క్యూ1 ఫలితాలు: రాణించిన సన్ ఫార్మా
By Sakshi

సన్ ఫార్మాస్యూటికల్స్ మంగళవారం ప్రకటించిన జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో, ఏడాది ప్రాతిపదికన లాభం 31.22 శాతం పెరిగి రూ. 1,387.48 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 1,057.29 కోట్లుగా ఉంది. కాగా ఈ త్రైమాసికంలో ఈ కంపెనీ లాభం రూ. 994 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో ఆదాయం 15.69 శాతం పెరిగి రూ .8,259.30 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 7,138.83 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో ఇబిటా రూ .1,927.60 కోట్లకు చేరుకోగా, ఇది రూ. 1,719 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఫలితాల తర్వాత ఈ స్టాకు విలువ 5 శాతం పెరిగి రూ. 443 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 3.87 శాతం లాభంతో రూ. 438.35 వద్ద ముగిసింది.
You may be interested
లాభాల ప్రారంభం
Wednesday 14th August 2019క్రితం రోజు భారీ నష్టాల్ని చవిచూసిన భారత్ స్టాక్ సూచీలు బుధవారం అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో పాజిటివ్‌గా మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో 37233 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 11,003 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే ప్రారంభమైన కొద్ది నిముషాలకే లాభాల్లో కొంతభాగాన్ని కోల్పోయాయి. గత రాత్రి కొన్ని చైనా ఉత్పత్తులపై టారీఫ్‌ల పెంపుదలను డిసెంబర్ 15 వరకూ వాయిదా
మార్కెట్లో మళ్లీ అమ్మకాల సునామి
Tuesday 13th August 2019623 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 183 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ రెండు ట్రేడింగ్ సెషన్లలో భారీ ర్యాలీ అనంతరం మార్కెట్లో మళ్లీ అమ్మకాల సునామి నెలకొంది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 624 పాయింట్లు నష్టపోయి 37000 స్థాయిని కోల్పోయి 36,958 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్ 184 పాయింట్లను కోల్పోయి 11100 స్థాయి దిగువన 10,925 వద్ద ముగిసింది. కేంద్రం పన్ను రాయితీలను ప్రకటించనున్నదనే అంచనాలతో గతవారం గురు, శుక్రవారాల్లో స్టాక్ సూచీలు 2 శాతంపైగా జంప్‌చేసిన