News


ఇవి... సూపర్‌ సిక్స్‌

Thursday 13th June 2019
Markets_main1560448525.png-26276

ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్‌ 10 శాతం రాబడులను ఇచ్చింది. అంతేకాదు ప్రతీ నెలలోనూ జనవరి నుంచి మే వరకు సానుకూల రాబడులను ఇవ్వడం గమనార్హం. మరి బీఎస్‌ఈ-500లో ఎన్ని ప్రధాన సూచీలను మించి రాబడులను ఇచ్చి ఉంటాయన్నది ఆలోచించండి. కేవలం ఆరు స్టాక్స్‌ మాత్రమే అని చెప్పక తప్పదు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ప్రతీ నెలలోనూ ఈ ఆరు స్టాక్స్‌ బెంచ్‌ మార్క్‌ను మించి రాబడులను ఇచ్చాయి. అవి... టైటాన్‌ కంపెనీ, పీఅండ్‌జీ హెల్త్‌, డీసీబీ బ్యాంకు, యూపీఎల్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు. 

 

సెన్సెక్స్‌ జవవరిలో అర శాతం, ఫిబ్రవరిలో అర శాతం, మార్చిలో 8 శాతం, ఏప్రిల్‌లో ఒక శాతం, మే నెలలో 2 శాతం వరకు పెరిగింది. టైటాన్‌ కంపెనీ మాత్రం జనవరిలో 7 శాతం, ఫిబ్రవరిలో 7 శాతం, మార్చిలో 11 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, మేలో 7 శాతం వరకు రాబడులను ఇచ్చింది. ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ హెల్త్‌ స్టాక్‌ జనవరిలో 7 శాతం, ఫిబ్రవరిలో ఒక శాతం, మార్చిలో 17 శాతం, ఏప్రిల్‌లో 1 శాతం, మేలో 10 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. డీబీసీ బ్యాంకు జనవరిలో 6 శాతం, ఫిబ్రవరిలో 3 శాతం, మార్చిలో 12 శాతం, ఏప్రిల్‌లో 4శాతం, మేలో 10 శాతం వరకు రాబడులను ఇచ్చింది. యూపీఎల్‌ స్టాక్‌ జనవరిలో 4 శాతం, ఫిబ్రవరిలో 15 శాతం, మార్చిలో 9 శాతం, ఏప్రిల్‌లో ఒక శాతం, మే నెలలో 3 శాతం వరకు పెరిగింది. ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ జనవరిలో 2 శాతం, ఫిబ్రవరిలో 14 శాతం, మార్చిలో 11 శాతం, ఏప్రిల్‌లో 6 శాతం, మేలో 7 శాతం వరకు పెరగ్గా.. ఐసీఐసీఐ బ్యాంకు జనవరిలో ఒక శాతం, ఫిబ్రవరిలో 1.5 శాతం, మార్చిలో 14 శాతం, ఏప్రిల్‌లో 2 శాతం, మే నెలలో 4 శాతం వరకు పెరిగింది.  

 

ఇక బీఎస్‌ఈ-500 స్టాక్స్‌లో ఈ ఆరు సహా మొత్తం 13 స్టాక్స్‌ మాత్రమే ప్రతీ నెలలో ఎంతో కొంత రాబడులను ఇచ్చినట్టు ఏస్‌ఈక్విటీ డేటా ఆధారంగా తెలుస్తోంది. అవి... ఇన్ఫోఎడ్జ్‌, కజారియా సిరామిక్స్‌, వరుణ్‌ బెవరేజెస్‌, మహారాష్ట్ర స్కూటర్స్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, ఐజీఎల్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌. వీటితోపాటు పై ఆరు స్టాక్స్‌ ఈ ఏడాది మొత్తం మీద రాబడుల ప్రయాణంలో సాగిపోతున్నాయి. తక్కువ వ్యాల్యూషన్లలో ఉండడం, కంపెనీ ఎర్నింగ్స్‌ మెరుగ్గా ఉండడం, భవిష్యత్తు వృద్ధి అవకాశాలు సహా ఎన్నో అంశాలు ఆయా ‍స్టాక్స్‌ ర్యాలీకి కారణంగా ఉన్నాయి. అయితే, వందలాది కంపెనీల్లో అతి తక్కువగా సానుకూల రాబడులను ఇవ్వడం ఆశ్చర్యం కలిగించేదే. ‘‘మిడ్‌క్యాప్‌ ప్రతికూల పనితీరు అన్నది సాధారణంగా రెండు నుంచి రెండున్నరేళ్ల పాటు కొనసాగుతుంటుంది. ఇప్పటి వరకు ఏడాదిన్నర డౌన్‌ట్రెండ్‌ చూశాం. ఈ విభాగంలో ప్రతికూలతలు ఇంకా ముగిసిపోలేదు. ఇప్పటికే నష్టపోయిన ఈ విభాగానికి ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం మరింత ఆజ్యం పోసింది’’ అని షేర్‌ఖాన్‌  పీఎంఎస్‌ ఫండ్‌ మేనేజర్‌ రోహిత్‌ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘దేశీయంగా సెంటిమెంట్‌ మెరుగుపడడం, స్టాక్స్‌లో వ్యాల్యూ బయింగ్‌ జరగడమే సూచీల ర్యాలీకి కారణం. ఇటీవలి వినియోగం తగ్గుదల మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీ వృద్ధి అవకాశాలపై ఆందోళనలు కలిగిస్తోంది. విస్తృతమైన ర్యాలీని మేం అంచనా వేయడం లేదు. మంచి పనితీరుతో కూడిన ఎంపిక చేసిన కంపెనీలు ర్యాలీ చేయవచ్చు’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రిటైల్‌ డిస్ట్రిబ్యూటర్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ పేర్కొన్నారు. You may be interested

ఫండ్స్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియోలో ఏముంది..?

Thursday 13th June 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలు ఉచితం కాదు. ఇన్వెస్టర్ల తరఫున పెట్టుబడుల వ్యవహారాలను చూస్తున్నందుకు గాను అవి ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫీజు, ఏజెంట్‌ కమీషన్లు, రిజిస్ట్రార్‌ ఫీజులు, సెల్లింగ్‌ చార్జీలు, ప్రచార చార్జీలు, ఇలా సమస్త చార్జీలు అన్నింటినీ కూడా ఇన్వెస్టర్ల నుంచే వసూలు చేసుకుంటుంటాయి. ఇవన్నీ కలసి ఎక్స్‌పెన్స్‌ రేషియోగా ఆయా పథకాల సమాచారంలో కనిపిస్తుంది. వార్షికంగా ఇంత శాతం చొప్పున పెట్టుబడుల విలువపై ఎక్స్‌పెన్స్‌ రేషియోను చార్జ్‌ చేస్తుంటాయి.

కనిష్టస్థాయిల నుంచి రికవరీ

Thursday 13th June 2019

మిడ్‌సెషన్‌ కొనుగోళ్లతో సూచీలు కనిష్టస్థాయి నుంచి రికవరీ సాధించి  గురువారాన్ని మిశ్రమంగా ముగించాయి. సెన్సెక్స్‌ 15 పాయింట్ల నష్టంతో 39,741.36 వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప లాభంతో 11,914.05 వద్ద ముగిసింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నడుమ నేడు మార్కెట్‌ నష్టాలతో మొదలైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ట్రేడింగ్‌,  చైనాతో వాణిజ్య వివాద పరిష్కారంపై ట్రంప్‌ నిరుత్సాహకరంగా స్పందించడంతో అమెరికా, ఆసియా మార్కెట్లు నేలచూపులకు పరిమితంకావడంతో

Most from this category