News


11840పాయింట్ల వద్ద బలమైన మద్దతు!

Monday 11th November 2019
Markets_main1573445486.png-29496

ఏంజల్‌ బ్రోకింగ్‌ అనలిస్టు సమిత్‌ చవాన్‌
గతవారం నిఫ్టీ సుమారు 200 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. వారాంతానికి నెగిటివ్‌గా క్లోజయి వారం మొత్తం ఆర్జించిన లాభాలు దాదాపు వదిలిపెట్టింది. సెన్సెక్స్‌ కొత్త రికార్డులను చూస్తుండగా, నిఫ్టీ మాత్రం వెనకముందు ఆడుతోంది. గతవారం నిఫ్టీ గత గరిష్ఠం దాటేందుకు పలు యత్నాలు చేసింది. కానీ సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 11843 పాయింట్ల వద్ద చాలా బలమైన మద్దతు ఉంది. ఇంట్రాడేలో ఈ స్థాయికి దిగువన కదలాడుతుంటే ప్రాఫిట్‌ బుకింగ్‌ మరింత పెరిగి 11714 పాయింట్ల వరకు దిగజారే  అవకాశం ఉంది. అయితే దీన్ని ట్రెండ్‌ రివర్సల్‌గా పరిగణించాల్సిన అవసరం లేదు. ఇది ఒక సాధారణ ప్రాఫిట్‌ బుకింగ్‌ ప్రక్రియగానే చూడాలి. ఇలాంటి బుకింగ్స్‌ తదుపరి ర్యాలీలకు చాలా అవసరం. మార్కెట్లపై ప్రస్తుతానికి పాజిటివ్‌గానే ఉన్నాము. త్వరలో నిఫ్టీ సైతం కొత్త గరిష్ఠం తాకవచ్చని అంచనా. గతవారం ప్రధాన మార్కెట్‌ పెద్దగా ర్యాలీ జరపకున్నా, మెటల్‌, రియల్టీ రంగాల్లో మంచి జోరు కనిపించింది. ఈ వారం కూడా ఇదే విధంగా ఎంపిక చేసిన రంగాల్లోనే ర్యాలీ ఉండే అవకాశాలున్నాయి. 
నెల రోజుల కోసం రెండు సిఫార్సులు
1. టాటా స్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 440. స్టాప్‌లాస్‌ రూ. 374. మెటల్‌ రంగం కొన్ని నెలల పాటు ఇబ్బందులు చూసింది. ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు బాగాలేకపోవడంతో ఈ రంగం ఇక్కట్లు పడింది. కానీ తాజాగా అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా లోహరంగానికి పాజిటివ్‌ గాలులు వీస్తున్నాయి. ఈ రంగంలో జోరు ముందుగా టాటా స్టీల్‌లో గతవారం కనిపించింది. వారాంతంలో షేరు బ్రేకవుట్‌ సాధించింది. తదుపరి సెషన్లలో షేరు జోరు మరింతగా కొనసాగుతుంది.
2. అలెంబిక్‌ ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 648. స్టాప్‌లాస్‌ రూ. 527. దీర్ఘకాలిక నెగిటివ్‌ ప్రదర్శన అనంతరం ఫార్మా రంగ షేర్లలో పునరుజ్జీవం కనిపిస్తోంది. అలెంబిక్‌ షేరు తాజాగా గట్టి నిరోధం రూ. 560ని దాటింది. దీంతో చార్టుల్లో ఇన్వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ఏర్పడింది. ఇది బుల్లిష్ రివర్సల్‌ ప్యాట్రన్‌. బ్రేకవుట్‌ అనంతరం కొంత కన్సాలిడేషన్‌ చూసిన షేరు త్వరలో మరింత ముందుకు సాగనుంది. You may be interested

స్థిరంగా పసిడి

Monday 11th November 2019

గత వారాంతపు రోజున 3నెలల కనిష్టానికి పతనమైన పసిడి ఫ్యూచర్‌ ధర సోమవారం స్థిరంగా కదలాడుతుంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరశాతం లాభంతో 1463.50డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా ‘‘మొదటి దశ ఒప్పందం’’ సఫలం దిశగా సాగుతుందనే ఆశావహన అంచనాలతో పాటు,  డాలర్ ఇండెక్స్‌ సైతం 3వారాల గరిష్టానికి చేరుకోవడంతో పసిడి ధర 3నెలల కనిష్టస్థాయి 1,459

బలహీనపడిన రూపీ

Monday 11th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం సెషన్లో 8 పైసలు బలహీనపడి 71.36 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో 71.28 వద్ద ముగిసింది. ‘ఇండియాపై దృక్పథాన్ని ‘స్థిరం’ నుంచి ‘ప్రతికూలం’కు మూడిస్‌ తగ్గిం‍చింది. కానీ సమీపకాలం వరకు రూపీపై దీని ప్రభావం స్వల్పంగా ఉంటుంది’ అని ఆనంద్‌ రాఠి షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకింగ్‌, కరెన్సీ, కమోడిటీ రిసెర్చ్‌ ఎనలిస్ట్‌, రుషభ్‌ మారు

Most from this category