News


బుల్లిష్‌ రోలోవర్లే అధికం!

Friday 31st May 2019
Markets_main1559282830.png-26010

జూన్‌ సీరిస్‌లోకి ఎక్కువగా రోలయిన లాంగ్స్‌
ఎన్‌డీఏ ప్రభుత్వం మరోమారు కొలువు తీరిన నేపథ్యంలో ఎకానమీలో పునరుజ్జీవం ఉంటుందన్న నమ్మకాలు ఎక్కువయ్యాయి. దీంతో సూచీల్లో భారీ పరుగు కనిపించింది. మరోపక్క మార్చి నుంచి భారీగా ర్యాలీ జరపడంతో సూచీల్లో అలసట వచ్చిఉంటుందని, ఇకపై ఎంతమేర పరుగు కొనసాగిస్తాయోనని కొందరు నిపుణులు సందేహపడ్డారు. కానీ తాజాగా జూన్‌ ఎఫ్‌అండ్‌ఓ రోలోవర్లు చూస్తే సూచీల్లో ఇంకా అలుపు రాలేదని, మరింత పరుగు ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. జూన్‌లో నిఫ్టీ ఫ్యూచర్లలో 72 శాతం రోలోవర్‌ కనిపించింది. అదేవిధంగా స్టాక్స్‌ ఫ్యూచర్స్‌లో 89 శాతం రోలోవర్లు నమోదయ్యాయి. మూడునెలల సరాసరి నిఫ్టీ రోలోవర్లు 69 శాతం కాగా, స్టాక్‌ రోలోవర్లు 85 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫ్యూచర్స్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 1.37 లక్షల కోట్ల రూపాయలుంది. మే ఎక్స్‌పైరీ రోజుతో పోలిస్తే ఇది 0.01 లక్షల కోట్ల రూపాయలు అధికం. 
వివిధ సూచీల్లో రోలోవర్లు ఇలా ఉన్నాయి...

బలమైన రోలోవర్లు నమోదు కావడం జూన్‌ సీరిస్‌లో లాంగ్స్‌ కొనసాగింపునకు నిదర్శనమని, జూన్‌లో నిఫ్టీ కొత్త గరిష్టాలకు చేరవచ్చని, కనీసం 12200- 12300 పాయింట్ల రేంజ్‌ను తాకవచ్చని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి యోగేశ్‌ చెప్పారు. ఆ తర్వాత బలమైన ప్రాఫిట్‌ బుకింగ్‌ ఉండొచ్చన్నారు. జూన్‌ సీరిస్‌ తొలి రోజు సూచీలు తమ ఆల్‌టైమ్‌ హైలకు దగ్గరగా ట్రేడవుతున్నాయి.  పక్షం రోజులుగా ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే మన సూచీలు మంచి ప్రదర్శన ఇస్తున్నాయని, ఇదే తరహా కొనసాగవచ్చని యోగేశ్‌ చెప్పారు. ఇకపై మార్కెట్ల దృష్టి అంతర్జాతీయ అంశాలు, రుతుపవనాల గమనంవైపు మరలవచ్చని అంచనా వేశారు. ముఖ్యంగా ట్రేడ్‌వార్‌ సమస్య ఇకపై మార్కెట్ల గమనాన్ని శాసిస్తుందన్నారు.

డెరివేటివ్స్‌ ప్రకారం నిఫ్టీకి దిగువన 11600 పాయింట్ల వద్ద బలమైన మద్దతు ఉంది. చార్టుల ప్రకారం ఈ మద్దతు దిగువకు సూచీలు రాకపోవచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు రాజేశ్‌ చెప్పారు. నిఫ్టీ జూన్‌ ఆప్షన్స్‌లో 12500, 12000 పాయింట్ల వద్ద ఎక్కువ కాల్స్‌ ఉన్నాయి. దిగువన 11500 పాయింట్ల వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ 11700 పరిసరాలకు దిగివస్తే కొనుగోళ్లకు అవకాశంగా భావించాలని ఏంజల్‌ బ్రోకింగ్‌ సూచించింది. You may be interested

1290 డాలర్లపైకి పసిడి ధర

Friday 31st May 2019

ప్రపంచమార్కెట్లో శుక్రవారం పసిడి ధర భారీగా ర్యాలీ చేస్తుంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో 6.50 డాలర్లు పెరిగి 1,293.50 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళన భయాలకు తోడు మెక్సికో దిగుమతులపై 5శాతం సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత అంచనాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెంచుతున్నాయి. అమెరికా దక్షిణ సరిహద్దు దేశమైన మెక్సికో నుంచి అక్రమ

శుక్రవారం వార్తల్లో షేర్లు

Friday 31st May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు  జెట్‌ ఎయిరవేస్‌:- బిడ్డింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా క్యూ4 ఫలితాలు ప్రకటన ఇప్పట్లో ఉండదని కంపెనీ వర్గాలు తెలిపాయి.  భారతీ ఎయిర్‌టెల్‌:- గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏవరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌(ఏఆర్‌పీయూ) రేటు రూ.123లు నమోదైంది. కంపెనీ లిస్టింగ్‌ నాటి నుంచి ఏఆర్‌పీయూ ఇంత స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఇదే కాలానికి దేశీయంగా 16 లక్షల యూజర్లను కోల్పోయింది.

Most from this category