News


షుగర్‌ షేర్ల సూపర్‌ ర్యాలీ

Wednesday 1st January 2020
Markets_main1577868310.png-30588

దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాల్లో
తగ్గిన చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి ఎఫెక్ట్‌

ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న చక్కెర రంగ కౌంటర్లు మరోసారి వెలుగులో నిలుస్తు‍న్నాయి. చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి తగ్గిన వార్తలు కొద్ది రోజులుగా షుగర్‌ షేర్లకు డిమాండును పెంచుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా చక్కెర ఉత్పత్తి 2019 డిసెంబర్‌ 15కల్లా 35 శాతం క్షీణించి 4.58 మిలియన్‌ టన్నులను తాకినట్లు దేశీ షుగర్‌ మిల్లుల అసోసియేషన్‌(ISMA) తెలియజేసింది. ఇందుకు ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటకలలో చక్కెర తయారీ నీరసించడం ప్రభావం చూపినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో షుగర్‌ నిల్వలు తగ్గనున్నట్లు విశ్లేషకులు భావిస్తు‍న్నారు. ఇది షుగర్‌ కంపెనీల క్యాష్‌ఫ్లోలను మెరుగుపరచనున్నట్లు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తాజాగా దాదాపు లిస్టెడ్‌ షుగర్‌ షేర్లన్నీ లాభాలతో ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం...

13 ఏళ్ల గరిష్టం
బుధవారం ట్రేడింగ్‌లో పలు షుగర్‌ కౌంటర్లు లాభాల పరుగు తీస్తున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల సమయం‍లో ఎన్‌ఎస్‌ఈలో బలరామ్‌పూర్‌ చినీ 2 శాతం లాభపడటం ద్వారా రూ. 187 సమీపంలో ట్రేడవుతోంది. వెరసి 13 ఏళ్ల గరిష్టానికి చేరువైంది. 2006 మే తదుపరి ఇది గరిష్టంకాగా.. ద్వారికేష్‌ 14 శాతం జంప్‌చేసి రూ. 38 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో పలు ఇతర కౌంటర్లు సైతం మరింత జోరు ప్రదర్శిస్తున్నాయి.

జోరుగా హుషారుగా
మగధ్‌ షుగర్‌ 14 శాతం ర్యాలీతో రూ. 118ను తాకగా.. దాల్మియా భారత్‌ 9.5 శాతం జంప్‌చేసి రూ. 114ను అధిగమించింది. పొన్ని షుగర్స్‌ 4 శాతం ఎగసి రూ. 171 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 175కు చేరింది. అవధ్‌ షుగర్స్‌ 7.5 శాతం పురోగమించి 299 వద్ద కదులుతోంది. తొలుత రూ. 303కు చేరింది. ఆంధ్రా షుగర్స్‌ దాదాపు 9 శాతం దూసుకెళ్లి రూ. 319 వద్ద ట్రేడవుతోంది. ఇక ఈఐడీ ప్యారీ 4.2 శాతం బలపడి రూ. 210 వద్ద, ధంపూర్‌ 2.6 శాతం పుంజుకుని రూ. 239 వద్ద త్రివేణీ 2.3 శాతం లాభంతో రూ. 73 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా ఉత్తమ్‌ షుగర్‌ 7 శాతం అధికంగా రూ. 116 వద్ద, మవానా 8 శాతం వృద్ధితో రూ. 38 వద్ద ట్రేడవుతున్నాయి.

చిన్న షేర్లు సైతం
పెన్నీ స్టాక్స్‌లో శక్తి షుగర్స్‌ 12 శాతం దూసుకెళ్లి రూ. 9.85కు చేరగా.. ధరణి 5 శాతం పుంజుకుని రూ. 7.75ను తాకింది. ఇతర కౌంటర్లలో బజాజ్‌ హిందుస్తాన్‌ 13 శాతం పురోగమించి రూ. 7.4 వద్ద, కేఎం షుగర్స్‌ 7 శాతం జంప్‌చేసి రూ. 8 వద్ద, రాణా షుగర్స్‌ 5 శాతం పెరిగి రూ. 3.25 వద్ద ట్రేడవుతున్నాయి.

లాభాల తీపి

కంపెనీ పేరు ధర(రూ.) లాభం
  1-1-2020 %లో
మగధ్‌ షుగర్‌ 118  14
దాల్మియా భారత్‌ 114 9.5
ఆంధ్రా షుగర్స్‌ 319 9
మవానా 38 8
అవధ్‌ షుగర్స్‌ 299 7.5
ఉత్తమ్‌ షుగర్‌  116  7
ఈఐడీ ప్యారీ 210  4.2
పొన్ని షుగర్స్‌ 171 4

      
        You may be interested

ఇన్‌ఫ్రా ప్లాన్‌తో లాభపడే 5 షేర్లివే!

Wednesday 1st January 2020

నిపుణుల అంచనా తాజాగా కేంద్రం ప్రకటించిన ఎన్‌ఐపీ(నేషనల్‌ ఇన్‌ఫ్రా పైప్‌లైన్‌)తో రూ. 102 కోట్ల పెట్టుబడుల వరద ప్రవహించనుంది. మరో రెండు మూడు రోజుల్లో ఇంకో రూ.3 లక్షల కోట్ల ప్లాన్స్‌ను సైతం ప్రభుత్వం ప్రకటించనుంది. దీంతో మొత్తం ఇన్‌ఫ్రా పెట్టుబడులు రూ. 105 లక్షల కోట్లకు చేరనున్నాయి. దాదాపు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు చేపడతారు. ఈ వ్యయంలో ప్రైవేట్‌ రంగం వాటా 22 శాతం కాగా,

2020లో ఆభరణాలకు డిమాండ్‌ తగ్గుదల: ఇక్రా నివేదిక

Wednesday 1st January 2020

ఈ 2020 ఏడాదిలో అభరణాలకు డిమాండ్‌ 6 నుంచి 8శాతం తగ్గముఖం పట్టే అవకాశం ఉందని ఇక్రా నివేదిక తెలిపింది. పెరిగిన పసిడి ధరలతో పాటు బలహీన వినియోగ డిమాండ్‌లు ఇందుకు కారణవుతాయని ఇక్రా పేర్కోంది. నల్లధనాన్ని ప్రక్షాళన చేయడం, పరిశ్రమను లాంఛనప్రాయంగా మార్చడం, ఇతర అసెట్స్‌ క్లాస్‌తో పోలిస్తే ఆభరణాల్లో పెట్టుబడులు తక్కువ రాబడులను ఇవ్వడంతో భారత్‌లో గత ఐదేళ్లుగా ఆభరణాలకు ఉన్న డిమాండ్‌ ఆర్థిక సంవత్సరం 2019తో

Most from this category