సన్‌ఫార్మా 8శాతం క్రాష్..!
By Sakshi

దేశీయ రెండో అతిపెద్ద ఫార్మా దిగ్గజ కంపెనీ సన్‌ఫార్మా షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 8.50శాతం క్షీణించాయి. కంపెనీలో జరిగిన అవకతవకలపై సీబీఐ ఫోరెన్సిక్ ఆడిట్‌కు సెబీ ఆదేశించినట్లు వార్తలు వెలుగులోకి రావడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.423.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కార్పొరేట్ గవర్నెన్స్, సెక్యూరిటీ మార్కెట్ల నిబంధనల ఉల్లంఘన తదితర నిబంధనల ఉల్లంఘనపై విజిల్ బ్లోయర్ చేసిన 150 పేజీల ఫిర్యాదు ఆధారంగా సెబీ దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అటు సన్‌ఫార్మా నుంచి కానీ, ఇటు సెబీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒకదశలో 8.50శాతం క్షీణించి రూ.401.50 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యహ్నాం గం.12:45ని.లకు షేర్లు క్రితం ముగింపు ధర(రూ.439.45)తో పోలిస్తే 6.50శాతం నష్టంతో రూ.411.05 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.350.40 రూ.678.80లుగా నమోదయ్యాయి.
You may be interested
ఆగని టాటామోటర్స్ షేర్ల పతనం
Wednesday 4th September 2019టాటా మోటర్స్ షేర్ల పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో బుధవారం మరో 6శాతం క్షీణించింది. నిన్న అటోషేర్ల పతనంలో భాగంగా 3శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ నెలలో ఈ వాహన విక్రయాలు 58శాతం క్షీణించడంతో పాటు, అంతర్జాతీయంగా జేఎల్ఆర్ అమ్మకాలు తగ్గముఖం పట్టడం లాంటి కారణాలతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. మార్కెట్ ప్రారంభం నుంచి షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఒకదశలో 6శాతం క్షీణించి రూ.106.00
నష్టాల్లోంచి లాభాల్లోకి బ్యాంక్ నిఫ్టీ
Wednesday 4th September 2019మార్కెట్ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ బుధవారం లాభనష్టాల మధ్య కదలాడుతుంది. నేడు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 26,785.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభంలో భాగంగా మొదటి 183 పాయింట్లు(0.68శాతం) క్షీణించి 26641.35 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అనంతరం కనిష్టస్థాయి వద్ద బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్ కనిష్టస్థాయి (26641.35) 482 పాయింట్లు(దాదాపు 2శాతం) పెరిగి 27,123.00 వద్ద