News


ఈ స్టాక్స్‌తో మీ నోరు తీపి..!

Sunday 1st September 2019
Markets_main1567361083.png-28136

చక్కెర రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పూర్తి మద్దతు... ఈ రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే వారికి మంచి రాబడులు ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయంటోంది ఐసీఐసీఐ డైరెక్ట్‌. ఎందుకంటే ఒక వైపు చక్కెరకు మద్దతు ధరలు ప్రకటించడంతోపాటు, మరోవైపు ఎగుమతులకు సబ్సిడీ కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఇంకోవైపు పెట్రోల్‌లో ఎథనాల్‌ బ్లెండింగ్‌ను 2022 నాటికి 10 శాతానికి, ఆ తర్వాత 2030 నాటికి 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ డైరెక్ట్‌ పలు స్టాక్స్‌ను సిఫారసు చేసింది. 

 

గత నెల 28న కేంద్ర కేబినెట్‌ వచ్చే అక్టోబర్‌తో మొదలయ్యే 2019-20 మార్కెటింగ్‌ సంవత్సరానికి సంబంధించి 6 మిలియన్‌ టన్నుల చక్కెర ఎగుమతులకు సబ్సిడీ కింద రూ.6,268 కోట్లను కేటాయించింది. దీంతో మిగిలిపోయిన పంచదార నిల్వలను మిల్లులు సులభంగా ఎగుమతి చేయడంతోపాటు, రైతుల బకాయిలను తీర్చేయగలవు. కేంద్రం నిర్ణయం అటు మిల్లులుకు, ఇటు రైతులకు మేలు చేసేది అవుతుంది. నూతన బయో ఫ్యూయల్‌ పాలసీని కేంద్రం తీసుకురావడంతో చాలా షుగర్‌ కంపెనీలు ఎథనాల్‌ డిస్టిలరీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. ప్రభుత్వం 114 ప్రాజెక్టులకు సంబంధించి 5 శాతం వడ్డీ రాయితో కూడిన సులభ రుణాలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 2023 నాటికి ఎథనాల్‌ సామర్థ్యం 200 కోట్ల లీటర్లకు పెరగనుంది. ఇది చక్కెర కంపెనీలకు స్థిరమైన ఆదాయాన్నిస్తుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. ‘‘ప్రస్తుత చక్కెర నిల్వలను నగదుగా మార్చుకోవడంతోపాటు, చెరకును ఎథనాల్‌ కోసం మళ్లించుకోవడం వంటివి కంపెనీలకు 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో అధిక క్యాష్‌ ఫ్లోకు వీలు కల్పిస్తాయి’’ అని తెలిపింది. 20-30 శాతం వరకు వచ్చే ఏడాది కాలంలో రాబడులు ఇచ్చేందుకు అవకాశం ఉన్న ఆరు స్టాక్స్‌ను సూచించింది.

 

  • బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌. టార్గెట్‌ రూ.165. 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో రూ.471 కోట్లు, 514 కోట్ల మేర ఆదాయన్ని నమోదు చేయనుంది. ప్రస్తుతం ఈ స్టాక్‌ 5.7 పీఈ వద్ద ట్రేడవుతోంది. 
  • ధంపూర్‌ షుగర్‌. టార్గెట్‌ రూ.200. 2020 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం ఆదాయ వృద్ధి ఉంటుంది. కార్యకలాపాల ద్వారా రూ.200 కోట్ల సానుకూల క్యాష్‌ ఫ్లో నమోదు కాగలదు. ఇది కంపెనీ బ్యాలన్స్‌ షీటులోని రుణాలు తగ్గించుకునేందుకు మేలు చేస్తుంది. 
  • దాల్మియా భారత్‌. టార్గెట్‌ రూ.100. ధరలు స్థిరంగా ఉండడం, ఎగుమతుల వల్ల అమ్మకాలు పెరగడం, అధిక డిస్టిలరీ అమ్మకాలు పంచదార కంపెనీలకు మేలు చేస్తాయి. దాల్మియా భారత్‌ షుగర్‌ స్టాక్‌ను రూ.100 టార్గెట్‌ ధరకు, ద్వారికేష్‌ షుగర్‌ స్టాక్‌ను రూ.30 టార్గెట్‌కు, త్రివేణి ఇంజనీరింగ్‌ను రూ.70 టార్గెట్‌కు, అవధ్‌ షుగర్‌ను రూ.280 టార్గెట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చని సిఫారసు చేసింది. You may be interested

నేడు మార్కెట్లకు సెలవు

Monday 2nd September 2019

వినాయక చవితి సందర్భం‍గా సోమవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్ర సమయంలో ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా మంగళవారం (3న) ప్రారంభమవుతుంది.  బ్యాంక్‌, ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మధ్యాహ్న నష్టాలు రికవరీ కావడంతో మార్కెట్‌ శుక్రవారం లాభంతో ముగిసింది. ప్రస్తుత మందగమనం చక్రీయ

మార్కెట్లు పడిపోతున్నాయా... వర్రీ వద్దు..!

Sunday 1st September 2019

స్టాక్‌ మార్కెట్లు పడిపోతుంటే ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు చేసే పని... దూరంగా వెళ్లిపోవడం. కానీ, ఈక్విటీ మార్కెట్లో దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే ఇలా చేయడం ఎంత మాత్రం సరికాదంటున్నారు నిపుణులు. మార్కెట్లు పడిపోతుంటే... బేర్లు అమ్మకాలు చేస్తుంటే అవకాశాలను సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. మార్కెట్లో సంక్షోభాన్ని ప్రతీ ఒక్క ఇన్వెస్టర్‌ ఎందుకు ఆహ్వానించాలన్నది ఎడెల్వీజ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈవీపీ రాహుల్‌ జైన్‌ తెలియజేశారు...   రీబ్యాలన్స్‌  మీ బ్యాలన్స్‌ను పునర్నించుకునేందుకు మార్కెట్‌

Most from this category