News


టాప్‌ కంపెనీల క్యూ1 ఫలితాల విశ్లేషణ

Saturday 27th July 2019
Markets_main1564209934.png-27358

త్రైమాసిక ఫలితాల సీజన్‌లో ఉన్నాం. కొన్ని కంపెనీల ఫలితాలు మార్కెట్లను ఆశ్చర్య పరచగా, మరికొన్ని నిరాశపరిచాయి. ఇప్పటి వరకు వెలువడిన టాప్‌ కంపెనీల ఫలితాలు... 

హిందూస్తాన్ యూనిలీవర్: మెరుగైన వాల్యూమ్ వృద్ధి, క్యూ 1లో 14.8 శాతం పెరిగిన లాభం. 
ఎఫ్‌ఎంసిజి సెక్టార్‌లో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్) మెరుగైన వాల్యూమ్ వృద్ధిని నమోదుచేసింది. ఫలితంగా తన స్టాండ్‌ఎలోన్‌ లాభం 14.8 శాతం పెరిగి రూ.1,755 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలానికి ఈ లాభం రూ .1,529 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం 6.6 శాతం పెరిగి రూ .10,114 కోట్లకు చేరుకుంది. దేశీయ వాల్యూమ్ వృద్ధి 5 శాతంగా ఉందని కంపెనీ తెలిపింది. వడ్డీ, పన్ను, తరుగుదల, విమోచన (ఇబిఐటిడిఎ) ముందు ఆదాయాలు 18 శాతం పెరిగి రూ .2,647 కోట్లకు చేరుకోగా, మార్జిన్ 26.2 శాతంగా ఉంది.

లార్సెన్ అండ్‌ టూబ్రో(ఎల్‌ అండ్‌ టీ): క్యూ 1 లాభం 21 శాతం పెరిగింది
ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల ప్రధాన సంస్థ లార్సెన్ అండ్‌ టూబ్రో జూన్ త్రైమాసికంలో 21.2 శాతం వృద్ధిని సాధించి రూ.1,473 కోట్ల లాభాలను ఆర్జించింది. ఆర్డర్లు 11 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,129 కోట్లుగా నమోదు చేసింది. నిరంతర కార్యకలాపాల ద్వారా వచ్చే లాభం 20.5 శాతం పెరిగి రూ.1,361 కోట్లకు చేరుకుంది. నిరంతర కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఏకీకృత ఆదాయం రూ.29,636 కోట్లుగా ఉందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. 

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌: బ్రోకరేజీలు ఈ స్టాకుపై మిశ్రమంగా ఉన్నాయి. 
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ జూన్ త్రైమాసికంలో 62.56 శాతం వృద్ధితో రూ. 530.57 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్యూ 1 లో దేశీయ చందా ఆదాయంలో 47 శాతం వృద్ధిని పొందింది. క్యూ 1 లో దేశీయ చందాదారుల సభ్యత్వంలో 46.7 శాతం వృద్ధి చెందిందని, మొత్తం చందా ఆదాయం 36.7 శాతం పెరిగి రూ.708.8 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. దేశీయ సభ్యత్వాల పెరుగుదల కారణంగా ఫలితాలు అంచనాలను మించాయని సిఎల్‌ఎస్‌ఎ తెలిపింది. ఈ బ్రోకరేజీ జీ ఒక్కో షేరుకు రూ.515  టార్గెట్ ధరను నిర్ణయించి, కొనుగోలు కాల్‌ను కొనసాగించింది. కానీ ప్రకటనల ఆదాయ వృద్ధి బలహీనంగా ఉన్నందు వలన  మోర్గాన్ స్టాన్లీ  ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ.370గా నిర్ణయించి ‘అండర్‌ వెయిట్‌’ కాల్‌ను ఇచ్చింది.
 
పంజాబ్ నేషనల్ బ్యాంక్: ఎన్‌పిఎ పెరిగినప్పటికీ రూ .1,018.6 కోట్ల లాభం
నిరార్ధక ఆస్తులలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) జూన్ త్రైమాసికంలో రూ.1,018.6 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. కాగా గత ఏడాది ఇదే సమయంలో రూ.940 కోట్ల  నష్టాన్ని ప్రకటించడం గమనర్హం. ఈ బ్యాంక్‌ నికర ఎన్‌పిఎలు 6.56 శాతం నుంచి 7.17 శాతానికి పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల ఎన్‌పిఎలు 15.50 శాతం నుం‍చి 16.49 శాతానికి పెరిగాయి.

ఏసియన్‌ పెయింట్స్: ఆదాయంలో రెండంకెల పెరుగుదల.
ఏసియన్‌ పెయింట్స్ ఆదాయం, అలంకరణ వ్యాపారంలో రెండంకెల వృద్ధిని నివేదించింది. జూన్  త్రైమాసికంలో ఏకీకృత లాభం 17.7 శాతం పెరిగి రూ.655.44 కోట్లకు చేరుకుంది.  ఆదాయం విశ్లేషకుల అంచనాలను అధిగమించి 16.6 శాతం పెరిగి రూ .5,130.63 కోట్లకు చేరుకుంది.గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.556.85 కోట్లుగా, ఆదాయం రూ.4,398.59 కోట్లుగా నమోదయ్యింది. 

బ్యాంక్ ఆఫ్ బరోడా: రూ.710 కోట్ల లాభం. ఆస్తి నాణ్యత బలహీనపడుతోంది.
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా జూన్ త్రైమాసికంలో రూ.710 కోట్ల నికర లాభన్ని ప్రకటించినప్పటికి ఆస్తి నాణ్యత వరుసగా ఈ త్రైమాసికంలో కూడా బలహీనపడింది.  గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.49 కోట్ల నష్టాన్ని చవిచూసిందని బ్యాంక్ తెలిపింది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో నష్టం (ప్రకటనలో పేర్కొన్నది) రూ.991.37 కోట్లుగా బ్యాంక్‌ పేర్కొనడం తెలిసిందే. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 2.6 శాతం పెరిగి రూ .6,496 కోట్లకు చేరుకుంది. 

కెనరా బ్యాంక్‌: 17 శాతం వృద్ధి. రూ.14,062 కోట్లకు మొత్తం ఆదాయం
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.329 కోట్ల నికర లాభం సాధించింది.  గత క్యూ1లో రూ.281 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.329 కోట్లకు పెరిగిందని, 17 శాతం వృద్ధి సాధించామని  కెనరా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,192 కోట్ల నుంచి రూ.14,062 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  వడ్డీ ఆదాయం రూ.11,360 కోట్ల నుంచి రూ.12,201 కోట్లకు చేరిందని తెలిపింది. రూ.2,440 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించామని పేర్కొంది. 

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: లాభం రూ. 1, 932 కోట్లు
 ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.1,932 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ1లో వచ్చిన నికర లాభం(రూ.1,574 కోట్లు)తో పోల్చితే 23 శాతం వృద్ధి సాధించామని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. నికర లాభంలో 30 శాతం వాటా అనుబంధ కంపెనీల వల్లనే వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.9,904 కోట్ల నుంచి రూ.12,130 కోట్లకు చేరిందని పేర్కొంది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం రూ.1,052 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ. 1,360 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇక ఆదాయం రూ.6,644 కోట్ల నుంచి రూ.7,945 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: లాభంలో 18 శాతం వృద్ధి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జూన్‌ త్రైమాసికానికి ఎప్పటి మాదిరే మంచి ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు కన్సాలిడేటెడ్‌ లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.4,808 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగి రూ.5,676 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.28,000 కోట్లతో పోలిస్తే 19 శాతం వృద్ధితో రూ.34,324 కోట్లకు చేరింది. జూన్‌ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.29,176 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.23,978 కోట్లుగానే ఉంది. ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం సైతం రూ.4,021 కోట్ల నుంచి రూ.5,148 కోట్లకు పెరిగింది.
    హెచ్‌డీఎఫ్‌సీ స్టాండలోన్‌ లాభం జూన్‌ క్వార్టర్‌లో రూ.5,568 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.4,601 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధ్యమైంది. స్టాండలోన్‌ ఆదాయం సైతం 22.7 శాతం వృద్ధితో రూ.32,361 కోట్లకు చేరుకుంది. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 1.40 శాతం, నికర ఎన్‌పీఏలు 0.43 శాతంగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ఎన్‌పీఏలు 1.33 శాతం, నికర ఎన్‌పీఏలు 0.41 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. విలువ పరంగా చూస్తే బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో రూ.11,768 కోట్లు, నికర ఎన్‌పీఏలు 3,567 కోట్లుగా ఉన్నాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ.2,613 కోట్లుగా ఉన్నాయి. కన్సాలిడేట్‌ రుణాలు 17 శాతం పెరిగి జూన్‌ చివరి నాటికి రూ.8,80,939 కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు తెలిపింది.

మారుతి సుజుకి: తక్కువ వాల్యూమ్‌ల వలన లాభం 23 శాతం తగ్గింది.
మారుతి సుజుకి ఇండియా జూన్ త్రైమాసికంలో స్టాండ్‌ ఎలోన్‌ లాభం తగ్గి సంవత్సరానికి రూ.1,435.5 కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయం మూడు రెట్లు పెరిగినప్పటికీ, తక్కువ వాల్యూమ్‌ల కారణంగా ఈ లాభం తగ్గింది. కాగా  గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ లాభం రూ. 1,975.3 కోట్లుగా నమోదుచేసింది. ఈ త్రైమాసికంలో ఆదాయం 12.2 శాతం క్షీణించి రూ.19,719.8 కోట్లకు చేరుకుంది. అమ్మకాల పరిమాణంలో 18 శాతం తగ్గుదల ఉంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ 4.01 లక్షల యూనిట్లను విక్రయించింది. ఇతర ఆదాయం క్యూ 1 లో రూ .886.4 కోట్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో  రూ.271.8 కోట్లుగా ఉండేది.

టాటా మోటార్స్: బలహీనమైన దేశీయ, జెఎల్‌ఆర్ వాల్యూమ్‌ల కారణంగా క్యూ 1లో భారీ నష్టం.
టాటా మోటార్స్ జూన్ త్రైమాసికంలో దేశీయ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాల్యూమ్‌లు బలహీనపడడంతో రూ.3,698 కోట్ల నష్టాలను నమోదు చేసింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రీ-టాక్స్ నష్టాన్ని 3,950 లక్షల పౌండ్లగా నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో 2,640 లక్షల పౌండ్ల నష్టాన్ని ప్రకటించడం తెలిసిందే. త్రైమాసిక ఆదాయం 2.8 శాతం తగ్గి 510 కోట్ల పౌండ్లకు పరిమితమయ్యింది. ప్లాంట్‌ల మూసివేసిన సమయం పెరగడంతో పాటు, బ్రెక్సిట్ ఫలితంగా డబ్యూఎల్‌టీపీ (వరల్డ్‌వైడ్ హార్మోనైజ్డ్ లైట్ వెహికల్ టెస్ట్ ప్రొసీజర్) ధృవీకరణ ఆలస్యం అవ్వడంతో అమ్మకాలలో క్షీణత పెరిగింది. సిఎల్‌ఎస్‌ఎ ఈ స్టాక్‌పై  టార్గెట్‌ ధరను రూ.120 గా నిర్ణయించి అమ్మకపు కాల్‌ను ఇచ్చింది.ఔ


 



You may be interested

‘ఇ’ వాహనాలపై పన్ను..12% నుంచి 5% నికి

Saturday 27th July 2019

జీఎస్టీ రేటును తగ్గించిన జీఎస్టీ మండలీ  ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ)పై జీఎస్‌టీ రేటును  12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ శనివారం నిర్ణయించింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్‌ల వాహనాల చార్జర్లపై ఉన్న 18 శాతం జీఎస్‌టీ రేటు 5 శాతానికి తగ్గించింది. ఇవి 2019 అగష్టు 01 నుంచి అమలులోకి రానున్నాయి. స్థానిక ప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ బస్సులను నియమించుకుంటే వాటిని జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇవ్వడానికి జీఎస్‌టీ కౌన్సిల్‌ ఒప్పుకుంది.

యూపీఐ ద్వారానే ఐపీవోల్లో పెట్టుబడులు

Saturday 27th July 2019

- సెబీ సర్క్యులర్‌ న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్‌ (ఐపీవో)లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ ఇన్వెస్టర్లు ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ద్వారానే చెల్లింపులు జరపాల్సి ఉంటుందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. రెండో విడత యూపీఐ చెల్లింపుల విధానాన్ని జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చినట్లు ఒక సర్క్యులర్‌లో తెలిపింది. యూపీఐ విధానంలో ఐపీవోలకు దరఖాస్తు చేసుకునేందుకు 45 బ్యాంకుల జాబితాను కూడా వెల్లడించింది.

Most from this category