News


ఫైనాన్స్‌, ఫార్మాలో ఈ షేర్లు బెస్ట్‌: ఇండిట్రేడ్‌ ఛైర్మన్‌

Tuesday 16th July 2019
Markets_main1563262784.png-27098

  • ఇన్ఫోసిస్‌, టీసిఎస్‌ వాల్యుషన్‌ గ్యాప్‌ తగ్గనుంది.
  • సన్‌ ఫార్మా, డా.రెడ్డిస్‌ షేర్లు మంచి లాభాలను ఇవ్వగలవు
  • ఫైనాన్స్‌ షేర్లలో ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ బుల్లిష్‌గా ఉన్నాయి.

 
ఫార్మాలో పెట్టుబడులు పెట్టేటప్పుడు రక్షణాత్మక దోరణిని అవళింబించవచ్చు కానీ ఈ షేర్లు ఎల్లప్పుడూ రక్షణాత్మకంగా ఉండకపోవచ్చని ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌ చైర్మన్‌ సుదీప్‌ బంద్యోపధ్యాయ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...

ఇన్ఫోసిస్‌ అంచనాలకు మించి...
  ఇన్ఫోసిస్ పాజిటివ్‌ ఫలితాలను ప్రకటిస్తుందని అంచనా వేశాం కానీ ఈ కంపెనీ అంచనాలకు మించి రాణించింది.  ఇన్ఫోసిస్‌ ఒక సాంప్రదాయకమైన కంపెనీ ఇది రక్షణాత్మకమైన దృక్పథం, మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటుంది. స్థిరమైన కరెన్సీ, ఆదాయ వృద్ధి పెరుగుదల ప్రకారం మొత్తం ఏడాదికి కంపెనీ మార్గదర్శకాలను మొదటి క్వార్టర్‌లోనే  ప్రకటించడం ఐటీ పరిశ్రమకు మేలు చేకూర్చెదే.  దీంతోపాటు ఈ కంపెనీ డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించిన విధానం బాగుండడంతో పాటు మేనేజ్‌మెంట్‌లో స్థిరత్వం రావడంతో ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఐటి, టెక్నాలజీ రంగాలలో పెట్టుబడులు పెట్టే వాళ్లను ఆకర్షిస్తుంది. అన్నిటి కన్నా ముఖ్యంగా ఇన్ఫోసిస్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్లను ఇది ఆకర్షిస్తోంది. 
    ప్రస్తుత పరిస్థితులలో స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ స్టాకులు ఆనాసక్తి, నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మార్కెట్లోకి వచ్చే చాలా వరకు పెట్టుబడులు లార్జ్‌క్యాప్‌ల చూట్టు తిరుగుతున్నాయి. లార్జ్‌క్యాప్‌ వాల్యుషన్లు పెరిగినప్పుడు వీటిని ఒక అవకాశంగా పెట్టుబడి దారులు చూస్తున్నారు.

వాల్యుషన్‌ గ్యాప్‌ తగ్గనుంది..
     ఇన్ఫోసిస్, టిసిఎస్ మధ్య ఖచ్చితమైన వాల్యుషన్‌ గ్యాప్‌ ఉంది. టిసిఎస్ వాల్యుషన్‌ 20-21 రెట్లు ఉండగా ఇన్ఫోసిస్‌ వాల్యుషన్‌ 17.5 రెట్లు ఉంది. ఇప్పటికి రెండు కంపెనీల మధ్య వాల్యుషన్‌ గ్యాప్‌ కనిపిస్తోంది.  టీసిఎస్‌ కూడా మంచి ఫలితాలనే ప్రకటించింది . ఈ కంపెనీని ఇన్ఫోసిస్ అందుకోవాలంటే కొంత సమయం పడుతుంది. ఇన్ఫోసిస్‌ ఇప్పుడు ప్రదర్శిస్తున్నట్టే  భవిష్యత్తులో కూడా ప్రదర్శన చేయడంతో పాటు సవరించిన మార్గదర్శకాల ప్రకారం పనిచేయగలిగితే భవిష్యత్తులో ఈ రెండు కంపెనీల మధ్య పెద్దగా వాల్యుషన్‌ గ్యాప్‌ ఉండకపోవచ్చు. మంచి వాల్యుషన్లు కలిగిన స్టాకులు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు. కొన్ని స్టాకులు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నప్పటికి వాల్యుషన్లు బాగున్న షేర్లు దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇవ్వగలవు. 

భారత్‌ ఫైనాన్స్‌తో విలీనం కలిసొచ్చింది..
ఇండస్‌ఇండ్‌ బ్యాంకు గత త్రైమాసిక ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి ఈ స్టాకు పై సానుకూలంగా ఉన్నాము. బ్యాంక్‌ పై ఉన్న పుకార్లు, ఆస్థి నాణ్యత సమస్యలను గురించి మేనెజ్‌మెంట్‌ స్పస్టతనివ్వడంతో పాటు భారత్‌ ఫైనాన్స్‌తో విలీనమవ్వడంతో ఈ స్టాకు బాగా రాణిస్తోంది. భారత ఫెనాన్స్‌ స్వతంత్రంగా 28-30 శాతం వృద్ధి  సాధించింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 20-24 శాతం వృద్ధి పెరుగుదలను నమోదు చేస్తోంది. అంతేకాకుండా మేనెజ్‌మెంట్‌ సుమారుగా 25% వృద్ధికి మార్గదర్శకత్వాలను ఇచ్చింది. ఈ లక్ష్యాలను సాధించగలిగే సామర్థ్యం ఈ స్టాకుకు ఉంది. 
     మైక్రోఫైనాన్స్ మార్జిన్లు మెరుగ్గా ఉంటే కంపెనీ మార్జిన్లు మెరుగుపడతాయి. అంతేకాకుండా  రిటైల్‌ డిపాజిట్లను ఆకర్షించడం చాలా అవసరం. ఇండస్‌ఇండ్‌ బ్యాంకే కాకుండా కొత్తగా వచ్చిన బ్యాంకులలో ఈ రిటైల్‌ డిపాజిట్లు తక్కువగా ఉన్నాయి. కానీ ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులో భారత్‌ ఫెనాన్స్‌ విలీనం కావడంతో పెద్ద సంఖ్యలో ఈ డిపాజిట్లను ఆకర్షించగలదు.  దీర్ఘకాలంలో మార్జిన్లను పొందడానికి  ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో పెట్టుబడులు సహకరించగలవు. ఈ షేరు టార్గెట్‌ ధరను రూ.17,00 గా అంచనా వేశాం.
 
ఫార్మా మెరుగు పడుతోంది...  

  గత రెండేళ్ల నుంచి ఫార్మా రంగం తీవ్రంగా నష్టపోయింది. సన్‌ ఫార్మా తన అద్వాన్న స్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితుల నుంచి ఫార్మా రంగం మెరుగవుతోంది. దీర్ఘకాలంలో పెట్టుబడులకు సన్‌ ఫార్మాను పరిశీలించవచ్చు. పెట్టుబడి పెట్టే వాళ్లలో పరిమితిలుండి, ఫార్మా షేర్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం డా. రెడ్డీస్‌ను పరిశీలించవచ్చు. ఈ కంపెనీ చైనాలో విస్తరించడంతో పాటు అమెరికా ఎఫ్‌డీఏ సమస్యలను పరిష్కరించుకునే విధానం వలన ఈ షేరు బుల్లిష్‌గా ఉంది. కానీ ప్రస్తుత సన్‌ ఫార్మా స్థాయి ఆకర్షిణియంగా కనిపిస్తోంది. వీటితో పాటు టొరెంట్‌ ఫార్మాను, జుబిలియంట్‌ పార్మా షేర్లు కూడా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.

టొరెంట్‌ ఫార్మా, జుబిలియంట్‌..
     ఫార్మాలో పెట్టుబడులు పెట్టేటప్పుడు రక్షణాత్మక దోరణిని అవళింబించవచ్చు. కానీ ఈ షేర్లు ఎల్లప్పుడూ రక్షణాత్మకంగా ఉండవు. గత రెండేళ్లలో ఈ రంగంలో ఏం జరిగిందో చూశాం. అమెరికా ఎఫ్‌డీఏ చర్యలు ఫార్మా రంగ అవుట్‌ లుక్‌ను మార్చాయి. అమెరికా ధరల, నియంత్రణ ఒత్తిళ్లను పక్కనపెడితే  ఫార్మా రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉంది. ఫార్మారంగంలో టొరెంటో ఫార్మా బుల్లిష్‌గా ఉంది. ఫార్మా రంగంలో రక్షణాత్మక పోర్ట్‌ఫోలియో కోసం వెతుకుతున్న పెట్టుబడిదారులు టొరెంటో ఫార్మాను పరిశీలించవచ్చు. టొరెంట్‌ ఫార్మా  రెవెన్యూలో 45 శాతం దేశియ వ్యాపారం వలన వస్తోంది. ఎల్డర్‌ ఫార్మా, యూనికెమ్‌ వ్యాపారాలను పొందడం వలన దేశియ ఫార్మా రంగంలో తమ స్థానాన్ని పదిల పరుచుకోగలుగుతోంది. అంతేకాకుండా టొరెంట్ ఫార్మాకు జర్మనీ, బ్రెజిల్  మార్కెట్లు ముఖ్యమైనగా ఉన్నాయి. అమెరికా మార్కెట్ల నుంచి కూడా 25-26 శాతం ఆదాయాన్ని పొందుతోంది .  దీనితో పాటు జూబిలెంట్ లైఫ్‌సైన్స్ పరిశీలించవచ్చు. ఎఫ్‌డీఏ హెచ్చరికలు వచ్చినప్పటికి దీనిపై పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. జుబిలియంట్‌ ఫార్మా స్పెషాలిటీ ఫార్మాలో ఉంది. అంతేకాకుండా దీని వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. 

ఫైనాన్స్‌ సెక్టార్‌లో ఈ షేర్లు..
 ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు రికవరి మార్గంలో ఉన్నాయి. వీటి ఆస్తి నాణ్యత, నికర వడ్డి మార్జిన్లు(ఎన్‌ఐఎం)లు ఏవిధంగా మారతాయో గమనించాలి. ప్రవేటు రంగ బ్యాంకులలో ఈ రెండు బ్యాంకులను పరిశీలించవచ్చు. విటితో పాటు బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్సర్వ్‌ల షేర్లు బాగున్నాయి. డిమాండ్‌ మందగించినప్పటికి బజాజ్‌ ఫైనాన్స్‌ ఆదాయాల నాణ్యత బాగుంది. 
   ప్రైవేట్ రంగ చిన్న బ్యాంకులలో ఫెడరల్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ షేర్లు బుల్లిష్‌గా ఉన్నాయి. వీటి ఆస్తి నాణ్యతతో పాటు నికర వడ్డీ మార్జిన్‌లు మెరుగుపడుతున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల షేర్లు ఇంకా కోలుకోనప్పటకి శ్రీరామా ట్రాన్సఫోర్ట్‌ ఫైనాన్స్‌, శ్రీరామా సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌లను మదుపర్లు గమనించే అవకాశం ఉంది. 

 You may be interested

రెండంకెల రాబడికి నార్నొలియా రికమండేషన్లు

Tuesday 16th July 2019

స్వల్పకాలంలో 10-20 శాతం రాబడినిచ్చే ఐదు స్టాకులను నార్నొలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ సిఫార్సు చేస్తుంది 1. హిందుస్థాన్‌ ఆయిల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కంపెనీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 150. స్టాప్‌లాస్‌ రూ. 109. దిగువన రూ.110ని తాకిన అనంతరం వేగంగా రీబౌండ్‌ చెంది కన్సాలిడేషన్‌లోకి వెళ్లింది. ప్రస్తుత పోల్‌ అండ్‌ ఫ్లాగ్‌ ప్యాట్రన్‌ నుంచి రూ. 130కి పైన బ్రేకవుట్‌ సాధిస్తే మరింత అప్‌మూవ్‌ ఉంటుంది. 2. మనుప్పురం ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ.

భూషణ్ పవర్‌ను కొంటాం ..కానీ..

Tuesday 16th July 2019

కంపెనీలో మోసాల వార్తలపైనే ఆందోళన ఎన్‌సీఎల్‌టీకి తెలిపిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ న్యూఢిల్లీ:   దివాలా ప్రక్రియ కింద వేలానికి వచ్చిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌ (బీపీఎస్‌ఎల్‌)ను కొనుగోలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తెలిపింది. అయితే, ఆ సంస్థ మాజీ ప్రమోటర్లు మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపైనే కొంత ఆందోళన ఉన్నట్లు, కంపెనీలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు వివరించింది. దీంతో బీపీఎస్‌ఎల్‌ ఫోరెన్సిక్

Most from this category