News


సన్‌టెక్‌, ఐబీ హౌసింగ్‌.. జూమ్‌

Thursday 9th January 2020
Markets_main1578549305.png-30796

సెన్సెక్స్‌ 530 పాయింట్లు అప్‌
150 పాయింట్లు ఎగసిన నిఫ్టీ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రికత్తలు చల్లబడుతున్న సంకేతాలతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ఉదయం 11 ప్రాంతంలో సెన్సెక్స్‌ 529 పాయింట్లు జంప్‌చేసింది. 41,347 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 153 పాయింట్లు ఎగసి 12,178కు చేరింది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు సన్‌టెక్‌ రియల్టీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం..


సన్‌టెక్‌ రియల్టీ
బిల్డర్‌ ఫైనాన్స్‌ పథకంలో భాగంగా పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌తో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో రియల్‌ ఎస్టేట్‌ రంగ కంపెనీ సన్‌టెక్‌ రియల్టీ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ సన్‌టెక్‌ షేరు 4.4 శాతం జంప్‌చేసి రూ. 443 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 450 సమీపంలో ఇంట్రాడే గరిష్టానికి చేరింది. తాజా ఒప్పందంలో భాగంగా సన్‌టెక్‌ రియల్టీ అభివృద్ధి చేయనున్న మూడు ప్రాజెక్టులకు ఎస్‌బీఐ రుణ సౌకర్యాలను అందిం‍చనుంది. రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ పథకం ద్వారా గృహ కొనుగోలుదారులకు ఎస్‌బీఐ రుణాలను అందజేయనుంది. దీంతో హౌసింగ్‌ ప్రాజెక్టుల పూర్తి హామీ ద్వారా కస్టమర్లకు రుణాలు అందించనున్నట్లు తెలుస్తోంది. సన్‌టెక్‌ రియల్టీలో ప్రమోటర్లకు 67.15% వాటా ఉంది.

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
గడువుకంటే ముందుగానే మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) చెల్లింపులను చేపట్టనున్నట్లు వెల్లడించడంతో ఎన్‌బీఎఫ్‌సీ షేరు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 329 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 330 వరకూ పెరిగింది. 2020 జనవరిలో గడువు తీరనున్న ఎన్‌సీడీలన్నిటి చెల్లింపులనూ చేపడుతున్నట్లు ఐబీ హౌసింగ్‌ తెలియజేసింది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్‌ 25 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!

అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌
గుజరాత్‌లోని కరఖాడీలో ఏర్పాటు చేసిన ఫార్ములేషన్ల ప్లాంటులో అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) చేపట్టిన తనిఖీలు విజయవంతంగా ముగిసినట్లు అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ పేర్కొంది. ఆర్బిక్యులర్‌ ఫార్మా టెక్నాలజీస్‌తో సంయుక్తంగా ఏర్పాటు చేసిన జేవీ అలోర్‌ డెర్మాస్యూటికల్స్‌ ద్వారా ఈ ప్లాంటును నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. జేవీలో అలెంబిక్‌కు 60 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో తొలుత ఎన్‌ఎస్‌ఈలో అలెంబిక్‌ ఫార్మా షేరు 3 శాతం పెరిగి రూ. 568ను అధిగమించింది. ప్రస్తుతం 1.4 శాతం లాభంతో రూ. 561 వద్ద ట్రేడవుతోం‍ది. 



You may be interested

ఈ ర్యాలీకి కారణాలేంటి?

Thursday 9th January 2020

దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లోకి మరలాయి. నిఫ్టీ బలంగా 12150 పాయింట్లపైన 12190 పాయింట్ల వద్ద కదలాడుతోంది. బుధవారం అమెరికా మార్కెట్లు బలంగా క్లోజవడం, గురువారం ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడంతో దేశీయ మార్కెట్లు కూడా బలమైన గ్యాప్‌ అప్‌తో ఓపెనయ్యాయి. అనంతరం వెనుకంజ వేయకుండా ముందుకే కొనసాగాయి. మార్కెట్లో ఇంత బలమైన ర్యాలీకి కారణాలను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు. 1. ఇరాన్‌ దాడులపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించకపోవడం: ఇరాక్‌లోని

రూ.1200 పతనమైన పసిడి

Thursday 9th January 2020

దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయి నుంచి భారీగా వెనక్కి వచ్చింది. ఒక్కరోజు వ్యవధిలోనే ఏకంగా రూ.1200లు నష్టాన్ని చవిచూసింది. నిన్నటి రోజున బంగారం ధర రూ.41,293 వద్ద రికార్డు గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ ఉ‍ద్రిక్తతలు తగ్గముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర దిగిరావడం, దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి అనూహ్య రికవరి, రికార్డు ధర

Most from this category