News


మళ్లీ షుగర్‌ షేర్ల దూకుడు

Tuesday 7th January 2020
Markets_main1578376633.png-30728

దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాల్లో
తగ్గిన చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి ఎఫెక్ట్‌
52 వీక్‌ హై- బలరామ్‌పూర్‌, ఈఐడీ, ద్వారికేష్‌ 

ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న చక్కెర తయారీ కంపెనీల కౌంటర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాలతో ట్రేడవుతున్నాయి. బలరామ్‌పూర్‌ చినీ, ద్వారికేష్‌ షుగర్‌, ఈఐడీ ప్యారీ తాజాగా 52 వారాల గరిష్టాలను తాకాయి. చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి తగ్గిన వార్తలు కొద్ది రోజులుగా షుగర్‌ షేర్లకు డిమాండును పెంచుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం...

కారణాలేవిటంటే?
ఈ సీజన్‌(అక్టోబర్‌ 2019- సెప్టెంబర్‌ 2020) తొలి క్వార్టర్‌లో దేశీయంగా చక్కెర ఉత్పత్తి 30 శాతంపైగా క్షీణించినట్లు దేశీ షుగర్‌ మిల్లుల అసోసియేషన్‌(ISMA) తెలియజేసింది. దీంతో చక్కెర ఉత్పత్తి 7.8 మిలియన్‌ టన్నులకు పరిమితమైనట్లు తెలియజేసింది. గత సీజన్‌(2018-19) ఇదే కాలంలో 11.2 మిలియన్‌ టన్నుల షుగర్‌ ఉత్పత్తి నమోదైనట్లు తెలియజేసింది. ఇందుకు ప్రధానంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో చెరకు సాగు తగ్గడం, మహారాష్ట్ర, కర్ణాటకలలో చక్కెర తయారీ నీరసించడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు పేర్కొంది. కాగా.. ఇటీవల 2.5 మిలియన్‌ టన్నుల చక్కెర ఎగుమతులు నమోదైనట్లు వెల్లడించింది. ఫలితంగా దేశంలో చక్కెర నిల్వలు తగ్గనున్నట్లు విశ్లేషకులు భావిస్తు‍న్నారు. ఇది షుగర్‌ కంపెనీల క్యాష్‌ఫ్లోలను మెరుగుపరచే వీలున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తాజాగా దాదాపు లిస్టెడ్‌ షుగర్‌ షేర్లన్నీ లాభాలతో ట్రేడవుతున్నాయి.

2006 తదుపరి
మంగళవారం ట్రేడింగ్‌లో పలు షుగర్‌ కౌంటర్లు లాభాల పరుగు తీస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయం‍లో ఎన్‌ఎస్‌ఈలో బలరామ్‌పూర్‌ చినీ 2 శాతం పుంజుకుని రూ. 186 వద్ద ట్రేడవుతోంది. తొలుత 8 శాతం జంప్‌చేసి రూ. 195 వద్ద 13 ఏళ్ల గరిష్టాన్ని అధిగమించింది. 2006 మే తదుపరి ఇది గరిష్టంకాగా.. ఈ బాటలో ఈఐడీ ప్యారీ 2.7 శాతం పెరిగి రూ. 230 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 235 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఇదే విధంగా ద్వారికేష్‌ 5 శాతం ఎగసి రూ. 40.50 వద్ద కదులుతోంది. తొలుత రూ. 42 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో పలు ఇతర కౌంటర్లు సైతం మరింత జోరు ప్రదర్శిస్తున్నాయి.

తీయతీయగా..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మగధ్‌ షుగర్‌ 4 శాతం ర్యాలీతో రూ. 117ను తాకగా.. దాల్మియా భారత్‌ 5.3 శాతం జంప్‌చేసి రూ. 122ను అధిగమించింది. ఇంట్రాడేలో మగధ్‌ రూ. 122కు, దాల్మియా రూ. 127కు చేరాయి. పొన్ని షుగర్స్‌ 5.2 శాతం ఎగసి రూ. 119 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 125కు చేరింది. అవధ్‌ షుగర్స్‌ 4 శాతం పురోగమించి 299 వద్ద కదులుతోంది. తొలుత రూ. 312కు చేరింది. ఆంధ్రా షుగర్స్‌ 2 శాతం బలపడి రూ. 305 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 313ను తాకింది. ఇక ధంపూర్‌ 2 శాతం పుంజుకుని రూ. 235 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 242ను తాకింది. ఇదే విధంగా త్రివేణీ 1.2 శాతం లాభంతో రూ. 74 వద్ద, ఉత్తమ్‌ షుగర్‌ 5 శాతం అధికంగా రూ. 119 వద్ద, మవానా 7 శాతం వృద్ధితో రూ. 39 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో ఉత్తమ్‌ రూ. 125 వరకూ దూసుకెళ్లింది!

పెన్నీ స్టాక్స్‌ సైతం
పెన్నీ స్టాక్స్‌లో శ్రీ రేణుకా 3.4 శాతం పుంజుకుని రూ. 9.20కు చేరగా.. శక్తి షుగర్స్‌ 4 శాతం పెరిగి రూ. 9.40ను తాకింది. ఇక ధరణి 2.5 శాతం బలపడి రూ. 7.85 వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో బజాజ్‌ హిందుస్తాన్‌ 4 శాతం పురోగమించి రూ. 7 వద్ద, కేఎం షుగర్స్‌ 9 శాతం జంప్‌చేసి రూ. 9.35 వద్ద, రాణా షుగర్స్‌ 3 శాతం పెరిగి రూ. 3.50 వద్ద ట్రేడవుతున్నాయి.

స్వీట్‌ ర్యాలీ

కంపెనీ పేరు     ధర(రూ.)    7-1-2020 లాభం%లో
మవానా         39     7
ఉత్తమ్‌         119     5
దాల్మియా భారత్‌     122     5
పొన్ని షుగర్స్‌     119     5
ద్వారికేష్‌         40     5
మగధ్‌ షుగర్‌     117      4
అవధ్‌ షుగర్స్‌     299     4
ఈఐడీ ప్యారీ     230     3
ఆంధ్రా షుగర్స్‌     305     2
ధంపూర్‌         235     2


     



You may be interested

హైడివిడెండ్‌ స్టాక్స్‌పై కన్నేయండి!

Tuesday 7th January 2020

జీసెక్‌ ఈల్డ్స్‌ కన్నా బెటర్‌ నిపుణుల సూచన ప్రభుత్వ సెక్యూరిటీలపై ఈల్డ్స్‌ తగ్గిపోతున్న నేపథ్యంలో అధిక డివిడెండ్‌ ఈల్డ్స్‌ ఉన్న షేర్లపై పెట్టుబడులు పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 2018లో పదేళ్ల జీసెక్‌ ఈల్డ్‌ 8 శాతం ఉండగా, ప్రస్తుతమిది 6.5 శాతానికి చేరింది. దీంతో పలువురు ఇన్వెస్టర్లు హైడివిడెండ్‌ ఈల్డ్‌ స్టాక్స్‌వైపు మరలుతున్నారు. ఇలా అధిక డివిడెండ్‌ ఇస్తున్న కొన్ని టాప్‌ షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి... 1. ఎస్‌జేవీఎన్‌: షేరు 2018-19

దీర్ఘకాలానికి బుల్లిష్‌!

Tuesday 7th January 2020

మార్కెట్‌పై మొబియస్‌ భారత ఈక్విటీలపై పాజిటివ్‌గా ఉన్నానని, దీర్ఘకాలానికి దేశీయ మార్కెట్లు బుల్లిష్‌గానే ఉంటాయని ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌మొబియస్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో పెట్టుబడులకు ఇదే సరైన తరుణమన్నారు. భారత మార్కెట్లో అవకాశం వచ్చినప్పుడల్లా పొజిషన్లు పెంచుకుంటూ పోతామని చెప్పారు. ప్రభుత్వం వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టడం పాజిటివ్‌ చర్యని, ఇదే సమయంలో ప్రభుత్వం ఇన్‌ఫ్రా వ్యయాలపై దృష్టి ఎక్కువగా పెట్టాలని సూచించారు. ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెంచితే ప్రజలకు పని దొరుకుతుందన్నారు. బడ్జెట్లో

Most from this category