News


సుజ్లాన్‌- ఎన్‌సీఎల్‌.. బోర్లా

Wednesday 8th January 2020
Markets_main1578465500.png-30763

రుణ చెల్లింపుల్లో సుజ్లాన్‌ ఎనర్జీ విఫలం
క్యూ3లో ఎన్‌సీఎల్‌ సిమెంట్‌ ఉత్పత్తి డీలా

పశ్చిమాసియాలో తలెత్తిన తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాట పట్టాయి. ఉదయం 11.45 ప్రాంతంలో సెన్సెక్స్‌  280 పాయింట్లు క్షీణించి 40,590 దిగువకు చేరగా.. నిఫ్టీ 92 పాయింట్లు కోల్పోయి 11,961 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడికావడంతో పవన విద్యుత్‌ రంగ కంపెనీ సుజ్లాన్‌ ఎనర్జీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతా అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరవుకావడంతో ఈ కౌంటర్‌ 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో సిమెంట్‌ ఉత్పత్తి నీరసించడంతో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. వివరాలు చూద్దాం...

సుజ్లాన్‌ ఎనర్జీ
రూ. 7256 కోట్లకుపైగా రుణాల చెల్లింపుల్లో విఫలమైనట్లు పవన విద్యుత్‌ రంగ కంపెనీ సుజ్లాన్‌ ఎనర్జీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తాజాగా వెల్లడించింది. 2019 మార్చి 19కల్లా చెల్లించవలసిన ఈ రుణాలను ప్రభుత్వ రంగ స్టేట్‌బ్యాంక్‌, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(IREDA) అధ్యక్షతన 18 బ్యాంకులు అందించినట్లు తెలియజేసింది. ఫండ్‌, నాన్‌ఫండ్‌ ఆధారిత వర్కింగ్‌ కేపిటల్‌, కాలపరిమితి రుణాలు తదితరాల ద్వారా ఈ నిధులు లభించినట్లు వెల్లడించింది. కాగా.. బ్యాంకులు, ఫైనాన్షియల్‌ కంపెనీల నుంచి తీసుకున్న రుణాలు రూ. 12,785 కోట్లమేర ఉన్నట్లు వివరించింది. ప్రస్తుతం కంపెనీ స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణ భారం కలిపితే రూ. 14,048 కోట్లకుపైగా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సుజ్లాన్‌ ఎనర్జీ షేరు 10 శాతం పతనమైంది. రూ. 3.15 వద్ద ఫ్రీజయ్యింది. 

ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో సిమెంట్‌ ఉత్పత్తి 23 శాతం క్షీణించి 4,23,199 ఎంటీకి పరిమితమైనట్లు ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. గతేడాది(2018-19) క్యూ3లో 5,52,019 ఎంటీ సిమెంటును ఉత్పత్తి చేసినట్లు తెలియజేసింది. ఇక సిమెంట్‌ పంపిణీ సైతం 22 శాతం వెనకడుగుతో 4,30,861 ఎంటీకి చేరినట్లు వెల్లడించింది. అయితే సిమెంట్‌ బోర్డ్‌ తయారీ మాత్రం 8 శాతం పుంజుకుని 19,091 ఎంటీని తాకినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2.5 శాతం క్షీణించి రూ. 96 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 93 దిగువకూ చేరింది.You may be interested

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Wednesday 8th January 2020

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ కల్లా మెటల్‌ షేర్లు నష్టాలను ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:20నిల.కు ఇండెక్స్‌ క్రితం ముగింపుస్థాయి(2,785.90)తో పోలిస్తే 1.55శాతం నష్టంతో 2,742.80     వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు 3శాతం నష్టపోయింది. ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2.50శాతం, మెయిల్‌, ఏపిఎల్‌ అపోలో, హిందాల్కో షేర్లు 2శాతం నష్టపోయాయి.

క్రూడ్‌ కారణంగా పతనమయ్యే షేర్లు కొంటున్నాం...

Wednesday 8th January 2020

దేవాంగ్‌ మెహతా క్రూడాయిల్‌ ధరతో పతనమయ్యే ఎంఎన్‌సీ ఫార్మా, కన్జూమర్‌ కంపెనీల షేర్లలో నాణ్యమైన వాటిని తాము కొంటున్నామని, పోర్టుఫోలియోలో వీటి వాటా పెంచుకుంటున్నామని సెంట్రమ్‌ వెల్త్‌ సలహాదారు దేవాంగ్‌ మెహతా చెప్పారు. వీటితో పాటు బిల్డింగ్‌ మెటీరియల్స్‌, పెయింట్స్‌, ఎలక్ట్రిక్‌ గూడ్స్‌ కంపెనీల షేర్లను కూడా పెంచుకుంటున్నామన్నారు. ఈ కంపెనీలన్నింటికీ ప్రైసింగ్‌ పవర్‌ ఉందని, స్వల్పకాలిక ఉద్రిక్తతలతో తలెత్తిన నెగిటివిటీ వల్ల ఇవి పతనమవుతున్నాయని వివరించారు. అందుకే వీటిని కొని

Most from this category