News


బీఈఈఆర్‌ నిష్పత్తి బాగుంది... సూచీలు ముందుకే!

Tuesday 14th January 2020
Markets_main1578974912.png-30912

ఇండెక్స్‌ కదలికలను సూచించే నిష్పత్తి
బీర్‌ నిష్పత్తి(బీఈఈఆర్‌- బాండ్‌ ఎర్నింగ్‌ ఈల్డ్‌ రేషియో) సుముఖంగా ఉన్నందున దేశీయ మార్కెట్లో పాజిటివ్‌ కదలికలే కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో నిఫ్టీలో అధిక పీఈ విలువ మరికొంత కాలం కొనసాగవచ్చంటున్నారు. పదేళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌కు, సూచీల ఎర్నింగ్‌ ఈల్డ్‌కు మధ్య నిష్పత్తిని బీఈఈఆర్‌ అంటారు. బాండ్స్‌ కన్నా ఈక్విటీలు ఇన్వెస్టర్లను ఎంత మేరకు ఆకర్షిస్తాయనే అంశాన్ని ఈ నిష్పత్తి తెలియజేస్తుంది. పదేళ్ల సరాసరి బీర్‌ నిష్పత్తి 1.17 కాగా ప్రస్తుతం ఈ నిష్పత్తి 1.22 వద్ద ఉంది. పదేళ్ల జీసెక్‌ బాండ్‌ ఈల్డ్‌ను మార్కెట్‌ ఎర్నింగ్‌ ఈల్డ్‌తో భాగించి బీర్‌ నిష్పత్తిని మదింపు చేస్తారు. ప్రస్తుతం దేశీయ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 6.58 శాతం వద్ద, నిఫ్టీ ఎర్నింగ్‌ ఈల్డ్‌ 5.4 శాతం వద్ద ఉన్నాయి. 6.58/5.4= 1.22 బీర్‌ నిష్పత్తి. 

ఈ నిష్పత్తి 2013 తర్వాత ఈ స్థాయిలకు రావడం ఇదే తొలిసారని యాక్సిస్‌ క్యాపిటల్‌ తెలిపింది. ఈ నిష్పత్తి అధికంగా ఉంటే సూచీల్లో పతనం ఎక్కువగా ఉండడం, నిష్పత్తి తక్కువగా ఉంటే సూచీలు అప్‌ట్రెండ్‌ చూపడం జరుగుతుంటుంది. ప్రస్తుతం బీర్‌ నిష్పత్తి పదేళ్ల సరాసరి నిష్పత్తికి దగ్గరగానే ఉన్నందున వాల్యూషన్లు అధికంగా ఉన్నా, సూచీలు ముందుకే సాగవచ్చని నిపుణుల అంచనా. ఇటీవల ఆర్‌బీఐ ఆపరేషన్‌ ట్విస్ట్‌ చేపట్టడంతో బాండ్‌ ఈల్డ్స్‌ దిగివచ్చాయి. నెలన్నరలో ఈ బాండ్‌ ఈల్డ్స్‌ దాదాపు 30 బీపీఎస్‌ మేర తగ్గాయి. ప్రస్తుతం నిఫ్టీ పీఈ 18.5 వద్ద ఉంది, ఇది పదేళ్ల సరాసరి కన్నా ఎక్కువే. కానీ బీర్‌ నిష్పత్తి పెద్దగా పెరగనందున పీఈతో ప్రాబ్లెం ఉండకపోవచ్చని నిపుణుల అభిప్రాయం.



You may be interested

స్టీల్‌ ధరల పెంపు? మెటల్‌ షేర్ల మెరుపు

Tuesday 14th January 2020

మెటల్‌ ఇండెక్స్‌ 1.4 శాతం ప్లస్‌ వేదాంతా, సెయిల్‌, టాటా స్టీల్‌ జోరు వచ్చే నెల నుంచీ స్టీల్‌ ధరలు మరోసారి పెరిగే అవకాశమన్నట్లు పరిశ్రమ వర్గాలు తాజాగా పేర్కొంటున్నాయి. ఇందుకు మెటల్‌కు కనిపిస్తున్న డిమాండుతోపాటు ముడివ్యయాలు పెరగడం కారణంకానున్నట్లు తెలియజేశాయి. వెరసి వరుసగా నాలుగో నెలలోనూ స్టీల్‌ ధరలు పెరిగే వీలున్నట్లు వివరించాయి. గత రెండు నెలలుగా స్టీల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. టన్నుకి రూ. 2,000 వరకూ హెచ్చాయి. స్టీల్‌ ధరల విషయంలో

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు

Tuesday 14th January 2020

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై కాంపిటీషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీసీఐ) సోమవారం దర్యాప్తునకు ఆదేశించింది. భారీ డిస్కౌంట్లు, ఒక వస్తువు కొంటే మరోకటి పొందేలా ఆఫర్లు, ఎంపిక చేసిన అమ్మకందారులు మాత్రమే ప్లాట్‌ఫామ్‌లలో విక్రయాలు జరపడం వంటి అంశాల్లో ఈ సంస్థలు దుర్వినియోగానికి పాల్పడట్లు ఆరోపణలు వచ్చినట్లు సీసీఐ వెల్లడించింది. ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు

Most from this category