పలు మిడ్‌క్యాప్స్‌లో ఎంఏసీడీ బుల్లిష్ సంకేతాలు
By D Sayee Pramodh

మార్కెట్ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్ రివర్సల్ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు. 26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్ మూవింగ్ యావరేజెస్ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్ మూవింగ్ యావరేజిని సిగ్నల్ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్ ఆధారంగా బై, సెల్ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్ చేసే విధానాన్ని బట్టి బేరిష్ క్రాసింగ్, బుల్లిష్ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా, ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 88 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్ ఏవరేజ్ కన్వర్జన్స్ డైవర్జన్స్) ఇండికేటర్ బుల్లిష్ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్ క్రాసోవర్ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా మారిన కంపెనీల్లో ధనలక్ష్మి బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, టీవీ18, నాల్కో, ఫ్యూచర్ కన్జూమర్, ఆన్‌మొబైల్ గ్లోబల్, బాలాజీ టెలి, సుదర్శన్ కెమికల్స్, సీడీఎస్ఎల్, హిమాద్రి స్పెషాలిటీ, గుజరాత్పిపావవ్, జేఎం ఫైనాన్షియల్స్, పెన్నార్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్ బలంగా ఉందని టెక్నికల్ విశ్లేషకులు చెపుతున్నారు. ఎంఏసీడీతోపాటు ఆర్ఎస్ఐ, బోలింగర్ బ్యాండ్ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.
వీటిలో బుల్లిష్ సంకేతాలు
ఈ షేర్లలో బేరిష్ క్రాసోవర్
మరోవైపు 14 షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్ క్రాసోవర్ ఏర్పడింది. బయోకాన్, బర్గర్ పెయింట్స్, జీఎస్పీఎల్, మహీంద్రా హాలిడేస్, ఇన్ఫోఎడ్జ్, డీసీఎం శ్రీరామ్ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్ బలహీనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
You may be interested
అటో, మెటల్ షేర్ల ర్యాలీ
Tuesday 29th October 2019మంగళవారంనాటి మార్కెట్ ర్యాలీని మెటల్, అటో షేర్లు ముందుండి నడిపిస్తున్నాయి. ఈ రంగ షేర్ల ర్యాలీ కారణంగా సూచీలు భారీ లాభాల్ని అర్జిస్తున్నాయి. మంగళవారం ఉదయం సెషన్లో ఎన్ఎస్ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4శాతం లాభపడగా, అటో రంగషేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్ 3.50శాతం పెరిగింది. అమెరికా చైనాల మధ్య మొదటి దశ ఒప్పంద చర్చలు సఫలీకృతమయ్యే దిశగా సాగుతుండంతో మెటల్ షేర్లకు కలిస్తోంది.
1500డాలర్ల దిగువకు పసిడి
Tuesday 29th October 2019అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతున్న తరుణంలో అంతర్జాతీయం మార్కెట్లో పసిడి ధరలు 1500డాలర్ల దిగువకు చేరుకున్నాయి. ఆసియాలో మంగళవారం ఉదయం గం.11:00లకు ఔన్స్ పసిడి ధర 2డాలర్ల నష్టంతో 1,494 వద్ద ట్రేడ్ అవుతోంది. అతి తొందరలోనే బీజింగ్, వాషింగ్టన్ మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చని ట్రంప్ తెలపడంతో అమెరికా చైనాల మధ్య జరుగుతున్న 16నెలల సుధీర్ఘ వాణిజ్య యుద్ధానికి ముగింపు పడవచ్చనే ఆశావహ అంచనాలతో