News


11100- 11600 రేంజ్‌లో నిఫ్టీ!

Monday 14th October 2019
Markets_main1571027089.png-28864

నిపుణుల అంచనా
నిఫ్టీ డెరివేటివ్స్‌ డేటా పరిశీలిస్తే 11100, 11200 పాయింట్ల వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉండగా, 11400, 11500పాయింట్ల వద్ద కాల్స్‌ అధికంగా ఉన్నాయి. అందువల్ల ఈ సీరిస్‌కు 111000, 11600 పాయింట్లు మద్దతు, నిరోధాలుగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి పతనంసమయంలో నిఫ్టీ గత కన్సాలిడేషన్‌ రేంజ్‌ను కాపాడుకోగలిగింది. దీంతో నిఫ్టీలో తక్షణ పతనం భయాలు లేవని నిపుణులు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ అంశాల ఆధారంగా తీవ్ర కదలికలుంటాయని అంచనా. చార్టుల్లో నిఫ్టీ చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. వీక్లీ చార్టుల్లో హయ్యరట్‌ టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. నిఫ్టీ 11350 పాయింట్ల పైన స్థిరంగా కదలాడితే 11500 పాయింట్ల వరకు పెరగవచ్చు. ఒకవేళ 11180 పాయింట్ల దిగువన కదలాడితే క్రమంగా 11100 పాయింట్ల వరకు దిగజారవచ్చు. వీక్లీ చార్టుల్లో ఇండికేటర్లు ప్రస్తుతానికి పాజిటివ్‌గానే ఉన్నాయి. అందువల్ల బుల్లిష్‌ సెంటిమెంట్‌ కొంతవరకు కొనసాగవచ్చు. మొత్తం మీద 11100- 11600 పాయింట్ల రేంజ్‌ కీలకంగా ఉండనుంది. ఈ రేంజ్‌ని బ్రేక్‌డౌన్‌ లేదా బ్రేకవుట్‌ చేయడాన్నిబట్టి తదుపరి కదలికలుంటాయి. ఈ రేంజ్‌లో ఉన్నంతవరకు దిగువకు వచ్చినప్పుడల్లా కొనుగోళ్లను పరిశీలించవచ్చు. స్వల్పకాలానికి ఎఫ్‌ఎంసీజీ, టెలికం, మెటల్‌ షేర్లపై ఎక్కువమంది అనలిస్టులు బుల్లిష్‌గా ఉన్నారు. 


నిఫ్టీ ఆప్షన్‌ డేటా పై విధంగా ఉంది..(అక్టోబర్‌ సీరిస్‌)



You may be interested

ఇరాన్‌ ట్యాంకర్‌పై దాడి..పెరిగిన చమురు

Monday 14th October 2019

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం పెరగడంతోపాటు, యుఎస్‌-చైనా మధ్య పాక్షిక ఒప్పందం కుదరడంతో శుక్రవారం సెషన్‌లో చమురు ధరలు 2 శాతం మేర పెరిగాయి. మధ్యప్రాచ్యంలో ఒత్తిళ్లు కొనసాగుతుండడంతో సోమవారం ట్రేడింగ్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ప్లాట్‌గా ప్రారంభమైంది. ఉదయం 9.53 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.40 శాతం నష్టపోయి బారెల్‌ 60.27 డాలర్ల వద్ద, డబ్యూటీ క్రూడ్‌ 0.48 శాతం నష్టపోయి 54.44 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.  కాగా గత వారంలో

14 పైసలు బలపడిన రూపీ

Monday 14th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం 14 పైసలు బలపడి 70.88 వద్ద ప్రారంభమైంది. కాగా ఇరాన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌పై దాడి జరగడంతో శుక్రవారం సెషన్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయి. ఫలితంగా గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి చివరికి 5 పైసలు బలపడి 71.02 వద్ద ప్లాట్‌గా ముగిసింది. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో రూపీ-డాలర్‌ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.15 వద్ద ఉందని,

Most from this category