News


ఈ నెల కూడా బుల్లిష్‌ రోలోవర్లే అధికం!

Friday 28th June 2019
Markets_main1561704050.png-26648

జూలై సీరిస్‌లోకి ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో బుల్లి్‌ష్‌ రోలోవర్లు అధికంగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గురువారం జూన్‌ సీరిస్‌ ముగిసిపోవడంతో లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు తమ పొజిషన్లను జూలై సీరిస్‌కు మార్చుకున్నారు. అంతర్జాతీయ టెన్షన్లు, రుతుపవనాల జాప్యం, మందగమన భయాల నేపథ్యంలో మార్కెట్లో ఆశావహ ధృక్పథం తక్కువగా ఉంది. ఈ వారం బడ్జెట్‌ రానున్న నేపథ్యంలో రోలోవర్లు అధికంగా జరిగాయని నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్లో వచ్చే కీలక ప్రకటనల ఆధారంగా తదుపరి మార్కెట్‌ గమనం ఉంటుందని అంచనా. వరుసగా మూడు నెలలు లాభాలతో ముగిసిన మార్కెట్లు జూన్‌ సీరిస్‌ను నష్టాల్లో ముగించాయి. నిఫ్టీ కీలక 12 వేల పాయింట్లకు చేరువుతున్నందున ట్రేడర్లు చాలా అప్రమత్తంగా ఉన్నారని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. దీనికితోడు దేశీయంగా, అంతర్జాతీయంగా పలు రిస్కులు పెరగడం కూడా ట్రేడర్లలో జాగ్రత్త పెంచిందన్నారు. జూలై సీరిస్‌లో నిఫ్టీ ఫ్యూచర్‌ రోలోవర్లు 80 శాతం జరిగాయి. గత మూడు నెలల సరాసరి 73 శాతం కన్నా ఇది ఎక్కువ. నిఫ్టీ ఓఐ మాత్రం ఫ్లాట్‌గా 1.92 కోట్ల షేర్ల వద్ద ఉంది. స్టాక్స్‌లో రోలోవర్‌ కాస్ట్‌ తక్కువగా ఉందని, ఇన్వెస్టర్లు వేచిచూసే మూడ్‌లో ఉన్నారని మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిస్కౌంట్‌లో ఉండడంతో రోలోవర్లలో ఉధృతి తగ్గిందని, వీఐఎక్స్‌లో పెద్దగా మార్పులు లేకపోవడాన్ని బట్టి బడ్జెట్లో భారీ కుదుపులేమీ ఉండవని భావిస్తున్నట్లు తెలిపింది. ఆప్షన్స్‌ డేటా చూస్తే నిఫ్టీ ఈ సీరిస్‌లో 12000- 11600 పాయింట్ల మధ్య కదలాడేందుకు ఎక్కువ ఛాన్సులున్నాయి. ఒకవేళ నిఫ్టీ కీలక 11600 పాయింట్ల మద్దతు కోల్పోతే కరెక‌్షన్‌ ఉండొచ్చు. నిఫ్టీ కాల్స్‌ 12వేల పాయింట్ల వద్ద, పుట్స్‌ 11000 పాయింట్ల వద్ద ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీకి 12050-12100 పాయింట్ల వద్ద గట్టి నిరోధం ఉంది. 


 



You may be interested

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ జోరు

Friday 28th June 2019

2.50శాతం ర్యాలీ చేసిన ​పీఎస్‌యూబ్యాంక్‌ ఇండెక్స్‌  కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.40 వేల కోట్ల అదనపు నిధులను కేటాయించవచ్చనే అంచనాలతో శుక్రవారం ఈ రంగానికి చెందిన షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 31,281.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి పీఎస్‌యూ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ 2.50శాతం

బీఓఏ ఏఎక్స్‌ఏ స్కీమ్‌ ఎన్‌ఏవీ 26.25 శాతం పతనం

Friday 28th June 2019

డెట్‌ మూచ్యువల్‌ ఫండ్‌ స్కీమ్‌ అయిన బీఓఐ ఏఎక్స్ఏ క్రెడిట్‌ రిస్క్‌, సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌ అనుబంధ సంస్థ అయిన సింటెక్స్‌ బీఏపీఎల్‌లోని మొత్తం పెట్టుబడులను ఫండ్‌ రైట్‌డౌన్‌ చేశాక ఈ స్కీము నికర ఆస్తి విలువ బుధవారం 26.25 శాతం తగ్గింది. ఈ నెల 15వ తేదిన బీఓఐ ఏఎక్స్ఏ రిస్క్‌ స్కీమ్‌ సింటెక్స్‌లో చేసిన పెట్టుబడులలో 55 శాతాన్ని రైట్‌డౌన్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు దీని నికర ఆస్తి విలువ ఒకే రోజు 15.34శాతం

Most from this category