News


ఇండియాబుల్స్ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 10శాతం క్రాష్‌

Monday 29th July 2019
Markets_main1564375368.png-27368

మనీలాండరింగ్‌ ఆరోపణలు తెరపైకి రావడంతో ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్లు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 10శాతం పతనమయ్యాయి. ఇండియాబుల్స్‌ గ్రూప్‌ రూ.లక్ష కోట్ల మనీలాండరింగ్‌ మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఆదివారం బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. కంపెనీ దాదాపు 100 షెల్‌ కంపెనీను సృష్టించి నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు(ఎన్‌హెచ్‌బీ) నుంచి రుణాలను పొందినట్లు తెలిపారు. ఈ కుంభకోణంతో చాలామంది కాంగ్రెస్‌ నాయకులు హస్తం ఉందని, ఈ వ్యవహారంతో రూ.లక్ష కోట్ల మేర ప్రజాధనం దర్వినియోగమైట్లు ఆయన ఆరోపించారు. అయితే ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ మాత్రం సుబ్రమణ్యం ఆరోపణలు ఖండించింది. కంపెనీ చరిత్రలో ఇప్పటి వరకు నేషనల్‌ హౌసింగ్‌ బోర్డు(ఎన్‌హెచ్‌బీ) నుంచి ఎలాంటి రుణాన్ని గానీ, రీఫైనాన్సింగ్‌ సదుపాయాన్ని గానీ పొందలేదని అధికారులు వివరణ ఇచ్చారు. ఫలితంగా నేడు ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో 5శాతం నష్టంతో రూ.624.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే షేర్లు మరింత అమ్మకాల ఒత్తిడికి లోనై 10శాతం నష్టపోయి రూ.562.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. ఉదయం గం.9:45ని.లకు షేరు గతముగింపుధర(రూ.624.15)తో పోలిస్తే 7.50 శాతం నష్టంతో రూ.575.85ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.500.20  రూ.1396.85లుగా నమోదయ్యాయి.



You may be interested

మెటల్‌ షేర్లు నష్టాల్లో ..

Monday 29th July 2019

ఈ వారం ఫెడ్‌ సమావేశంతో పాటు, యూఎస్‌-చైనా మధ్య వాణిజ్య చర్చలు జరగనుండడంతో మదుపర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 10.25 సమయానికి 2.30 శాతం నష్టపోయి 2,630.65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో వేదాంత లి.4.36 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 3.46 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 3.24, సెయిల్‌ 2.99 శాతం, జిందాల్‌ స్టీల్‌ 2.83

నష్టాల్లో ఆటో షేర్లు

Monday 29th July 2019

ఈ వారం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమీక్ష, అమెరికా-చైనా వాణిజ్య చర్చల పునర్‌ప్రారంభం వంటి కీలక అంశాల నేపథ్యంలో దేశియ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఉదయం 9.40 సమయానికి 2.62 శాతం నష్టపోయి 6,973.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో బజాజ్‌ ఆటో 4.93 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 4.55 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 3.62 శాతం, అశోక్‌ లేలాండ్‌ 3.57 శాతం,

Most from this category