News


సన్‌ఫార్మా: 12శాతం క్రాష్‌

Friday 18th January 2019
Markets_main1547784595.png-23648

దేశీయ ఔషధ దిగ్గజం సన్‌ ఫార్మాసూటికల్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే  12శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో సన్‌ఫార్మా షేరు రూ.425.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సన్‌ ఫార్మా సంస్థ కో- ప్రమోటర్‌ సుధీర్‌వాలియా ఆధీకృత సంస్థ సురేఖ రియల్టీ 2014-2017 మధ్యకాలంలో ఆదిత్యా మెడిసేల్స్‌తో రూ.5,800 కోట్ల లావాదేవీలు జరిపింది. ఇంత పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక వ్యక్తి 172 పేజీల సమగ్ర సమాచారంతో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి ఫిర్యాదు చేశారు. ఇటీవల కంపెనీలో కార్పోరేట్‌ వివాదాలు వెలుగులోకి రావడంతో పాటు అమెరికాలో అనుబంధ సంస్థ జనరిక్‌ ఔషధాలను రీకాల్‌ చేయడం కూడా షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు వార్తలు వెలుడ్డాయి. ఫలితంగా నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఈ షేరులో అ‍మ్మకాలు వెల్లువెత్తడంతో 12శాతం నష్టపోయి రూ.375.40ల కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.9:35ని.లకు షేరు గతముగింపు ధర(రూ.427.15)తో పోలిస్తే 10శాతం నష్టంతో రూ.384.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. సన్‌ఫార్మా 12శాతం పతనం కారణంగా ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2.50శాతం క్షీణించింది. క్రితం రోజు కూడా ఈ షేరు 6 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 375.40 రూ.678.80లుగా నమోదయ్యాయి.



You may be interested

ఫ్రాఫిట్‌ 10వేల కోట్లు

Friday 18th January 2019

క్యూ3లో రిలయన్స్‌ లాభం రూ.10,251 కోట్లు ఒక క్వార్టర్‌లో ఈ స్థాయి లాభం ఇదే తొలిసారి తొలి భారతీయ ప్రయివేట్‌ కంపెనీ కూడా ఇదే లాభంలో వృద్ధి 8.8 శాతం; ఆదాయం 56 శాతం అప్‌ పెట్రో, రిటైల్‌, టెలికం విభాగాల ఊతం తగ్గిన రిఫైనింగ్ మార్జిన్లు న్యూఢిల్లీ: దేశీ వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలు మించిన లాభాలతో అదరగొట్టింది. రిఫైనరీ మార్జిన్లు తగ్గినా.. పెట్రోకెమికల్, రిటైల్, టెలికం రంగాల

రిలయన్స్‌ అప్‌....పాజిటివ్‌ ఓపెనింగ్‌

Friday 18th January 2019

అంతర్జాతీయ సానుకూల మార్కెట్లకు తోడు, క్రితం రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చడంతో శుక్రవారం భారత్‌ సూచీలు పాజటివ్‌గా మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింట్ల పెరుగుదలతో 36,429 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 10,924 పాయింట్ల వద్ద మొదలయ్యింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.5 శాతం లాభంతో రూ. 1150 వద్ద ప్రారంభమయ్యింది. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీలు

Most from this category