News


జెఫరీస్‌​ మిడ్‌క్యాప్‌ జాబితా ఇదే..

Wednesday 22nd January 2020
Markets_main1579717265.png-31110

గతేడాది నిఫ్టీ, సెన్సెక్స్‌ సూచీలతో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు పోటీపడలేకపోయాయి. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ చేసి అధిక వ్యాల్యూషన్లకు చేరినందున ఈ ఏడాది (2020లో) మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ ఉంటుందని కొంత మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. మిడ్‌క్యాప్‌ విభాగంలో నాణ్యమైన ‍స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు ఉందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు జెఫరీస్‌ అంటోంది.

 

మిడ్‌క్యాప్‌ విభాగంలో సుప్రీమ్‌ ఇండస్ట్రీస్‌, కజారియా సిరామిక్స్‌, వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌ను టాప్‌ పిక్స్‌గా జెఫరీస్‌ పేర్కొంది. అలాగే, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌, గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ స్టాక్స్‌ పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలియజేసింది. డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, సంఘటిత రంగంలో ఉత్సాహం, ప్రీమియం ఉత్పత్తుల విడుదల, ముడిసరుకుల ధరల ధోరణలు ఇవన్నీ 2020లో మిడ్‌క్యాప్‌పై ప్రభావం చూపిస్తాయని జెఫరీస్‌ పేర్కొంది. 2019 మధ్య భాగం నుంచి డిమాండ్‌లో విస్తృతమైన మందగమనం చోటు చేసుకుందని, ప్రభుత్వం హౌసింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు సంబంధించి తీసుకున్న చర్యలు, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వంటి చర్యలలు.. బిల్డింగ్‌ మెటీరియల్స్‌, ఎలక్ట్రికల్‌, ప్లాస్టిక్‌ పైపులు, టైల్స్‌, శానిటరీ వేర్‌ కంపెనీలకు సానుకూలిస్తాయని అంచనా వేసింది.

 

ఎలక్ట్రికల్స్‌
ఈ విబాగంలో విగార్డ్‌, హావెల్స్‌ ఇండియా స్టాక్స్‌ పట్ల జెఫరీస్‌ బుల్లిష్‌గా ఉంది. భిన్న ఉత్పత్తుల శ్రేణి, మార్కెట్‌ ఆధిపత్యం కారణంగా మందగమనాన్ని ఇవి అధిగమించగలవని పేర్కొంది. వీగార్డ్‌ ఇటీవలే ధరలను పెంచిన విషయాన్ని గుర్తు చేసింది.

 

ప్లాస్టిప్‌ పైపులు
ఈ విభాగంలో సుప్రీమ్‌ ఇండస్ట్రీస్‌, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌ పట్ల సానుకూలంగా ఉంది. పీవీసీ పైపుల్లో సుప్రీమ్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ లీడర్‌గా ఉందని, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌ వ్యవసాయ సంబంధిత పైపుల్లో అగ్రగామి సంస్థగా ఉన్నట్టు తెలియజేసింది. ప్రభుత్వ చర్యలు, పాత వాటి స్థానంలో కొత్త పైపులకు డిమాండ్‌ వీటికి కలిసొస్తుందని అంచనా వేసింది. అయితే, ముడి సరుకులైన పీవీసీ, సీపీవీసీ ధరల్లో అస్థిరతలు కంపెనీల ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి కనుక వాటిపై కన్నేసి ఉంచాలని సూచించింది.

 

టైల్స్‌
కజారియా సిరామిక్స్‌ పట్ల బుల్లిష్‌గా ఉంది. అధిక వర్షాలు, నిర్మాణ రంగంలో స్తబ్దత, తగ్గిన లిక్విడిటీ పరిస్థితులు 2019-20 మొదటి ఆరు నెలల కాలంలో కజారియా సిరామిక్స్‌ పనితీరుపై చూపించాయని, అయితే, నిర్మాణ రంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో మధ్య కాలానికి కంపెనీ పనితీరు మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తుంది.

 

అగ్రి కెమికల్స్‌
ఈ రంగంలో అగ్రగామి కంపెనీ యూపీఎల్‌కు జెఫరీస్‌ మొగ్గు చూపింది. ఇంకా గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ కంపెనీలైన గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ షేర్ల ధరలు తక్కువలో ఉండడం, ఈ కంపెనీల బ్యాలన్స్‌ షీట్లు పటిష్టంగా ఉండడంతో కొనుగోళ్లకు అవకాశంగా పేర్కొంది.You may be interested

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ.1,757 కోట్లు

Thursday 23rd January 2020

5 శాతం వృద్ధి  రూ.19,495 కోట్లకు మొత్తం ఆదాయం ముంబై: ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికంలో రూ.1,757 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.1,681 కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి సాధించామని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.18,130 కోట్ల నుంచి రూ.19,495 కోట్లకు పెరిగింది. పెరిగిన తాజా మొండి బకాయిలు... ఈ

ఇండెక్స్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌ ఎన్‌ఎఫ్‌వోల ఆవిష్కరణకు ఏఎంసీల క్యూ

Wednesday 22nd January 2020

అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) తాజాగా యాక్టివ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు బదులు ప్యాసివ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల ఆవిష్కరణకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో చాలా ఏఎంసీలు ప్యాసివ్‌ ఫండ్స్‌ ఎన్‌ఎఫ్‌వో (నూతన ఫండ్‌ ఆఫర్‌)లకు అనుమతి కోరుతూ సెబీ వద్ద దరఖాస్తు చేసుకోవడం ఇదే సూచిస్తోంది.    మిరే అస్సెట్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ఫండ్‌ ఇటీవలే రెండు ప్యాసివ్‌ ఫండ్స్‌ను.. మిరే అస్సెట్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మిడ్‌క్యాప్‌

Most from this category