News


ఇది ప్రీబడ్జెట్‌ ర్యాలీ ; నాయర్‌

Saturday 18th January 2020
Markets_main1579343140.png-31021

ప్రభుత్వ చర్యలు, కంపెనీల ఆర్జనలపై అంచనాల ఎఫెక్ట్‌


వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పై అంచనాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లలో పటిష్ట ప్రీబడ్జెట్‌ ర్యాలీ నెలకొన్నట్లు మార్కెట్‌ నిపుణులు వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. మందగమనం‍లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు దన్ను, పారిశ్రామిక రంగానికి మద్దతు, వినియోగాన్ని పెంచే గ్రామీణ ఆదాయాల పెంపు తదితర చర్యలను 2020 బడ్జెట్‌లో మార్కెట్లు ఆశిస్తున్నట్లు తెలియజేశారు. జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ ఇంకా ఏమన్నారంటే..

ఆదాయపన్ను తగ్గింపు?
ఆర్థిక శాఖ కార్పొరేట్‌ ట్యాక్స్‌ పన్ను తగ్గింపును ప్రకటించాక ప్రస్తుతం ఆదాయపన్ను కోతపై మార్కెట్లో అంచనాలు పెరిగాయి. ఆటో, ఇన్‌ఫ్రా, రియల్టీ, ఆక్వాకల్చర్‌, హౌసింగ్ రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉండవచ్చని మార్కెట్లు భావిస్తు‍న్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రభుత్వం దృష్టిపెట్టే అవకాశముంది. ఇప్పటికే రానున్న ఐదేళ్ల కాలానికి మౌలికసదుపాయాలపై రూ. 105 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలను ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ అంశాల అమలులో ప్రభుత్వం ప్రకటించనున్న ద్రవ్య విధానాలు, దీర్ఘకాలిక ప్రణాళికలను మార్కెట్లు పరిశీలిస్తాయి. గత రెండేళ్లలో బడ్జెట్‌ ప్రణాళికలన్నీ ఆచరణలో సాధ్యంకాలేదు. అయితే ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. దీంతో ఈసారి బడ్జెట్‌లో ఆచరణ సాధ్యమయ్యే నిర్మాణాత్మక ప్రతిపాదలకు అవకాశముంది. ద్రవ్యలోటు లక్ష్యం 3.3 శాతం నుంచి 3.6-3.8 శాతానికి చేరవచ్చు. అయితే ఈ ఏడాది క్యూ4లో ప్రభుత్వ వ్యయ నియంత్రణ ప్రణాళికలు, ఆదాయాల ఆధారంగా ఈ సంఖ్య మారనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ప్రాధాన్యంగా బడ్జెట్‌ రూపొందించే వీలుంది.

ఫలితాలు ఓకే
ఈ ఏడాది క్యూ3(అక్టోబరల్‌-డిసెంబర్‌) ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే వెలువడుతున్నాయి. వార్షిక ప్రాతిపదికన నిఫ్టీ ఆర్జన 20 శాతానికిపైగా పెరిగే అవకాశముంది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఎన్‌పీఏల ప్రొవిజన్లు తగ్గడం వంటి అంశాలు ఇందుకు దోహదం చేయనున్నాయి. సాధారణ వర్షపాతం, వ్యయాలు తగ్గడం వంటి అంశాల కారణంగా ఎఫ్‌ఎంసీజీ రంగం మెరుగైన పనితీరును ప్రదర్శించనుంది. బ్యాంకింగ్‌, గ్లోబల్‌ డిమాండ్‌ మందగించడంతో ఐటీ రంగం అంతంత మాత్ర ఫలితాలు సాధించవచ్చు. ఆటో, మెటల్స్‌, టెలికం రంగాలలో స్వల్ప వృద్ధికి అవకాశముంది.You may be interested

ఆర్థిక మంత్రిగా కెవీ కామత్‌..?

Saturday 18th January 2020

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగం నిపుణులు, ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌, బ్రిక్స్‌ బ్యాంక్‌ ప్రస్తుత చైర్మన్‌  కెవీ కామత్‌ కేంద్రమంత్రి మండలిలోకి రానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కామత్‌కు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిత్వ శాఖను ఇచ్చే అవకాశాలున్నాయి. కాగా కామత్‌ గతంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ చైర్మన్‌గానే గాక ఇన్ఫోసిస్‌, ఇండియా ఇంక్‌ నెట్‌వర్క్‌లలో క్రియాశీలకంగా వ్యవహరించారు. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగంలో అపార అనుభవం ఉన్న కామత్‌ను కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా

6 నెలల కాలానికి టాప్‌ సిఫార్సులు

Saturday 18th January 2020

కేంద్ర ప్రభుత్వం మరో 12 రోజుల్లో పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ ప్రభావంతో స్టాక్‌మార్కెట్లో సూచీలు స్వల్పకాలం(3నెలల పాటు)లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టాప్‌ బ్రోకరేజ్‌ సం‍స్థలు 6 నెలల కాలానికి 5 షేర్లను సిఫార్సు చేస్తున్నాయి. 1.షేరు పేరు:- కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ బ్రోకరేజ్‌ సంస్థ:- మోతీలాల్‌ ఓస్వాల్‌ రేటింగ్‌:- కొనవచ్చు షేరు ప్రస్తుత ధర:- రూ.588.70 టార్గెట్‌ ధర:- రూ.677.00 కాలపరిమితి:- 6నెలలు విశ్లేషణ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కంపెనీ మెరుగైన

Most from this category