News


యస్‌ బ్యాంకు ర్యాలీ.. కాస్త జాగ్రత్త!

Tuesday 17th March 2020
Markets_main1584387923.png-32512

యస్‌ బ్యాంకు సోమవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో ఉవ్వెత్తున ఎగిసింది. ఇంట్రాడేలో 58 శాతం వరకు ర్యాలీ చేసింది. చివరికి 45 శాతం లాభంతో రూ.37.10 వద్ద బీఎస్‌ఈలో క్లోజయింది. గత శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత బ్యాంకు మూడో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.18వేల కోట్లకు పైగా నష్టాలను ప్రకటించింది. ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నా, ఇప్పటికే షేర్లు కొనుగోలు చేసిన వారు తమ వద్దనున్న మొత్తం షేర్లలో కేవలం 25 శాతమే అమ్ముకోవడానికి వీలుంటుందని, మిగతా 75 శాతం మూడేళ్లపాటు లాకిన్‌ అవుతాయని (100 షేర్లలోపున్న వారు మినహా) ప్రభుత్వం ఆంక్షలు పెట్టినప్పటికీ... స్టాక్‌ ర్యాలీ చేయడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అయితే కొందరు అనలిస్టులు దీన్ని సకర్‌ ర్యాలీ (స్వల్పకాల పెరుగుదల)గా పేర్కొంటున్నారు. మరికొందరు అధిక స్పెక్యులేషన్‌ను కారణంగా చెబుతున్నారు. 

 

సకర్‌ ర్యాలీ అన్నది ఓ స్టాక్‌ పడిపోతున్న క్రమంలో వెనక్కి లేవడంగా వర్ణిస్తారు. అంటే భారీగా పడిపోతున్న స్టాక్‌ను సొంతం చేసుకోవాలన్న ఇన్వెస్టర్లలోని ఉత్సాహం ధర పెరుగుదలకు దారితీస్తుందని చెబుతారు. యస్‌ బ్యాంకును నిలబెట్టేందుకు ఎనిమిది బ్యాంకులు రూ.12వేల కోట్లకు పైగా ఈక్విటీ రూపంలో నిధులు సమకూర్చనున్న విషయం తెలిసిందే. ‘‘ఇతర బ్యాంకులు చూపించిన ఆసక్తి అద్భుతం. మారటోరియం కూడా ఎత్తివేస్తే అది సానుకూలం అవుతుంది’’ అని మార్కెట్‌ అనలిస్ట్‌ అంబరీష్‌బలిగ పేర్కొన్నారు. యస్‌ బ్యాంకు పునర్నిర్మాణ పథకంలో భాగంగా పెట్టుబడులు పెడుతున్న వాటిల్లో ప్రభుత్వరంగ ఎస్‌బీఐ రూ.7500 కోట్ల వరకు అందిస్తూ 49 శాతం వాటా తీసుకుంటోంది. 

 

యస్‌ బ్యాంకు స్టాక్‌ గణనీయంగా పెరగడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎక్కువ మంది అనలిస్టులు సూచిస్తున్నారు. యస్‌ బ్యాంకు ఫ్రీ ఫ్లోట్‌ (ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్ల పరిమాణం) 75 శాతం తగ్గిపోయింది (లాకిన్‌). ఫ్రీ ఫ్లోట్‌ తక్కువగా ఉంటే స్టాక్‌ కదలికలు ఎటువైపు అయినా (అప్‌/డౌన్‌) వచ్చే వార్తలకు అనుగుణంగా చురుగ్గా ఉండొచ్చు’’ అని బలిగ తెలిపారు. అయితే, డిసెంబర్‌ త్రైమాసికంలో బ్యాంకు చూపించిన ఫలితాలతో చెడు దాదాపు ముగిసినట్టేనని ఆయన పేర్కొన్నారు. అయితే, బ్యాంకు డిపాజిట్లపై విధించిన మారటోరియం ఎత్తివేస్తే (18వ తేదీ సాయంత్రం) ఎంత మంది కస్టమర్లు బ్యాంకుతో ఉంటారన్నది చూడాల్సి ఉందన్నారు. దీన్ని సకర్‌ ర్యాలీగా ప్రభుదాస్‌ లీలాధర్‌ పీఎంఎస్‌ సీఈవో అజయ్‌బోడ్కే అభివర్ణించారు. ‘‘కృత్రిమంగా ఫ్రీఫ్లోట్‌ను నియం‍త్రిస్తున్నారు. దాంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. 75 శాతం వాటాలు మూడేళ్ల పాటు లాకిన్‌ అయిపోయాయి. ఇప్పడు సరఫరా లేదు. దీంతో స్పెక్యులేటర్లకు అవకాశం చిక్కింది’’ అని బోడ్కే వివరించారు. ఫ్రీ ఫ్లోట్‌ను కట్టడి చేయడం వల్ల స్టాక్‌ ధరలో మానిప్యులేషన్‌ను తోసిపుచ్చలేమన్నారు కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవేన్‌ చోక్సే. You may be interested

జీడీపీకి కరోనా కాటు!

Tuesday 17th March 2020

వృద్ధి 50 బేసిస్‌ పాయింట్లు తగ్గుతుందన్న ఆందోళన ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రతాపం మరింత వ్యవధిపాటు కొనసాగితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు అర శాతం వరకు తగ్గుతుందన్న ఆందోళన దేశీయ కంపెనీల నుంచి వ్యక్తమైంది. అంతేకాదు, ఈ వైరస్‌ ప్రభావం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యలోటు మరింత పెరిగిపోవడమే కాకుండా బ్యాంకులకు మొండి బాకీలు (ఎన్‌పీఏలు) మరింత జోడవుతాయని పేర్కొన్నాయి. కరోనా వైరస్‌ ప్రభావం దేశ

మార్కెట్‌ స్థిరపడితే ఎస్‌బీఐ కార్డ్‌ ర్యాలీ..?

Tuesday 17th March 2020

స్టాక్‌ మార్కెట్లు కుదుటపడితే ఎస్‌బీఐ కార్డ్‌ షేరు పుంజుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ సంస్థ ఎండీ, సీఈవో హర్‌దయాళ్‌ ప్రసాద్‌. మార్కెట్లలో అల్లకల్లోలం సర్దుమణిగిన తర్వాత కంపెనీ బలాలు ముందుకు వస్తాయని అప్పుడు తిరిగి షేరు ధర కంపెనీ పనితీరును ప్రతిఫలిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ, కంపెనీ ఆదాయం, వృద్ధి తప్పకుండా షేరులో కనిపిస్తాయని, ప్రస్తుత పతనం తాత్కాలికమేనన్నారు. కంపెనీ వృద్ధి అవకాశాలపై మాట్లాడుతూ..

Most from this category