News


స్పార్క్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌

Wednesday 12th February 2020
Markets_main1581487019.png-31720

కేన్సర్‌ ఔషధానికి నో
షేరు 8 శాతం పతనం

కేన్సర్‌ ఔషధం టేక్లంటిస్‌కు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి నిరాకరించినట్లు వెలువడిన వార్తలు హెల్త్‌కేర్‌ రంగ సంస్థ సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ కంపెనీ(స్పార్క్‌) కౌంటర్‌ను దెబ్బతీశాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ఈ కౌంటర్‌ పతన బాట పట్టింది. ఎన్‌ఎస్‌ఈలో ఉదయం 11.15 ప్రాంతంలో దాదాపు 8 శాతం దిగజారి రూ. 177 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 171 సమీపంలో ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. టేక్లంటిస్‌ ఎన్‌డీఏకు యూఎస్‌ఎఫ్‌డీఏ కంప్లీట్‌ రెస్పాన్స్‌ లెటర్‌(సీఆర్‌ఎల్‌)ను జారీ చేసినట్లు స్పార్క్‌ తాజాగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం రూపొందిన విధానంలో ఈ ఔషధాన్ని విక్రయించేందుకు అనుమతించబోమని యూఎస్‌ఎఫ్‌డీఏ తెలియజేసినట్లు స్పార్క్‌ వెల్లడించింది. మహిళలలో కనిపించే కొన్ని రకాల కేన్సర్ల చికిత్సలో వినియోగించే ఈ పాక్లిటాక్సిల్‌ ఇంజక‌్షన్‌ను ప్రమాణాలకు అనుగుణంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించనున్నట్లు తెలియజేసింది.



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 12th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు ఐడీబీఐ బ్యాంక్‌: ఐడీబీఐ బ్యాంక్‌ వరుసగా 13సారి నష్టాలను చవిచూసింది. వన్‌టైమ్‌ ట్యాక్స్‌ రూ.6,273 కోట్లు చెల్లించడంతో ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో నికర నష్టం రూ.5,763 ‍కోట్లకు చేరింది.  అలహాబాద్‌: మొండి బకాయిలు ఎక్కువగా ఉండడంతో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అలహాబాద్‌ బ్యాంక్‌ స్టాండేలోన్‌ నికర నష్టం రెండు రెట్లు పెరిగి రూ.1,986.26 కోట్లకు చేరింది. గత ఆర్థికసంవత్సరం ఇదే

కరోనా ప్రభావాన్ని అతిగా ఊహించారు!

Wednesday 12th February 2020

రే డాలియో అభిప్రాయం ప్రపంచ మార్కెట్లపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఎక్కువ చేసి చూపారని ప్రముఖ ఫండ్‌ మేనేజర్‌ రే డాలియో అభిప్రాయపడ్డారు. ఈ భయాలు ఎక్కువ కాలం నిలిచేవి కావన్నారు. ఏదైనా అంటువ్యాధి ప్రబలినప్పుడు అందరిలో తలెత్తే సాధారణ భయాలే మార్కెట్‌ ఇన్వెస్టర్లలో కూడా కలిగాయని, కాకపోతే మార్కెట్లు ఈ భయాన్ని కాస్త ఎక్కువగా స్వీకరించాయని చెప్పారు. ఇకపై సూచీల్లో రీబౌండ్‌ ఉంటుందని అంచనా వేశారు. బ్రిడ్జ్‌వాటర్‌ అసోసియేట్స్‌కు వ్యవస్థాపకుడైన

Most from this category