News


మూడు రంగాలపై బుల్లిష్‌

Wednesday 9th October 2019
Markets_main1570617292.png-28788

సుందరం ఎంఎఫ్‌ ఎండీ సునీల్‌ సుబ్రమణ్యం
వచ్చే మూడు నాలుగు నెలలకు మార్కెట్లో అప్రమత్తంగా ఉండాలని, ఈ సమయంలో సూచీలు తీవ్ర ఒడిదుడకులు చూపవచ్చని సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సిఈఓ సునీల్‌ సుబ్రమణ్యం చెప్పారు. రాబోయే కాలానికి మూడు రంగాలపై బుల్లిష్‌గా ఉన్నామని, సైక్లిక్స్‌, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు.

వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..

  • బ్రెగ్జిట్‌, ట్రంప్‌పై అవిశ్వాస పరీక్ష, ట్రేడ్‌వార్‌ మొదలగు అంతర్జాతీయ అంశాలు, క్యు2 నెంబర్లు, పండుగ సీజన్‌ విక్రయాల్లాంటి దేశీయ అంశాలు వచ్చే మూడునాలుగు నెలలపాటు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లు చూడవచ్చు. 
  • ఇలాంటి సమయాల్లో బ్యాంకులపై నమ్మకం ఉంది. ఎంత ఒడిదుడుకులు సంభవించినా, డిమాండ్‌ కొంచెం పుంజుకుంటే బ్యాంకులే తొలుత ముందుకు సాగుతాయి. అయితే వీటిలో పీఎస్‌యూబ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల కన్నా ప్రైవేట్‌ బ్యాంకులే రక్షణాత్మకమైనవి, వీటి బాలెన్స్‌ షీట్లు అటు రిటైల్‌, ఇటు కార్పొరేట్‌ రుణాల సమ్మిళిత సమ్మేళనంతో ఉంటాయి. ఏటా వీటి ఎర్నింగ్స్‌ మంచి మెరుగుదల నమోదు చేస్తూనే ఉన్నాయి. 
  • బ్యాంకులతో పాటు విభిన్న రంగాలతో కూడిన పోర్టుఫోలియో నిర్మించుకోవాలి. మిడ్‌టర్మ్‌కు సైక్లిక్‌ స్టాకులపై ఆధారపడవచ్చు. 
  • పన్ను రాయితీలతో విదేశీ కంపెనీలు మన వద్ద ఉత్పత్తికి ఆసక్తి చూపుతాయని అంచనా. ఇలాంటి సందర్భంలో క్యాపిటల్‌గూడ్స్‌ రంగానికి చెందిన కంపెనీలు ఎక్కువ లాభపడతాయి. వీటిలో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ గూడ్స్‌ సప్లయిర్లు మంచి ప్రయోజనం పొందవచ్చు. 
  • దేశీయ పునరుజ్జీవంపై ఆధారపడని కంపెనీలు తొందరగా కోలుకుంటాయి. ప్రభుత్వం ఉపాధి కల్పనపై ఎక్కువ దృష్టి పెడుతోంది. ఇది చిన్న కంపెనీలకు మేలు చేస్తుంది.
  • ట్రేడ్‌వార్‌ కారణంగా చైనా నుంచి బయటకు వచ్చేందుకు అనేక కంపెనీలు యత్నిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండియా అనువుగా మలుచుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. 
  • ట్రేడ్‌వార్‌తో సామ్‌సంగ్‌, యాపిల్‌కు ఎక్కువ లబ్ది ఉండవచ్చు. 

ఇవన్నీ లాంగ్‌టర్మ్‌ ధృక్పథంతో సూచిస్తున్న అంశాలు. వచ్చే మూడు నాలుగు నెలల్లో ఈ రంగాలకు చెందిన షేర్లను ఎంచుకొని దీర్ఘకాలం పెట్టుబడి పెడితే మంచి ప్రయోజనం ఉంటుంది. You may be interested

క్యూ2 ఫలితాలపై బ్రోకరేజీల అంచనాలు

Wednesday 9th October 2019

ఈ నెల 10 నుంచి ముఖ్యమైన కంపెనీలు సెప్టెంబర్‌ త్రైమాసిక కాలానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ముందస్తు పన్ను చెల్లింపులు చేశాయి కూడా. దీంతో గత నెలలో కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయం తాలూకూ ఫలితాలు సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల్లో ప్రతిఫలించకపోవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ పేర్కొంది.    బలహీనంగా ఉంటాయి..: మోతీలాల్‌ క్యూ2లో కంపెనీల ఫలితాలు బలహీనంగా ఉంటాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది. నిర్వహణ వాతావరణం

పతనానికి బ్రేక్‌...సెన్సెక్స్‌ 645, నిఫ్టీ 186 పాయింట్ల ర్యాలీ

Wednesday 9th October 2019

అంతర్జాతీయ పరిణామాలు అనుకూలంగా మారడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో ముగిశాయి. ఆరు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి అదేపనిగా పడుతూవస్తున్న స్టాక్‌ సూచీలు ఈ రోజు కనిష్టస్థాయి వద్ద కొనుగోలు మద్దతును పొందగలిగాయి. సెషన్‌ ప్రారంభంలో నిఫ్టీ 11,090 స్థాయికి, సెన్సెక్స్‌ 37,415.83 స్థాయికి పడిపోగా, షార్ట్‌ కవరింగ్‌లు జరగడంతో పాటు, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ స్టాకుల ర్యాలీ తోడవ్వడంతో నీఫ్టీ 11,300 స్థాయిని, సెన్సెక్స్‌ 38,100 స్థాయిని అధిగమించగలిగాయి. గత

Most from this category