News


బలమైన ప్రభుత్వం వస్తే 13వేలకు నిఫ్టీ!

Wednesday 22nd May 2019
Markets_main1558510272.png-25884

ప్రభుదాస్‌ లీలాధర్‌ అంచనా
కేంద్రంలో బలమైన ఎన్‌డీఏ ప్రభుత్వం వస్తే ఈ ఏడాదిలోనే నిఫ్టీ 13000 పాయింట్లను తాకుతుందని ప్రభుదాస్‌ లీలాధర్‌ రిటైల్‌ సీఈఓ సందీప్‌ రైచూర అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మార్కెట్లకు దిశానిర్ధేశం జరుగుతుందన్నారు. కేంద్రంలో బలమైన ఎన్‌డీఏ ‍ప్రభుత్వం లేదా కాంగ్రెస్‌ దన్నుతో బలమైన యూపీఏ ప్రభుత్వం వస్తే మార్కెట్లో భారీ ర్యాలీ ఉంటుందని అంచనా వేశారు. అయితే కాంగ్రెస్‌ మద్దతుతో థర్డ్‌ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడితే మాత్రం కరెక‌్షన్‌ తప్పదని, మార్కెట్లు నెగిటివ్‌గా స్పందిస్తాయని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన న్యాయ్‌ పథకం అమలైతే వినిమయ డిమాండ్‌ విపరీతంగా పెరుగుతుందని, అప్పుడు ఈ రంగానికి చెందిన వివిధ విభాగాల కంపెనీల రీరేటింగ్‌ ఛాన్సులు పెరుగుతాయని తెలిపారు. కానీ ఈ పథకం ఎకానమీపై తీవ్ర భారం చూపుతుందని, పెట్టుబడులను ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. 
వినిమయమే కీలకం
రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్‌లో పెట్టుబడులకు దేశీయ వినిమయం కీలకం కానుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వినిమయం, ఫైనాన్షియల్స్‌, ఓఎంసీ, ఇంజనీరింగ్‌ కంపెనీలపై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఒకపక్క లిక్విడిటీ కొరత, మరోపక్క ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్‌, పవర్‌; టెలికం రంగాల్లో ఒత్తిళ్లు ఎకానమీలో సందిగ్థత పెంచుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇబ్బందులు తొలగేవరకు మార్కెట్లు పరిమిత కదలికలు చూపుతాయని, ఎక్కువగా లార్జ్‌క్యాప్స్‌ వైపు ఇన్వెస్టర్ల మొగ్గు ఉంటుందని చెప్పారు. చిన్నస్టాకుల్లో అత్యంత తీవ్ర పరిశీలన అనంతరమే ఎంటర్‌ కావాలన్నారు. ప్రస్తుతానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్రిటానియా, టైటాన్‌, జుబిలాంట్‌ ఫుడ్‌, ఐజీఎల్‌, ఎల్‌అండ్‌టీ టెక్‌ షేర్లను దీర్ఘకాలానికి రికమండ్‌ చేస్తున్నామన్నారు. 

 You may be interested

జీఎస్‌పీఎల్‌ షేర్లకు ఫలితాల షాక్‌

Wednesday 22nd May 2019

గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు నిరుత్సాహపరచడంతో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్లో  9శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌లో కంపెనీ షేర్లు రూ.154.9ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీలు ఫలితాలను విడుదల చేసింది. క్యూ4 రూ. 2146 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 308 కోట్ల నష్టాలు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం

ద్రవ్య లభ్యతపై ఆర్‌బీఐ ప్రత్యేక దృష్టి!

Wednesday 22nd May 2019

ఫైనాన్షియల్‌ సంస్థల లిక్విడిటీ పర్యవేక్షణ దీనికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చెన్నై: బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) సహా ఫైనాన్షియల్‌ సంస్థలకు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు తలెత్తకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి, తగిన సూచనలు చేయడానికి ఆర్‌బీఐలోనే అంతర్గతంగా ప్రత్యేక విభాగాన్ని (కేడర్‌) ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం నేపథ్యంలో నాన్‌-బ్యాంకింగ్‌

Most from this category