 1st August 2019

రుణ సంక్షోభం నుంచి గట్టెక్కెందుకు ఇన్వెస్కో ఓపెన్‌ హైపర్‌ ఫండ్‌కు రూ.4224 కోట్ల విలువైన వాటాను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నప్పటీకీ.., జీ మీడియా షేర్లు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 7 శాతం వరకు క్షీణించాయి. ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యూహాత్మకంగా ఫైనాన్షియల్‌ ఇన్వెస్టర్‌కు వాటా విక్రయిచడం ఇన్వెస్టర్లను నిరుత్సాహపరిచినట్లు మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఫైనాన్షియల్‌ ఇన్వెస్టరుకు విక్రయిస్తే యాజమాన్య నిర్వహణ ఎస్సెల్‌ చేతుల్లోనే వుంటుంది. జీ షేర్లను తనఖా పెట్టుకున్న మ్యూచువల్‌

ఫెడ్‌ రేట్‌కట్‌ ఎందుకింత భయపెట్టింది?

Thursday 1st August 2019

భారీగా పతనమైన యూఎస్‌ మార్కెట్లు అదేబాటలో ఆసియా మార్కెట్లు అంతా ఊహించినట్లే యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంకు బుధవారం సమావేశంలో వడ్డీరేట్లను 25 బీపీఎస్‌ మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ సందర్భంగా ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చేసిన కామెంట్లు ఒక్కసారిగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో యూఎస్‌ మార్కెట్‌ నిట్టనిలువునా పతనమైంది. సమీక్షా సమావేశం సందర్భంగా మాట్లాడుతూ సుదీర్ఘ రేట్‌ కట్‌ సైకిల్‌కు తాజా నిర్ణయం ఆరంభం కాదని పావెల్‌

Most from this category