News


టాప్‌5లో మూడు ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు

Wednesday 19th June 2019
Markets_main1560932850.png-26415

సెక్టార్‌తో సంబంధం లేకుండా ఉత్తమ ప్రదర్శన నమోదు

గత కొంత కాలంగా లిక్విడిటీ సమస్యలతో అధ్వాన్నంగా ఉన్న నాన్‌ బాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) సెక్టార్‌ బుధవారం ఆకర్షించింది. ఆవాస్‌ ఫైనాన్స్‌, మనప్పురం ఫైనాన్స్‌ కంపెనీలు నిఫ్టీ500 సూచీలో మంచి ప్రదర్శన చేసిన మొదట ఐదు కంపెనీలలో ఉండడం గమనార్హం. ఈ రంగంలో సంక్షోభం ఉన్నప్పటికి నాణ్యమైన స్టాక్‌లకు మంచి ఈ రంగంలో అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు మైక్రో ఫైనాన్స్‌ సంస్థైనా క్రెడిట్‌ యాక్సిస్‌ గ్రామిణ్‌ కూడా నిఫ్టీ 500లో మంచి ప్రదర్శన చేసిన ఐదు కంపెనీలో ఒకటిగా ఉంది. మార్చి 29, 2019 నాటికి ఉన్న ఫ్రీ ప్లోట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో ఈ కంపెనీకి 96.1 శాతం ఉండడం గమనార్హం. 
నాణ్యతకు అవకాశం..
 ‘మార్కెట్‌లో ఉత్తమ, అధ్వాన్న షేర్లు ఎన్‌బీఎఫ్‌సీ నుంచే ఉండడం ఉత్తమ, అధ్వాన్న పరిస్థితుల విరుధ్దతను సూచిస్తోంది’ అని ప్రభుదాస్‌ లిల్లాధర్‌ సీఈఓ, చీఫ్‌ పోర్టుపోలియో మానెజర్‌ అజయ్‌ బోడ్కే అన్నారు. ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి తేది(వై టూ డీ) వరకు ఆవాస్‌ ఫైనాన్స్‌ షేరు 72.35 శాతం, మనప్పురం 53.51 శాతం, క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామిణ్‌ 48.62 శాతం పెరిగాయి. ఇదే కాలంలో నిఫ్టీ 7 శాతం, సెన్సెక్స్‌ 7.7 శాతం పెరగుదలను నమోదు చేశాయి. క్రెడిట్‌ యాక్సెస్‌ 2018, అగష్టులో, ఆవాస్‌ ఫైనాన్స్‌ 2018, సెప్టెంబర్‌లో స్టాక్‌ మార్కెట్‌లో నమోదయ్యాయనే విషయం తెలిసిందే. ఈ కంపెనీల ఐపీఓ ధరల కంటే ఇప్పుడు ఆవాస్‌ ఫైనాన్స్‌ 76.36 శాతం,  క్రెడిట్‌ యాక్సెస్‌ 38.66శాతం  వృద్ధిని నమోదు చేశాయి.  ‘ఎన్‌బీఎఫ్‌సీలో పెట్టుబడులకు ఇంకా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. కాని బలమైన ఆధారం ఉన్న కొన్ని సంస్థలు సరియైన ధరల వద్ధ మార్కెట్‌ వాటాలను పొందగలవు’ అని బీఎన్‌బీ పరిబాస్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌ ద్యూ అన్నారు. ‘ గోల్డ్‌ ఫైనాన్స్‌, తనఖాలతో రుణాలు ఇచ్చే కొన్ని ప్రత్యేకమైన కంపెనీల వైపు పెట్టుబడిదారులు ఆకర్షితులవ్వవచ్చు. కానీ చివరికి ఈ రంగంలో నాణ్యతేకే ప్రాధాన్యం ఉంటుంది’ అని ఆయన వివరించారు.
     ‘అధిక ప్రమాదం, సంక్షోభం కారణాన ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఎక్కడైతే బలమైన బాలెన్స్‌ సీట్‌లను నిర్వహించే, నమ్మకస్థులైన ప్రమోటర్లున్న కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారని బోడ్కే అన్నారు.  ఈ కంపెనీలు క్రెడిట్‌ మార్కెట్‌ను సరియైన ధరలలో చక్కగా నిర్వహిండానికి ఇదొక కారణమని ఆయన వివరించారు. ఆవాస్‌ ఫైనాన్స్‌కు ఒక ‘స్ట్రాంగ్‌ బై’, ఒక ‘బై’, ఒక ‘హోల్డ్‌’ రెటింగ్‌లుండగా, మణప్పురం ఫైనాన్స్‌కు 5 ‘స్ట్రాంగ్‌బై’, 3 ‘బై’, 2 ‘హోల్డ్‌’ రేటింగ్‌లున్నాయని థామస్‌ రీయూటర్స్‌ ప్రకటించింది. 
ఆవాస్‌ ఫైనాన్స్‌కు దన్నుగా ఆస్థి నాణ్యత..  
 నిలకడైన ఆస్థి నాణ్యత వలన ఈ ఏడాది ఆవాస్‌ ఫైనాన్స్‌ 45 శాతం అసెట్‌ అండర్‌ మానెజ్‌మెంట్‌ (ఏయూఎమ్‌) పెరుగుదల, 85శాతం సంపాధన పెరుగుదలలు ఉంటాయని మే3 ని ప్రకటించిన నోట్‌లో ఎడెల్‌వెయిసెస్‌  పేర్కొంది. అం‍తేకాకుండా తాజా షేరు ర్యాలీని గమనిస్తే 2020 సెప్టెంబర్‌ నాటికి బుక్‌ విలువ 4.6 రెట్లు పెరుగుతుందని తెలిపింది. కానీ ఈ షేరు ఖరిదవుతుండడంతో జాగ్రత్త వహించాలని హెచ్చరించి రేటింగ్‌ను ‘బై’ నుంచి ‘హోల్డ్‌’కు తగ్గించింది. ఈ స్టాక్‌ మే 27న రూ.1,514 వద్ద గరిష్ఠ స్థాయిని తాకగా అప్పటి నుంచి 3.72 శాతం తగ్గి ట్రేడవుతోంది. 
బలం‍గా ఉన్న మణప్పురం, క్రెడిట్‌ యాక్సిస్‌ గ్రామిణ్‌ 
 ఏయూఎమ్‌ పుంజుకోవడం, ఆస్థి నాణ్యత స్థిరంగా ఉండడం, గోల్డ్‌ కూడా స్థిరంగా ఉండడం మణప్పురం ఫైనాన్స్‌కు  కలిసొచ్చే అంశాలని జూన్‌ 10 న విడుదల చేసిన నోట్‌లో యాక్సిస్‌ సెక్యూరిటిస్‌ వివరించింది. తక్కువ కాల వ్యవధి రుణాలపై దృష్ఠి పెట్టడంతో కంపెనీ ఆస్థి నాణ్యత పెరిగిందని తెలిపింది. ‘ 50-50 బంగార, బంగారేతర మిశ్రమ శాఖల నిర్వహణతో  స్థిరమైన ఏయూఎమ్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాం’ అని యాక్కిస్‌ సెక్యూరిటిస్‌ వివరించింది. అంతేకాకుండా కంపెనీ టార్గెట్‌ రేటింగ్‌ను రూ.156గా ఉంచి ‘బై’ రేటింగ్‌ను నిర్వహిస్తామని తెలిపింది.
      క్రెడిట్‌ యాక్సిస్‌ గ్రామిణ్‌కు ఒక ‘బై’ రేటింగ్‌ మాత్రమే ఉంది. అది కూడా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నుంచి ఉంది. టార్గెట్‌ ధర రూ.530 వద్ద  క్రెడిట్‌ యాక్సిస్‌ గ్రామిణ్‌ ను  ‘యాడ్‌’ రేటింగ్‌ నుంచి ‘బై’ రేటింగ్‌గా నవీనికరించామని తెలిపింది. ప్రస్తుతం ఈ షేరు విలువ పై టార్గెట్‌ కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. ‘ క్రెడిట్‌ యాక్సిస్‌ గ్రామిణ్‌ ఎమ్‌ఎఫ్‌ఐ రంగంలో వృద్ధిని నమోదు చేస్తుందని భావిస్తున్నాం. సంస్థ వారంతపు సేకరణ పద్ధతి, ధర ప్రభావిత పెరుగుదల ప్రణాళిక , రూరల్‌ మైక్రో ఫైనాన్సింగ్‌లో నైపుణ్యం లాభాలను అందిస్తాయని ఆశిస్తున్నాం’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇన్‌ఫో ఎడ్జ్‌, బలరాంపూర్‌ చీని మిల్స్‌ మొదటి ఐదు స్థానాలలో ఉన్న ఇతర కం‍పెనీలు. 

 You may be interested

ఇండిగో షేర్లకు రేటింగ్‌ బూస్టింగ్‌

Wednesday 19th June 2019

దేశీయ విమానయాన రంగ సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌ ఆరంభంలో లాభాల్లోకి మరలాయి. ప్రముఖ బ్రోకరింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ షేరు టార్గెట్‌ ధరను పెంచడటం ఇందుకు కారణమైంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో 1673 రూపాయల వద్ద ఆరంభమై ఒకదశలో 1683 రూపాయలకు చేరింది. ఇటీవల కంపెనీ కొత్తగా కొనుగోలు చేస్తున్న 280 విమానాలకు సంబంధించి లీప్‌-1ఏ ఇంజన్ల తయారీకి కంపెనీ సీఎఫ్‌ఎం ఇంటర్నేషన్‌ సంస్థకు

బజాజ్‌ హోల్డింగ్స్‌ అనుబంధ సంస్థగా ఎంఎస్‌ఎల్‌

Wednesday 19th June 2019

- డబ్ల్యూఎండీసీ వాటాల బదిలీ ముంబై: ఒకప్పటి ప్రియా బ్రాండ్ స్కూటర్స్‌ తయారీ సంస్థ మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ (ఎంఎస్‌ఎల్‌)... తాజాగా బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ (బీహెచ్‌ఐఎల్‌) అనుబంధ సంస్థగా మారింది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం వెస్టర్న్‌ మహారాష్ట్ర డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (డబ్ల్యూఎండీసీ) సంస్థ ఎంఎస్‌ఎల్‌లో తనకున్న 27 శాతం వాటాను బీహెచ్‌ఐఎల్‌కు బదలాయించడంతో ఇది సాధ్యపడింది. దీంతో ఎ౾ంఎస్‌ఎల్‌లో బీహెచ్‌ఐఎల్‌ వాటాలు 51 శాతానికి చేరాయి. 2003లోనే

Most from this category