News


షుగర్‌, పీఎస్‌యూ సైక్లికల్స్‌ ఆకర్షణీయం!

Thursday 9th January 2020
Markets_main1578554233.png-30799

కొటక్‌ పీఎంఎస్‌, సీఐవో అన్షుల్‌ సైగల్‌

ఇరాన్‌, అమెరికా మధ్య నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వృద్ధి అవకాశాలను ధరలో ప్రతిబింబించని కంపెనీలవైపు దృష్టి సారించనున్నట్లు కొటక్‌ పీఎంఎస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ అన్షుల్‌ సైగల్‌ చెబుతున్నారు. ఇంకా మార్కెట్ల తీరు, మిడ్‌ క్యాప్స్‌లో పెట్టుబడులు తదితర అంశాలపై ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం...

గతంలో అంటే 2003-05 మధ్య ఇరాక్‌ యుద్ధ సమయంలోనూ మార్కెట్లు అర్ధవంతంగా పుంజుకున్నాయి. అటు లార్జ్‌ క్యాప్స్‌, ఇటు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ సైతం లాభపడ్డాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో తలెత్తిన అస్థిర పరిస్థితుల్లోనూ ఇలాంటి వ్యూహాలనే అమలు చేయనున్నాం. వృద్ధికి అనుగుణంగా షేర్ల ధరలు పెరగని కౌంటర్లపై దృష్టి పెట్టదలిచాం. ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలోని కంపెనీలు పటిష్టంగానే కనిపిస్తున్నాయి. 2003-2004 మధ్య ప్రాంతంలోనూ మధ్యప్రాచ్యంలో ప్రస్తుతమున్న వాతావరణం నెలకొంది. ఇక 1991లోనూ ఇదే ప్రాం‍తంలో అస్థిరతలు చోటుచేసుకున్నాయి. ఈ సమయంలో యూఎస్‌ ఫెడ్‌ తదితర కేంద్ర బ్యాంకులు వ్యవస్థలోకి చౌకగా నిధులను పంప్‌చేస్తూ వచ్చాయి. దీంతో 2003-05 మధ్య మార్కెట్లు పలు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ నిలదొక్కుకున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు ఎలా పరిణమిస్తాయో వేచిచూడవలసి ఉంది.

బడ్జెట్‌.. కీలకం
నిర్లక్ష్య ఆర్థిక వ్యయాలకు వ్యతిరేకమని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యమివ్వనున్నట్లు పేర్కొంది. ఈ దిశలో ప్రభుత్వం రానున్న ఐదారేళ్లలో పలు చర్యలు చేపట్టే అవకాశముంది. ప్రస్తుతం సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకు లోనవుతున్న ప్రజలు వ్యయాలకు సిద్ధంగా లేరు. పొదుపు వైపు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందిస్తోంది. దీంతో ప్రజల అంచనాలను, నమ్మకాన్ని పెంచే బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసి ఉంది. ఆర్థిక వ్యవస్థకు, వినియోగానికీ ఊతమిచ్చే బడ్జెట్‌ వెలువడే వీలుంది. ఇందుకు అనుగుణంగా వ్యక్తిగత పన్ను తదితర అంశాలలో సంస్కరణలు తీసుకురావచ్చని భావిస్తున్నాం

షుగర్‌..సెక్యులర్‌ 
సైక్లికల్స్‌ డౌనటర్న్‌లో​ఉన్న కంపెనీలవైపు దృస్టిసారించనున్నాం. భవిష్యత్‌లో వృద్ధికి అవకాశమున్న ఇలాంటి స్టాక్స్‌ కొనుగోలుకి ప్రాధాన్యమివ్వనున్నాం. వీటిలో కొన్ని కంపెనీలు సైక్లికల్‌కాగా.. మరికొన్ని స్టాక్స్‌ను సెక్యులర్‌ గ్రోత్‌ విభాగంలో ఎంపిక చేయనున్నాం. వెరసి తాత్కాలిక స్లోడౌన్‌ను ఎదుర్కొంటున్న కంపెనీలకు పోర్ట్‌ఫోలియోలో చోటు దక్కనుంది. రానున్న రెండేళ్లలో మా పోర్ట్‌ఫోలియో అత్యంత వృద్ధిని సాధించనుంది. మార్కెట్లు దృష్టిపెట్టని విభాగాలు, భవిష్యత్‌ వృద్ధి అవకాశాలకు అనుగుణంగా ఊపందుకోని కంపెనీలపై ఫోకస్‌ పెట్టడమే దీనికి కారణం. ఉదాహరణకు సైక్లికల్‌ విభాగంలో షుగర్‌ రంగాన్ని ప్రస్తావించవచ్చు. మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా చక్కెర ధరలు నిర్ణయమవుతుంటాయి. ఇటీవల షుగర్‌కు మద్దతు ధర, చెరకు సాగు వ్యయాలను ప్రభుత్వం నిర్దారిస్తోంది. ఫలితంగా షుగర్‌ ధరలలో సైక్లికల్‌ ఒడిదొడుకులు తగ్గనున్నాయి. అంతేకాకుండా పెట్రోల్‌లో ఇథనాల్‌ బ్లెండింగ్‌ను ప్రభుత్వం 5 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. దీంతో ఇథనాల్‌ ధరలు సైతం పుంజుకున్నాయి. ఇలాంటి అంశాలు షుగర్‌ రంగాన్ని సైక్లికల్‌ స్థాయి నుంచి సెక్యులర్‌కు మార్చివేయనున్నాయి. ప్రస్తుతం షుగర్‌ రంగంలోని పలు కంపెనీల షేర్లు ఈ అంశాలను ప్రతిబింబించడంలేదని చెప్పవచ్చు. రానున్న కాలంలో క్యాష్‌ఫ్లోలు మెరుగుపడనున్న విషయాన్ని మార్కెట్లు ఇంకా గుర్తించలేదు.

పీఎస్‌యూ భేష్‌
ప్రభుత్వ రంగ కంపెనీల(పీఎస్‌యూ) విభాగంలోనూ పలు కౌంటర్లు గత రెండేళ్లుగా సైక్లికల్‌ కారణాలతో డీలా పడ్డాయి. వృద్ధి అవకాశాల రీత్యా ఇప్పటికీ పలు స్టాక్స్‌ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ కంపెనీలను మార్కెట్లు పూర్తిగా విస్మరించాయి. దీంతో నాణ్యమైన కంపెనీలు సైతం అత్యంత చౌకగా లభిస్తున్నాయి. ఫలితంగా పీఎస్‌యూ విభాగంలో స్టాక్స్‌ను సైతం కొనుగోలు జాబితాలో చేర్చాం.You may be interested

32వేల పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 9th January 2020

799 పాయింట్లు లాభపడ్డ ఇండెక్స్‌ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న భారీ కొనుగోళ్ల మద్దతు కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం తిరిగి 32వేల స్థాయిని అందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ బుధవారం క్లోజింగ్‌ 31373 పాయింట్ల నుంచి దాదాపు 400 పాయింట్ల లాభంతో 31748 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటికి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో

హెచ్‌ఎస్‌బీసీ నుంచి 3 అటో స్టాక్స్‌ రికమెండేషన్లు

Thursday 9th January 2020

ఈ ఏడాదిలో వాహనరంగాలకు డిమాండ్‌ పెరగకపోతే ఆటోమొబైల్ షేర్లు ఇన్వెస్టర్లకు ఆశించినస్థాయిలో ఆదాయాలను ఇవ్వడం అసాధ్యమని హెచ్‌ఎస్‌బీసీ బ్రోకరేజ్‌ సంస్థ అంటోంది. దేశీయ అటోరంగం 2019 ఏడాదిలో ఈ దశాబ్దంలో అతిపెద్ద గడ్డు పరిస్థితిని ఎదుర్కోంది. స్ధూల ఆర్థిక వ్యవస్థ బలహీనత, వ్యవస్థలో ద్రవ్య కొరత, పన్ను ఉద్దీపన చుట్టూ అనిశ్చితి, కఠినతరమైన నిబంధనలు డిమాండ్‌ను ప్రభావితం చేశాయని బ్రోకరేజ్‌ సంస్థ తన నివేదికలో తెలిపింది. అయితే ఈ ఏడాదిలో

Most from this category