News


200డీఎంఏ దాటితేనే ర్యాలీ...!

Thursday 29th August 2019
Markets_main1567019573.png-28077

నిఫ్టీ50 ఇండెక్స్‌ కీలకమైన 200 డీఎంఏ స్థాయి(11,205)ని క్లోజింగ్‌లో అధిగమించినప్పుడే మార్కెట్లో స్థిరమైన ర్యాలీ సాధ్యపడుతుందని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. సూచీల కదలికలపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది...

 

‘‘బుధవారం మరో అస్థిర సెషన్‌ కొనసాగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఆరంభంలో లాభాల్లోనే ఉన్నప్పటికీ చివరికి మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. సూచీ 59 పాయింట్ల నష్టంతో (0.53శాతం) 11,046.10 వద్ద క్లోజయింది. గురువారం సెషన్‌తో ఆగస్ట్‌ నెల డెరివేటివ్స్‌ ఎక్స్‌పైర్‌ కానున్నాయి. కనుక గడువు తీరిపోయే ట్రేడ్లతో సెషన్‌పై అస్థిరతల ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం నుంచి రెండో విడత మద్దతు చర్యల కోసం దలాల్‌ స్ట్రీట్‌ ఇన్వెస్టర్లు చూస్తున్నారు. వారం వారీ ఆప్షన్ల డేటా గమనిస్తే.. 11,000 అన్నది నిఫ్టీకి ఇన్ఫెక‌్ష్లన్‌ పాయింట్‌గా ఉంటుంది. కనుక ఈ స్థాయిలో మార్కెట్లను గమనించాల్సి ఉంటుంది. ఎటువంటి అంతర్జాతీయ ప్రతికూల అంశాలు లేనందున గురువారం మార్కెట్లు స్థిరంగా ఆరంభం కావచ్చు. 11,150-11,210 స్థాయిలు నిఫ్టీకి నిరోధంగా పనిచేస్తాయి. 11,950, 11880 మద్దతు స్థాయిలు అవుతాయి. రిలేటివ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌ (ఆర్‌ఎస్‌ఐ) డైలీ చార్ట్‌లో 47.21 వద్ద తటస్థంగానే ఉంది. 

 

డైలీ ఎంఏసీడీ బుల్లిష్‌గా, సిగ్నల్‌ లైన్‌ పేనే ట్రేడ్‌ అయింది. క్యాండిల్స్‌లో ఎటువంటి ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోలేదు. ప్యాటర్న్‌ పరిశీలిస్తే నిఫ్టీ 200డీఎంఏ (11,205) దిగువన ట్రేడ్‌ అవడమే కాకుండా రౌండింగ్‌ టాప్‌ ఫార్మేషన్‌ నెక్‌లైన్‌ దిగువన సాంకేతిక పుల్‌బ్యాక్‌ను అడ్డుకుంది. ప్రస్తుత టెక్నికల్‌ నిర్మాణం ప్రకారం చూస్తే.. ఇండెక్స్‌ బలమైన్‌ బేస్‌ను 10,800 వద్ద నమోదు చేసింది. కానీ అదే విధంగా 11,100-11,200 జోన్ బలమైన నిరోధంగానూ వ్యవహరిస్తోంది. మార్కెట్‌ ఈ రేంజ్‌లోనే ట్రేడ్‌ కావచ్చు. కేవలం క్లోజింగ్‌లో 200డీఎంఏ పైకి వెళితేనే నిలకడమైన ర్యాలీ ఉంటుంది. ట్రేడర్లు తమ లాభాలను కాపాడుకుంటూ పరిమిత పొజిషన్లలో ఉండాలన్నది మా సూచన’’ అని వైష్టవ్‌ తెలిపారు. You may be interested

11000 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Thursday 29th August 2019

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 37300 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 11000 దిగువున 10,996.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు ఆగస్ట్‌ నెల డెరివేటివ్స్‌ ముగింపు కావడంతో పాటు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు తగ్గకపోవడంతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగే ప్రక్రియ (బ్రెగ్జిట్‌) ఉండకపోవచ్చనే ఊహాగానాలు

ఈ కంపెనీల లాభాలు రెట్టింపయ్యాయి..!

Thursday 29th August 2019

బీఎస్‌ఈ 500లో 36 కంపెనీల లాభాలు క్యూ1లో రెట్టింపయ్యాయి. దేశ ఆర్థిక రంగ వృద్ధి, కార్పొరేట్‌ ఆదాయాల వృద్ధి మందగమనం పరిస్థితుల్లోనూ ఇంత చక్కని పనితీరు చూపించిన ఈ కంపెనీలపై ఇన్వెస్టర్లు తప్పక దృష్టి సారించాలి.    ఇలా లాభాల విషయంలో మంచి పనితీరు చూపించిన కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఆస్ట్రాజెనెకా ఫార్మా, బోంబే బర్మా ట్రేడింగ్‌, చెన్నై పెట్రో, చోళమండలం ఫైనాన్షియల్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌, గుజరాత్‌ గ్యాస్‌, హ్యాట్సన్‌

Most from this category