News


షుగర్‌ షేర్లకు డిమాండ్‌

Monday 13th January 2020
Markets_main1578904810.png-30891

దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాల్లో
తగ్గిన చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి ఎఫెక్ట్‌

ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న చక్కెర తయారీ కంపెనీల కౌంటర్లు మరోసారి వెలుగులోకి వచ్చాన్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూడంతో పలు కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. చెరకు దిగుబడితోపాటు.. చక్కెర ఉత్పత్తి తగ్గిన వార్తలు కొద్ది రోజులుగా  షుగర్‌ షేర్లకు డిమాండును పెంచుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం...

కారణాలేవిటంటే?
ఈ సీజన్‌(అక్టోబర్‌ 2019- సెప్టెంబర్‌ 2020) తొలి క్వార్టర్‌లో దేశీయంగా చక్కెర ఉత్పత్తి 30 శాతంపైగా క్షీణించినట్లు దేశీ షుగర్‌ మిల్లుల అసోసియేషన్‌(ISMA) తెలియజేసింది. దీంతో చక్కెర  ఉత్పత్తి 7.8 మిలియన్‌ టన్నులకు పరిమితమైనట్లు తెలియజేసింది. గత సీజన్‌(2018-19) ఇదే కాలంలో 11.2 మిలియన్‌ టన్నుల షుగర్‌ ఉత్పత్తి నమోదైనట్లు తెలియజేసింది. ఇందుకు  ప్రధానంగా దేశంలోని కొన్ని ప్రాంతాలలో చెరకు సాగు తగ్గడం, మహారాష్ట్ర, కర్ణాటకలలో చక్కెర తయారీ నీరసించడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు పేర్కొంది. కాగా.. ఇటీవల 2.5  మిలియన్‌ టన్నుల చక్కెర ఎగుమతులు నమోదైనట్లు వెల్లడించింది. ఫలితంగా దేశంలో చక్కెర నిల్వలు తగ్గనున్నట్లు విశ్లేషకులు భావిస్తు‍న్నారు. ఇది షుగర్‌ కంపెనీల క్యాష్‌ఫ్లోలను మెరుగుపరచే  వీలున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తాజాగా దాదాపు లిస్టెడ్‌ షుగర్‌ షేర్లన్నీ లాభాలతో ట్రేడవుతున్నాయి.

లాభాల బాటలో
సోమవారం ట్రేడింగ్‌లో పలు షుగర్‌ కౌంటర్లు లాభాల పరుగు తీస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయం‍లో ఎన్‌ఎస్‌ఈలో బలరామ్‌పూర్‌ చినీ 4 శాతం జంప్‌చేసి రూ. 192 వద్ద  ట్రేడవుతోంది. ఇక ఆంధ్రా షుగర్స్‌ 2.5 శాతం బలపడి రూ. 320 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 325ను తాకింది. ఈ బాటలో మగధ్‌ షుగర్‌ 4 శాతం ర్యాలీతో రూ. 124ను తాకగా.. అవధ్‌ షుగర్స్‌ 2 శాతం పురోగమించి రూ. 305 వద్ద కదులుతోంది. తొలుత అవధ్‌ గరిష్టంగా రూ. 309కు చేరింది. ఇదే విధంగా ద్వారికేష్‌ 2.7 శాతం ఎగసి రూ. 40 వద్ద, ఈఐడీ ప్యారీ 1 శాతం పెరిగి రూ. 232 వద్ద ట్రేడవుతున్నాయి. 

తీయతీయగా..
ఇతర కౌంటర్లలో దాల్మియా భారత్‌ 2 శాతం లాభంతో రూ. 124ను అధిగమించింది. ఇంట్రాడేలో దాల్మియా  రూ. 126కు చేరింది. పొన్ని షుగర్స్‌ 5.2 శాతం ఎగసి రూ. 119 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 125ను తాకింది. ఇక ధంపూర్‌ 2.25 శాతం పుంజుకుని రూ. 237 వద్ద కదులుతోంది.  ఇదే విధంగా త్రివేణీ 1.2 శాతం లాభంతో రూ. 74 వద్ద, ఉత్తమ్‌ షుగర్‌ 2.4 శాతం అధికంగా రూ. 120 వద్ద, మవానా 3 శాతం వృద్ధితో రూ. 42 వద్ద  ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో ఉత్తమ్‌ రూ. 122 వరకూ పెరిగింది! 

చిన్న షేర్లు సైతం
పెన్నీ స్టాక్స్‌లో రాణా షుగర్స్‌ 4.3 శాతం పెరిగి రూ. 3.65కు చేరగా.. కేఎం షుగర్స్‌ 2.2 శాతం బలపడి రూ. 9.25ను తాకింది. ఇతర  కౌంటర్లలో బజాజ్‌ హిందుస్తాన్‌ 2.2 శాతం పురోగమించి రూ. 6.85 వద్ద, శక్తి షుగర్స్‌ 1.6 శాతం పుంజుకుని రూ. 9.60 వద్ద,  శ్రీ రేణుకా 1.2 శాతం లాభంతో రూ. 8.70 వద్ద ట్రేడవుతున్నాయి.  

స్వీట్‌ ర్యాలీ

కంపెనీ పేరు     ధర(రూ.)    13-1-2020 లాభం%లో
పొన్ని షుగర్స్‌     119     5.2
బలరామ్‌పూర్‌      192     4
మగధ్‌ షుగర్‌       124   4
మవానా     42     3
ద్వారికేష్‌         40     2.7
ఆంధ్రా షుగర్స్‌  320      2.5
ధంపూర్‌ షుగర్స్‌     237   2.2
దాల్మియా భారత్‌     124     2
అవధ్‌ షుగర్స్‌        305     2

 You may be interested

బ్యాంకునిఫ్టీలో బేర్‌పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం బెటర్‌!

Monday 13th January 2020

బ్యాంకు నిఫ్టీ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ పరిశీలిస్తే రేంజ్‌బౌండ్‌ కదలికలకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకు నిఫ్టీలో ఐవీ(ఇంప్లైడ్‌ వొలటిలిటీ) పెరుగుతోంది, పీఎస్‌యూబ్యాంకుల్లో అమ్మకాలు కనిపిస్తున్నాయి, ప్రైవేట్‌ బ్యాంకులు చాలా వరకు అలసినట్లున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు నిఫ్టీలో భారీ ర్యాలీకి ఛాన్సులు స్వల్పంగానే ఉన్నాయి. గతవారం ప్రధాన బ్యాంకు షేర్లలో షార్ట్స్‌ ఎక్కువగా నమోదయ్యాయి. ఈ సమయంలో బ్యాంకు నిఫ్టీలో బేర్‌ పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం

ఇన్ఫీ జోరు: ఐటీ ఇండెక్స్‌ 2శాతం అప్‌

Monday 13th January 2020

ఐటీ షేర్లకు సోమవారం కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ శుక్రవారం క్యూ3 ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకున్నాయి. ఫలితంగా నేడు ఈ షేరు 5శాతం లాభపడింది. ఇన్ఫీ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడం ఇదే రంగంలో మిగతా షేర్ల ర్యాలీకి తోడ్పాటునిచ్చింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ క్రితం టాటా

Most from this category